Latest Updates
-
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం!
యువతలో అధికమవుతున్న గుండె జబ్బులు!

ఈ రకంగా యువత గుండె జబ్బులకు గురికావటమనేది సరైన శారీరక వ్యాయామాలు లేకపోవటం, మనోవేదన, అనారోగ్య ఆహారాలు తినడం కారణాలుగా పరిశోధకులు చెపుతారు. ఈ గుండె జబ్బులు నేడు గ్రామీణ ప్రాంతాలలో సైతం అధికంగానే వుంటున్నాయని నిపుణులు చెపుతున్నారు.
మరణాల సంఖ్యలో అధికభాగం గుండెపోటు వలననే అని నానాటికి పెరుగుతున్న గుండె జబ్బుల రోగుల సంఖ్యకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ సైతం ఆందోళన చెందుతోంది.
రోజువారీ జీవనంలోనే ఆందోళన, ఒత్తిడి పెరిగిన కారణంగా ఈ రకమైన గుండె సమస్యలు వస్తున్నాయని వీరి నివేదిక తెలుపుతోంది. ఒత్తిడే కాకుండా యువత అధిక నూనెల ఆహారాలు తీసుకోవడం, సామాజిక, ఆర్ధిక కారణాలు, గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన లేకపోవడం వంటివి కూడా వీరికి రిస్కు కలిగిస్తున్నాయన్నారు. హస్పిటల్ కు వచ్చే వారిలో 20 శాతం యువకులేనని వీరు పురుషులు 40 లలోపు, స్త్రీలు 45 సంవత్సరాల వయసు లోపు వున్నవారేనని హాస్పిటల్ గణాంకాలు చెపుతున్నాయి. జీవన విధానాలు మారాలని, ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం, ఒత్తిడి, ఆందోళన లేని జీవనం, ప్రతిరోజూ తగినంత వ్యాయామం వంటివి యువతకు అవసరమని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాదు, తినే ఆహారాలలో కూడా మార్పులు చేయాలి. వీరు తినదగిన ఆహారాలు ఎలా వుంటాయనేది పరిశీలిస్తే...!
అధిక బరువున్నవారు తినాల్సిన ఆహారాలు - పండ్లు, కూరగాయలు - వీటిలో పీచు అధికంగా వుంటుంది. అది కొల్లెస్టరాల్ స్ధాయి తగ్గిస్తుంది. కేరట్లు, టమాటాలు, బెర్రీలు, ఆరెంజస్, పపయా, వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండే పండ్లు తినాలి. తృణ ధాన్యాలు - గోధుమ, వివిధ రకాల ధాన్యాలు గోధుమ బ్రెడ్, రోటి, పస్తా, బ్రౌన్ రైస్, ఓట్స్, రాగి, జోవార్, బజ్రా వంటివి తినాలి. మొలకెత్తిన విత్తనాలు, కిడ్నీ బీన్స్, బఠాణీలు, మొదలైనవి నీటిలో కరిగే పీచు కొల్లెస్టరాల్ లెవెల్ తగ్గిస్తుంది. అవిసె గింజలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కలిగి వుంటాయి. వీటిని బ్రేక్ ఫాస్ట్ లో చల్లుకొని తింటే మంచి ఫలితం వుంటుంది.
తక్కువ కొవ్వు కల పాల ఉత్పత్తులు - వెన్న తీసిన పాలు, పెరుగు, ఇంటిలో తయారు చేసిన పనీర్ మొదలైనవి అధిక కాల్షియం కలిగి శరీర కొవ్వు తగ్గిస్తాయి. చేపలలో సల్మాన్, టూనా జాతివి ఒమేగా 3 కలిగి వుంటాయి కనుక అవి మంచి కొల్లెస్టరాల్ పెంచుతాయి. సోయా ఉత్పత్తులు రక్తనాళాలలో గడ్డలను కరిగిస్తాయి. గ్రీన్ టీ తాగితే...మంచి కొల్లెస్టరాల్ పెరుగుతుంది.
ఈ ఆహారాలు తింటూ, ప్రతిరోజూ కనీసం 30 నుండి 45 నిమిషాలపాటు తగినంత శారీరక వ్యాయామాలు వేగంగా నడవటం, జాగింగ్, స్విమ్మింగ్, సైకిలింగ్, మొదలైనవి చేస్తే కేలరీలు ఖర్చు అయి బరువు తగ్గిపోతారు. ఇక గుండె ఆరోగ్యంగా కొట్టుకుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications