Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
గుండె ఆరోగ్యానికి వృక్ష సంబంధిత ఆహారాలు!
గుండె ఆరోగ్యానికి తక్కువ కార్బోహైడ్రేట్ల ఆహరం కంటే కూడా తక్కువ కొవ్వు కల ఆహారం మెరుగు అని నిపుణులు చెపుతారు. కార్బో హైడ్రేట్లు తక్కువకల ఆహారం బరువు తగ్గించవచ్చు మీలోని బ్లడ్ ప్రెజర్ తగ్గవచ్చు. కాని అది గుండె ఆరోగ్యానికి మంచిదికాదు. తక్కువ కొవ్వుకల ఆహారాలు తింటే గుండెకు ఆరోగ్యం చేకూరుతుంది అంటున్నారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కు చెందిన ఒక స్టడీ నిర్వహించిన షేన్ ఫిలిప్స్. లో కార్బ్ ఆహారాలలో రోజులో కావలసిన ఫోలిక్ యాసిడ్ తక్కువ. ఫోలిక్ యాసిడ్ తక్కువ కొవ్వు ఆహారాలలో అధికం. ఫోలిక్ యాసిడ్ కు గుండె జబ్బులు రాకుండా చేసే గుణం ఉంది.

తక్కువ కార్బో హైడ్రేట్ల ఆహారం గుండె ఆరోగ్యానికి హాని చేస్తోందని పరిశోధకులు వెల్లడించారు. దానికి కారణం తగినంత ఫోలిక్ యాసిడ్ అందకపోవటమేనని తెలిపారు. తక్కువ కొవ్వు కల ఆహారాలు తీసుకున్నవారు తగినంత రక్తప్రసరణ కలిగి ఆరోగ్య వంతులుగా ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. తక్కువ కొవ్వు కల ఆహారాలు ఏవి?ఇవి కార్బో హైడ్రేట్లు, పీచు కలిగిన గింజ ధాన్య ఆహారాలు, పండ్లు, కూరగాయలు, చిక్కుడు, బఠాణీ మొదలైనవి తక్కువ కొవ్వు ఆహారాలలో జంతు సంబంధిత ఆహారాలు ఉండవు. పాలు పెరుగు వంటివి వీటికిందకు రావు.
కూరగాయలలో కొవ్వు తక్కువే. ఉడికించిన కూరలు మంచి పోషకాలు కలిగి ఉంటాయి. వేపుడుకు బదులు ఉడికించిన లేదా పచ్చివి తింటే మంచిదని తెలిపారు. కూరగాయలను రైతా, లేదా చట్నీలుగా చేసుకొని కూడా తినవచ్చు. లేదా కూరలను పప్పులు మొదలైన వాటితో కలిపి తినవచ్చు. సాధారణంగా భారతీయ వంటకాలలో పప్పులలో కూరలు వేసి లేదా ఆకు కూరలు వేసి తినటం ఆరోగ్యకరంగా వస్తోంది. అయితే, నేటి రోజులలో అనారోగ్య వంటల విధానంగా నూనెలలో అధికంగా వేయించిన కూరలు హానికరం అని తెలిపారు. లేదా కూరలను అన్నంలో కలిపి ఉడికించి కూడా తినవచ్చు. తక్కువ కొవ్వు ఉండే ఆహారాలు దీర్ఘకాలిక ఆరోగ్యానికి మంచివి. వృక్ష సంబంధిత నూనెల వాడకం గుండె జబ్బులు, డయాబెటీస్ వంటి మొండి రోగాలు రాకుండా నివారిస్తుంది.
కార్బో హైడ్రేట్లనుండి మరియు కొవ్వులనుండి వచ్చే కేలరీలు మీకు బరువు త్వరగా పొందేందుకు దోహదం చేస్తాయి. కనుక కార్బో హైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు తగ్గించి కొవ్వు అధికంగా ఉండే వృక్ష సంబంధిత ఆహారాలు తింటే, గుండె ఆరోగ్యం దీర్ఘకాలం సమస్యలు లేకుండా ఉంటుంది. అంతేకాక, కార్బో హైడ్రేట్ల అధిక వినియోగం వలన వచ్చే బ్రెస్ట్ కేన్సర్, పేగు కేన్సర్, గుండె జబ్బులు కూడా అరికట్టబడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications