Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
హార్ట్ పేషంట్స్ కు మేలు చేసే కొబ్బరి నీళ్ళు.!

కొబ్బరి నీరు : లేత కొబ్బరి నీటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువ గాను, క్రొవ్వులు అస్సలుండవు ,చెక్కెర పరమితం గాను ఉండును . కొబ్బరి బొండం నీటిలో పొటాసియం ఎక్కువగా ఉంటుంది . శరీరములో నీటి లేమిని (Dehydration) కరక్ట్ చేస్తుంది. ఆరోగ్య పరంగా జీర్ణకోశ బాధల తో బాధపడే చిన్నపిల్లలకు కొబ్బరి నీరు మంచి ఆహారము , విరోచనాలు అయినపుడు ఓరల్ రి-హైద్రాషన్ గా ఉపయోగపడుతుంది, కొబ్బరి నీటిలో ఉండే పొటాసియం గుండె జబ్బులకు మంచిది, వేసవి కాలములో శరీరాన్ని చల్లబరుస్తుంది , వేసవిలో చెమట కాయలు , వేడి కురుపులు , అమ్మవారు జబ్బు పొక్కులు తగ్గేందుకు కొబ్బరినీతిని లేపనంగావాడాలి. కొన్ని రకల పొట్టపురుగులు కొబ్బరి నీటివల్ల చనిపోతాయి, ముత్రసంభందమైన జబ్బులలోను , కిడ్నీ రాళ్ళు సమస్యలలో ఇది మంచి మందుగా పనిచేస్తుంది. మినెరల్ పాయిజన్ కేసులలో పాయిజన్ ని క్లియర్ చేస్తుంది.
కొబ్బరి రక్త శుద్ధిలో కొబ్బరి నీళ్ళ పాత్ర ఆమోఘం ఒక్క మాటలో చెప్పాలంటే కొబ్బరి నీరు గ్లాసు పాలకంటే కూడా పుష్టికరం. పైగా ఇందులో తల్లిపాలలో ఉండే లారిక్‌యాసిడ్ లాంటి సుగునాలన్నీ కూడా కలగలిసి ఉన్నాయి. చక్కెర పదార్థాలు, ఖనిజలవణాలు విటమిన్లతో సమృద్ధమైన కొబ్బరి నీరు ఎంత అలసటనైనా సరే ఇట్టే పోగొట్టేస్తుంది. వేడిని తగ్గిస్తాయి. విరేచనాలను అరికడతాయి. గుండె జబ్బులను తగ్గిస్తాయి. అన్నిటినీ మించి, శక్తిని, బలాన్ని అందిస్తాయి. కొబ్బరికాయలో ఉండే అమూల్యమైన గుణాలు ఎన్నో ఉన్నాయి. అందుచేత రోజూవారీగా ఓ కొబ్బరి బొండాంలోని నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే కొబ్బరి నీళ్లను తాగడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరగడంతో వ్యాధులు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications