Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గుండె జబ్బుల రోగులకు రతిక్రీడ అవసరమా?

సంభోగం గుండె పోటును అధికం చేసే అవకాశాలను ఇవ్వదు. ఒక్క ఇరవై నిమిషాలపాటు నడిస్తే గుండెపై ఎంత ప్రభావం వుంటుందో రతిక్రీడ చేస్తే గుండెపై అంతే ప్రభావం వుంటుంది. సంభోగంలో ఉద్రేకం పొందే కొలది శ్వాస అధికమవుతుంది, గుండె కొట్టుకోడం అధికమవుతుంది, బి.పి. కూడా కొద్దిపాటిగా పెరుగుతుంది. అంతేకాదు, మీ చర్మం కూడా రక్తం వడిగా ప్రవహించి ఎరుపెక్కుతుంది. సెక్సు ఆరాటం పెరిగే కొలది హార్టు కోట్టుకోడం, బి.పి. లు పెరుగుతూనే వుంటాయి.
స్కలనం అయిందంటే చాలు ఒత్తిడి అంతా మటుమాయం. రతి చర్యలో గుండె నిమిషానికి 90 నుండి 145 సార్లు కొట్టుకుంటుంది. సెక్స్ కారణంగా గుండె పోటు వచ్చి మరణించిన వారు ఒక శాతం మాత్రమేనని రీసెర్చి చెపుతోంది. గుండె ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ ను సంప్రదించి రతిక్రీడ ఆచరించవచ్చు. అయితే, దీని ప్రభావం రోగి వయసు, భాగస్వామితోగల గత పరిచయం, గతంలోని అతని సెక్స్ నిర్వహణలపై ఆధారపడి వుంటుంది. డాక్టర్లు మీ శరీర సామర్ధ్యతను సెక్స్ సంబంధిత చర్యలపై పరీక్షలు జరిపి సురక్షితమా కాదా అనేది తెలుపుతారు.
గుండెకు చేయబడిన శస్త్ర చికిత్సకు తోడు వయసు పైబడటంతో కొంతమందికి రతిక్రీడపై కోరికలు వెనుకబడతాయి. అంతేకాక, గుండెకు సంబంధించి వాడే మందులు కూడా సెక్స్ కోర్కెలపై ప్రభావం తగ్గిస్తాయి. గుండె జబ్బులు వచ్చిన వారు విచారంగాను, మనోవ్యధతోను లేదా భయంగాను వుంటారు. ఎపుడూ అలసి నట్లుంటారు. నిద్రలేమి లేదా అధిక నిద్రలు కలిగి వుంటారు. గుండె పోటు తర్వాత ఆహారం తింటే ఎక్కువగా తిని బరువు పెరుగుతారు. లేదా తక్కువతిని డీలా పడతారు. ఈ పరిణామాలతో సెక్స్ పై వాంఛను కోల్పోతారు. ఈ మానసిక మార్పులను జీవిత భాగస్వామి ఎప్పటికపుడు కనిపెడుతూ వుండాలి. అలాగని వారికి కోరిక కలిగితే తిరస్కరించరాదు. గుండె జబ్బుల రోగి సైతం పరిధికి మించని ఆరోగ్యకరమైన సెక్స్ చర్యలు చేయవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications