Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గుండె పోటుకు రాకుండా ముందుగా తీసుకోవల్సి జాగ్రత్తలు...

పొగతాగడం గుండెపోటుకు ప్రధాన కారణం. దాన్ని తక్షణం ఆపేయాలి. పొగాకు వినియోగం ఏ రూపంలో ఉన్నా దాని వల్ల గుండెకు ప్రమాదం అని గుర్తించాలి. పొగాకులోని రసాయనాలు రక్తపోటును, గుండెవేగాన్ని పెంచి, రక్తంలోని ఆక్సిజన్ పాళ్లను తగ్గిస్తాయి. అందువల్ల పొగాకు ఏ రూపంలో ఉన్నా ప్రమాదమే.
అధికర రక్తపోటు (హైబీపీ) ఉన్నవాళ్లు ఆహార నియువూలు తప్పనిసరిగా పాటించాలి. హైబీపీ ఉన్నవాళ్లు... పళ్లు, కూరగాయులు, ఆకుకూరలు పుష్కలంగా తీసుకోవాలి. ఉప్పు (సోడియుం) తగ్గించాలి. బరువు పెరక్కుండా చూసుకోవాలి.
హై బీపీ ఉంటే దాన్ని నియుంత్రించుకోవడం కోసం జీవన విధానం (లైఫ్‌స్టైల్) లో మవూర్పులు పాటించాలి. అంటే... ఉప్పుతో పాటు సోడియుం పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలైన నిల్వ ఆహారం (ప్రిజర్వ్‌డ్ ఫుడ్స్), బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు (పాపడ్), క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి. అలాగే తాజాపళ్లు, పొట్టు ఉన్న తృణధాన్యాలు ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, ఫాస్ట్ ఫుడ్ తీసుకోకూడదు. కొలెస్ట్రాల్, నూనెలు తక్కువగా తీసుకోవాలి. గుడ్డులోని పచ్చసొనను తీసుకోకూడదు. తాజా పళ్లు, ఆకుపచ్చటి కూరగాయలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్) చాలా మంచివి. వేటమాంసం (రెడ్ మీట్), కొవ్వు పాళ్లు ఎక్కువగా ఉండే పాల ఉత్పాదనలు, వెన్న, కొబ్బరి లాంటివి తీసుకోకపోవడమే మంచిది.
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. అందుకు యోగా, ప్రాణాయామం వంటివి చేయవచ్చు. రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు విధిగా నిద్రపోవాలి.
నడుం కొలత కూడా ఒక సూచనే... మీ నడుం కొలతను ఒకసారి పరీశీలించుకోండి. మీరు పురుషులైతే మీ నడుం కొలత 40 అంగుళాల కంటే ఎక్కువగా, స్త్రీలు అయితే 35 అంగుళాల కంటే ఎక్కువగా ఉంటే మీకు గుండెజబ్బుల రిస్క్ ఎక్కువ అని గుర్తించండి.
పైన పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్స్, స్థూలకాయం, నడుం కొలత పెద్దదిగా ఉండటం వంటివి ఉన్నవారు యుక్తవయస్కులైనా ఒకసారి కార్డియాలజిస్ట్ ను సంప్రదించి వారు సూచించిన మేరకు పరీక్షలు చేయించుకుని నిశ్చింతగా ఉండవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications