For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మసాజ్ చేస్తే....(మై)మరచిపోవాల్సిందే!

By B N Sharma
|

Reasons for High Blood Pressure!
నేటి రోజులలో అధిక రక్తపోటు సాధారణమైపోయింది. వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయసు వారినుండి, పెద్ద వారి వరకు వచ్చేస్తోంది. ఈ అధిక రక్తపోటుకు కారణాలుగా క్రింది వాటిని మనం చెప్పుకోవచ్చు.

1. మనం తినే ఆహార పదార్ధాలలో అధికంగా ఉప్పు వాడటం.
2. పొగ త్రాగే అలవాటు ఉండటం
3. కొవ్వు పదార్ధాల్ని అధికంగా కలిగి ఉన్న పదార్ధాల్ని తినటం.
4. మద్యం తీసుకొనే అలవాటు ఉండటం, వంటి తదతితర కారణాలను చెప్పుకోవచ్చు.

గుండెపై వీటి ప్రభావం ఎలా వుంటుంది? ఈ అధిక రక్తపోటు శరీరంలోని అన్ని ప్రధాన భాగాలతోపాటు గుండెపై కూడా అధిక ప్రభావం చూపుతుంది. ఈ రక్తపోటును అదుపులో ఉంచుకోకపోతే గుండెనొప్పి రావడానికి చాలా అవకాశం ఉంది. అధిక రక్తపోటు కలిగి ఉన్నవారు ధూమపాన ప్రియులైతే వారికి చిన్న వయసులోనే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ అధిక రక్తపోటు వలన ఎగశ్వాస, గుండె ఫెయిల్యూర్ అవ్వడం వంటివి జరుగుతాయి. అధిక రక్తపోటు వలన మన రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలలో సాగే గుణం తగ్గిపోతుంది.

అధిక రక్తపోటు వున్న వారు తీసుకోవలసిన జాగ్రత్తలు -
- ఈ బ్లడ్ ప్రెజర్ మామూలు వ్యక్తులలో కంటే స్ధూలకాయులలోనే అధికంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్ధూలకాయులు తమ బరువు తగ్గించుకోవాలి.
- అధికంగా ఉప్పువాడటం వలన అది శరీరంలోని ద్రవాలను గాఢంగా చేసి నీరు అధికంగా నిలువ ఉండేలా చేసి రక్తపోటును పెంచుతుంది. కాబట్టి అధిక ఉప్పు వాడకం అనర్ధదాయకం.
- కొవ్వు పదార్ధాలు అధికంగా తినటం వలన అది రక్తనాళాలలో పేరుకుపోయి అధిక రక్తపోటును కలిగిస్తుంది. కాబట్టి అధికంగా కొవ్వును కలిగించే ఆహార పదార్ధాలు, మాంసం, నూనెల వాడకం సాధ్యమైనంత తగ్గించాలి.
- మద్యపానాన్ని అధికంగా సేవించడం వలన గుండె యొక్క వేగం పెరిగి రక్తపోటు అధికమయ్యే అవకాశం వుంటుంది. కాబట్టి సారాయి వంటి మద్య పానీయాలు తాగరాదు.
- పొగతాగడం అన్నింటికన్నా ప్రమాదం. అధిక రక్తపోటుకు ప్రధాన కారణం ఇదే. దీనిని మానివేయాలి.
- పొగాకు, ఆల్కహాలు వంటి మత్తు పదార్ధాల వలన గుండె వేగమే కాకుండా రక్తపోటు పెరుగుతుంది. పొగతాగని వాళ్ళతో పోలిస్తే పొగతాగేవారిలోనే రెట్టింపు స్ధాయిలో గుండెపోటు అవకాశాలున్నాయి.
- అధిక రక్తపోటును నియంత్రించడానికి వ్యాయామం ఒక మంచి మార్గం. వ్యాయామం వలన శరీరంలోని వెలుపలి పొరలలో ఉండే రక్తనాళాలు వ్యాకోచించి రక్తపోటును నియంత్రిస్తాయి. వాకింగ్, సైకిలింగ్, ఈత మొదలైనవన్నీ వ్యాయామం కిందకే వస్తాయి. ప్రతిరోజూ మంచి సువాసనలుకల నూనెలతో శరీరంపై మసాజ్ చేయించుకుంటే కూడా అధిక రక్తపోటు రోగులకు మంచి ఫలితం ఉంటుంది.

ఈ అధిక రక్త పోటు వలన గుండెకు సంబంధించిన వ్యాధులే కాదు. శరీరంలోని ఇతర భాగాలైన మూత్రపిండాలు, మెదడు వ్యాధులు, కాళ్ళు చేతులు చ్చుపడిపోవడం వంటివి కూడా సంభవిస్తాయి. అందుకే రక్తపోటు రాకుండా ముందస్తుగానే జాగ్రత్తలు పడాలి.

English summary

Reasons for High Blood Pressure! | అధిక రక్తపోటుకు మసాజ్ చేసే మేలు!

To contain High Blood pressure, exercise is the best way. When you exercise, blood vessels expand and control the blood pressure. Walking briskly, cycling, swimming, etc. should be done on daily basis, and this prevents one getting blood pressure. High blood pressure not only affect your heart, but also show its impact on other organs of your body.
Story first published:Thursday, June 21, 2012, 11:05 [IST]
Desktop Bottom Promotion