Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
గుండె జబ్బులుంటే....కాళ్ళకు వ్యాయామం చేయాలి!

చేయబడిన అనేకపరిశోధనలలో కాలి కండరాల బలహీనతకు గుండె జబ్బులకు సంబంధం వున్నట్లు తేలింది. తీవ్ర గుండెనొప్పి వస్తే, కాలి కండరాలు బలహీనపడతాయి. గుండె జబ్బులు వచ్చినవారు కాలి కండరాలకు వ్యాయామాలు చేయటం నిర్లక్ష్యం చేస్తారు. కొద్దిమంది ప్రయత్నించినప్పటికి కాలి వ్యాయామానికి ప్రాధాన్యతనివ్వక చివరకు దానిని వదిలివేస్తారు.
ఒక సారి గుండెపోటు వచ్చిన తర్వాత, కాలికండరాలు బలపరిచే వ్యాయామాలు చేస్తే, రెండవసారి వచ్చే గుండెపోటు తీవ్రంగా వుండదని, బలహీనంగా వుంటుందని లీడ్స్ యూనివర్శిటీ రీసెర్చర్లు తమ పరిశోధనలో వెల్లడించారు. కాలికండరాలలో పుట్టే వేడి ఆక్సిజన్ అధికం చేస్తుందని, కండరాలు అలసటపొందవని చెపుతారు.
వ్యాయామాల ప్రయోజనాలను సైంటిస్టులు ఇన్ ఫ్రారెడ్ లేజర్ కిరణాలను కాలి కండరాలలోకి ప్రసరించటం ద్వారా పరీక్షించారు. కండరాలలో కదలికలు బాగా పెరిగినట్లు, రక్తంలో ఆక్సిజన్ అధికంగా సరఫరా చేయబడి కాలి కండరాల బలం అధికం కావటంతో వారు మరింత సేపు వ్యాయామాలు చేయగలరని రీసెర్చర్లు తెలిపారు.
తీవ్ర గుండెపోటు కల రోగులు తమ కాళ్ళు చచ్చుబడినట్లు, నడవటానికి అనుకూలంగా లేనట్లుగా కూడా భావించినట్లు తెలిపారని, అయితే, వాటికి సరైన వేడి పుట్టించటంతో కాలికండరాల రక్తంలో ఆక్సిజన్ పెరిగి రోగులు ఎంతో స్వస్ధత చెందారని రీసెర్చర్లు తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications