For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సీ ఫుడ్ తినండి.. హార్ట్ అటాక్ కు దూరంగా జీవించండి..

|

Is Seafood Good for the Heart...?
సాదారణంగా ‘సీ ఫుడ్'ను బ్రైయిన్ ఫుడ్ అంటుంటారు. ఎందుకంటే సీ ఫుడ్ ను వారంలో కనీసం మూడుసార్లైన తీసుకొనేవారికి డాక్టర్ అవసరం ఉండదంటారు. ముఖ్యంగా హార్ట్ పేషంట్స్ కు. హార్ట్ పేషంట్స్ తీసుకొనే ఆలీవ్ ఆయిల్, నట్స్ కంటే వంద రెట్లు సీ ఫుడ్డే బెటర్ అంటున్నారు నిపుణులు.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొలెస్ట్రాల్ తక్కువ ఉండాల్సిందే. మరి మీలో కొలెస్ట్రాల్ ఎంత ఉందో ఎప్పుడైనా టెస్టు చేయించుకున్నారా? ఒకవేళ పరీక్షల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ రిస్క్ జోన్‌లో ఉందని తెలిస్తే ఏం చేస్తారు? ఏం చేయాలో...కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించుకోవాలో నిపుణులు సూచిస్తున్న మార్గాలను చదవండి.

ఏదైనా ఒక వస్తువు తినేముందు దానిపైన ఉండే లేబుల్‌ను చదవండి. షుగర్స్, ఇతర పదార్థాలు మీ బరువు పెరగటానికి దోహదపడతాయి. ఇది కొలెస్ట్రాల్ పెరగటానికి దారితీస్తుంది. సాచ్యురేటెడ్ ఫాట్స్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలకు దూరంగా ఉండండి. ఫ్రక్టోస్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోకండి.

సముద్ర ఆహారం తీసుకుంటే గుండెపోటును 50 శాతం వరకు తగ్గించవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. వారానికి ఒకసారి లేదా రెండుసార్లు సీ ఫుడ్‌ను ఆహారంగా తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత రోగాలకు చెక్ పెట్టవచ్చునని లండన్ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) సూచిస్తున్నట్లు డెయిల్ మెయిల్ ప్రచురించింది.

రొయ్యలు, పీతలు, స్క్విడ్, ఆక్టోపస్‌లలో విటమిన్స్, మినరల్స్ మెండుగా ఉన్నాయని ఎన్‌హెచ్ఎస్ తెలిపింది. సల్మోన్ అనే సముద్ర చేప నుంచి వచ్చే చేపనూనె గుండెపోటును నియంత్రిస్తుంది. సముద్రపు ఆహారంలో కీలక ఫ్యాటీ యాసిడ్ ఉందని ఇది.. గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుందని ఎన్‌హెచ్ఎస్ తెలిపింది.

సముద్రపు ఆహారంలో కొవ్వు శాతం ఇతర మాంసాహారంతో పాటు చీజ్, ఫాస్ట్‌ఫుడ్‌లకంటే తక్కువగా ఉంటుంది. ఇంకా రక్తంలోని కొవ్వు శాతాన్ని నియంత్రించడంలో సముద్రపు ఆహారం తీసుకోవడం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, గర్భధారణ సమయంలో ముడి షెల్ల్ఫిష్ మరియు రా సీ ఫుడ్‌ను తీసుకోకూడదని ఎన్‌హెచ్ఎస్ వ్యతిరేకిస్తోంది.

ఇది పాలీఅన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. దీన్ని తీసుకోవడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్(ఎల్‌డీఎల్)ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్(హెచ్‌డీఎల్)పెరిగేలా చేస్తుంది. డీహెచ్ఎ ఎక్కువగా చేపలలో లభిస్తుంది. ఒకవేళ మీకు సీ ఫుడ్ తినడం ఇష్టం లేనట్లయితే ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను తీసుకోవచ్చు.

English summary

Is Seafood Good for the Heart...? | హార్ట్ అటాక్ ను నియంత్రించే సీ ఫుడ్...!

Fish and omega-3 fatty acid consumption is associated with a reduced risk of coronary heart disease in women, particularly coronary heart disease death. Scientific evidence shows that the consumption of seafood has positive health benefits for all age groups, and significantly higher benefits for certain medical conditions.
Story first published:Friday, August 3, 2012, 8:58 [IST]
Desktop Bottom Promotion