Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
చిన్న వయసుల గుండె జబ్బులు...!

కుటుంబ చరిత్ర, ఒత్తిడి, కాలుష్యం, రక్తపోటు, డయాబెటీస్, కొల్లెస్టరాల్ వంటివి ప్రధానంగా చిన్నవయసు వారిలో గుండెపోట్లు కలిగిస్తున్నాయి. మహిళలు తప్పక తమ జీవన విధానం మార్చుకోవాలని వ్యాయామాలు, నియమిత ఆహారం, ధ్యానం వంటివి తప్పక చేయాలని, మెనోపాజ్ దశకు చేరుతున్నవారు, తప్పక సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. గుండెపోటు వచ్చే లక్షణాలు ఎలా? ఛాతీలో వస్తూ, పోతూ వుండే అసౌకర్యం. లేదా కొద్ది నిమిషాలుండి పోయేది. శరీర పైభాగంలో నొప్పి లేదా వీపు, మెడ, దవడ, పొట్ట, ఒక చేయి లేదా రెండు చేతులలోను నొప్పి లేదా అసౌకర్యం.ఛాతీ నొప్పి కలిగి లేదా నొప్పి లేకుండా శ్వాస మందగించటం, చెమటలు పట్టడం, వికారం, కొద్దిపాటి తలనొప్పి వంటివి గుండెపోటు వచ్చేటందుకు చిహ్నాలుగా కనపడతాయి.
చిన్న వయసులోనే గుండె పోటు లేదా గుండె సంబంధిత సమస్యలు రాకుండా వుండాలంటే, శరీరంలో కొవ్వు కణాల సంఖ్య తగ్గించుకోవాలి. ఊబకాయం ఏర్పడకుండా చూసుకోవాలి. అధిక బరువు గుండెకు చేటు తెనస్తుంది. శరీరం ఎత్తుకు తగిన బరువు వుంటే, జీవక్రియ నియంత్రణ సమర్ధవంతంగా వుంటుంది. జీవక్రియ సరిగా సాగాలంటే, ప్రతిరోజూ తగినంత రాత్రి నిద్ర పొందాలి.
మన శరీరంలోని రసాయనిక చర్యలన్ని సర్కాడియన్ రిధమ్ లేదా బయోలాజికల్ క్లాక్ పై ఆధారపడివుంటాయి. పగటి గంటలు, మెళకువ కొరకు, రాత్రి గంటలు నిద్రకొరకు తప్పక కేటాయించాలి. వీటిలో మార్పు చేసుకుంటే, శారీరక చర్యలకు ఆటంకం కలిగి మీలోని జీవప్రక్రియ సమతుల్యత కోల్పోతుంది. ఫలితంగా గుండె సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. సాధారణంగా మానవులలో ఊబకాయం వంటి సమస్యలు జంక్ ఆహారం మరియు షుగర్లు, కొవ్వులు అధికంగా వుండే ఆహారాలు అధికంగా తీసుకున్నందు వలన వస్తాయి. మనం తీసుకునే బేకరీ ఆహారాలు, జంక్ ఫుడ్ వంటివి ఊబకాయం ఇవ్వటమే కాదు గుండె జబ్బులు కూడా తెప్పించి అనారోగ్యంపాలు చేస్తున్నాయని గ్రహించాలి. నేటి యువత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే, వారికిపుట్టబోయే సంతతి కూడా ఆరోగ్యకరంగా వుంటుందని గ్రహించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications