Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
గుండె జబ్బులు - గర్భనిరోధక మాత్రలు?

అయితే, నేడు ఆధునికంగా తయారయ్యే గర్భనిరోధక మాత్రలు గతంలో కంటే కూడా వైద్య పరంగా ఎంతో మెరుగైన రీతిలో తయారు చేస్తున్నారు. వీటివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదా అనారోగ్య సమస్యలు రావటం లేదు. అయితే, వీటి ఉపయోగ విధానం ఖచ్చితంగా నిర్దేశించిన రీతిలో వుండాలి. గతంలో గల తక్కువ నాణ్యత కారణంగా ఇవి సరిగా పనిచేయటం లేదని లేదా సమస్యలు వస్తున్నాయని పేరు పడటంతో అదే పేరు ఇప్పటికి కొనసాగుతూ వస్తోంది.
నేడు తయారయ్యే గర్భనిరోధక మాత్రలు గతంలో వాటికంటే పది రెట్లు మెరుగుగా వున్నాయని చెపుతున్నారు. కనుక నేటి గర్భనిరోధక మాత్రల ఉపయోగం ఎంతో సురక్షితం. నేటికి కొన్ని గర్భ నిరోధక మాత్రలు కొద్దిపాటి రక్తపోటును కలిగించటం, కొల్లెస్టరాల్ ఏర్పరచటం వంటివి అంటే మంచి కొల్లెస్టరాల్ ను తగ్గించటం చేస్తున్నాయి. ఈ కారణంగా రక్తంలో గడ్డలు ఏర్పడుతున్నాయని కూడా పుకార్లుగా వున్నాయి. అయితే, నేటి వరకు ఈ నోటి మాత్రలు గుండె జబ్బులను కలిగిస్తున్నాయనేదానికి వైద్యపరంగా సరైన వివరణలు లేవు.
అయితే, గుండె సంబంధిత రిస్కులు తగ్గటానికిగాను రక్తపోటు వున్నవారు దానిని తగ్గించుకొని ఈ మాత్రల వాడకం మొదలుపెడితే మంచిదని చెప్పవచ్చు. అయితే, నేడు కొత్తగా వచ్చే కొన్ని గర్భ నిరోధక మాత్రలలో డ్రోస్పిరోనన్ అనే పదార్ధం వాస్తవంగా రక్తపోటును తగ్గించి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తోందని వైద్య సమాచారంగా వుంది. కనుక ఈ గర్భ నిరోధక మాత్రలు అవసరం మేరకు అతి తక్కువ డోస్ సిఫార్సు చేయదగినది. అయితే, వీటి ప్రభావం గుండె మీద వుండకుండా కూడా చూసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications