Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
గుండె సంబంధిత వ్యాధులు!

వాల్వులర్ హార్ట్ డిసీజ్ - ఈ గుండె సమస్యలో గుండె వాల్వులు తెరుచుకోవు. మూసుకొనిపోయి వుండి శరీరంలోని ఇతర భాగాలకు రక్తాన్ని తక్కువ చేస్తాయి.
ఇన్ ఫెక్టివ్ ఎండోకార్డిటిస్ - గుండెకు వచ్చే ఈ పరిస్ధితిలో గుండె వాల్వుకు బాక్టీరియా సోకుతుంది. ఈ వాల్వు లోకి బ్లడ్ రాదు కనుక ఈ భాగానికి బాక్టీరియా సోకితే దానితో పోరాటానికి శరీరాన్ని ఱక్షించే వైట్ బ్లడ్ సెల్స్అందులోకి రాలేవు. అక్కడి బాక్టీరియాతో పోరాడలేవు. యాంటీ బయాటిక్స్ వేసినా అవి కూడా రక్తం ద్వారానే వచ్చి వాటితో పోరాడాలి. కనుక గుండెలోని ఈ భాగానికి బాక్టీరియా సోకరాదు. రుమాటిక్ ఫీవర్ వచ్చిన వారికి ఈ సమస్య వచ్చే అవకాశం వుంది.
కన్ జనిటాల్ హార్ట్ డిసీజ్ - దీనినే కన్ జనిటాల్ హార్ట్ డిసీజ్ అని కూడా అంటారు. కొత్తగా పుట్టిన బేబీ గుండె అది వుండవలసిన రీతిలో లేకుంటే దానిని కన్ జనిటాల్ హార్ట్ డిసీజ్ అంటారు. ఇది పుటుకలో వచ్చే సమస్య. శిశువులలో వచ్చే సమస్యలలో గుండె సంబంధిత సమస్యలు సాధారణమైపోయాయి. పసికందుల మరణాలు చాలావరకు గుండె సంబంధంగానే జరుగుతున్నాయి.
కరోనరీ హార్ట్ డిసీజ్ - దీనిలో గుండెకు రక్తం చేరవేసే రక్తనాళాలు సన్నబడిపోతాయి. సన్నబడటం వలన వాటిలో రక్తం ప్రవహించదు. గుండెకు అవసరమైన ఆక్సిజన్ అందదు. గుండెకు తగిన రక్తం, ఆక్సిజన్ అందక పోవటంతో గుండెపోటుకు దోవతీసే ప్రమాదం వుంది.
ఏట్రియల్ మైక్సోమా - ఈ సమస్యలో గుండె గోడ అంటే ఏట్రియల్ సెప్టం....ఒక కేన్సర్ సంబంధితం కాని పుండు పెరుగుతుంది. సాధారణంగా ఇది గోడకు ఎడమ పక్క వస్తుంది. అది కనుక కుడి భాగానికి వచ్చినట్లయితే గుండె కొట్టుకోవడంలో తేడాలు వచ్చే అవకాశం వుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications