Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
గుండె జబ్బులకు సంబంధించిన ప్రధాన అపోహలు!

చాలామందికి గుండెగురించిన సమాచారం కూడా సరిగా తెలియదు. అటువంటి వారికి గుండె జబ్బుల పట్ల ఎన్నో అనుమానాలు, అపోహలు వుంటాయి. మరి ప్రధానంగా ప్రతి ఒక్కరికి వచ్చే అపోహలు ఎలా వుంటాయి? వాస్తవాలేమిటి ? అనేది పరిశీలించండి.
నేను బలంగా వుంటే, నాకు గుండె జబ్బు రాదు!
బలంగా వుంటే గుండెజబ్బు వచ్చే అవకాశాలు తక్కువగా వుంటాయి కానీ పూర్తిగా మినహాయించలేము. మనిషి బలంగా వున్నా, లావుగా వున్నా, సన్నగా వున్నా కొల్లెస్టరాల్ ఏర్పడటం రక్తనాళాలు మూసుకుపోవడం జరుగుతుంది. కనుక ఫిట్ నెస్ లెవెల్ ఏదైనప్పటికి గుండెజబ్బులు వస్తాయి.
గుండెపోటు చిహ్నాలు తేలికగా గుర్తించవచ్చు.
ఇది కూడా అపోహ. కొన్నిమార్లు గుండెపోటు సామాన్యులకే కాదు గుండెనిపుణులకు కూడా అంతుపట్టవు. ఛాతీ నొప్పి, శ్వాస కష్టమవడం, చెమట, వాంతి, వికారాలు, బలహీనత, అసాధారణ అలసట, బరువు లేదా బలహీనం నొప్పి చేతుల నొప్పి, వెన్ను నొప్పి, అజీర్ణం, ఆగి ఆగి కొట్టుకునే లేదా వేగంగా కొట్టుకునే గుండె మొదలైన వాటికి వైద్యులను తక్షణం సంప్రదించాలి.
ఛాతీ నొప్పి గుండె పోటు కాదు
గుండె పోటు వచ్చేటపుడు ఛాతీ నొప్పి రావాలని లేదు. నొప్పి అనేది దవడ భాగం నుండి బొడ్డువరకు ఎక్కడైనా రావచ్చు. నొప్పికి బదులు, బరువుగా లేదా బిగువుగా లేదా ఒత్తిడిగా వుంటుంది. ఛాతీ నొప్పి డల్ గా కూడా వుంటుంది. పరీక్షలు మాత్రమే నిర్ణయించగలవు.
వేచి చూడటం
నొప్పి వచ్చినప్పటికి అది గుండె సంబంధమా కాదా వేచి చూద్దాం అనే ధోరణి పనికిరాదు. వెంటనే వైద్య సహాయం పొందటం మంచిది.
చిన్నవారికి గుండె జబ్బు రాదు
నేటి రోజులలో 20 నుండి 40 సంవత్సరాలలోపు వారికి కూడా గుండెజబ్బులు వస్తున్నాయి. అందులోనూ నగరాలలో నివసించేవారికి, డయాబెటీస్, అధిక కొల్లస్టరాల్, అధిక రక్తపోటు వున్న వారికి మరింత త్వరగా వస్తాయి.
రోజూ ఆస్పిరిన్ తీసుకుంటే గుండె జబ్బులు రావు.
ఎపుడో ఒక సారి డాక్టర్లు నొప్పికి ఆస్పిరిన్ వాడమంటే, అది ఎల్లపుడూ ఆచరించరాదు. ఆస్పిరిన్ తో సైడ్ ఎఫెక్టులుంటాయి. డాక్టర్ ఆమోదిస్తే కాని ప్రతిరోజూ వాడరాదు.
గుండెపోటు తర్వాత జీవితం ముగిసినట్లే
గుండెపోటు చికిత్స తర్వాత రోగి జీవన విధానం మార్చుకుంటే మరోమారు గట్టెక్కినట్లే. ఒక్కసారి గుండెపోటు వస్తే జీవితం అంతమైనట్లు కాదు. మంచి ఆరోగ్యపుటలవాట్లతో కొత్త జీవితం సంతోషంగా సాగించవచ్చు.
గుండె జబ్బులు పురుషులకు మహిళలకు ఒకే రకంగా వస్తాయి.
గుండె జబ్బులు పురుషులకు వచ్చేవి పిరియడ్స్ అయ్యే మహిళలవాటికంటే తీవ్రంగా వుంటాయి. అరవై నుండి 65 ఏళ్ళ వయసు వచ్చే సరికి పురుషులకైనా, మహిళలకైనా గుండెపోటు తీవ్రత ఒకే రకంగా వుంటుంది. మహిళలలో పోటుకు ముందు, వాంతి, వికారం, శ్వాస సమస్య వంటివి అధికంగా కనపడతాయి.
డయాబెటీస్ నియంత్రణలో వుంటే గుండెజబ్బు రాదు
ఇది అపోహ. డయాబెటీస్ అంటేనే రక్తనాళాలు దెబ్బ తినడం. గుండెజబ్బు అవకాశాలు పెంచడం. శరీర బరువు, బ్లడ్ ప్రెజర్, కొల్లెస్టరాలు వంటివి కూడా పరిగణలోనికి వస్తాయి.
ఒక సారి గుండె సర్జరీ జరిగితే ఇక మరల గుండె జబ్బు రాదు.
ఇది అసలు వాస్తవం కాదు. మరోమారు మీరు పాత జీవన విధానంలోకి వెళితేచాలు, తప్పక గుండె సంబంధిత సమస్యలు మరింత తీవ్రంగా వచ్చే అవకాశం వుంది.
గుండె ఒక క్లిష్టమైన అవయవంగాను ఎప్పటికపుడు జాగ్రత్త పడవలసిన అవయవంగాను మనం భావించాలి. గుండె ఆరోగ్యానికి అవసరమైంది వ్యాయామం, మంచి ఆహారం అని గుర్తించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications