Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
పురుషులకు వచ్చే 5 ప్రధాన వ్యాధులు!

1. గుండె వ్యాధులు - గుండె సంబంధిత వ్యాధులలో చాలా రకాలున్నాయి. ఇవి వివిధ దశలుగా కూడా వుంటాయి. పురుషుల గుండెలు బలహీనం. అయితే దీనికి ఇంతవరకు మెడికల్ గా రుజువులు లేవు. మహిలలకంటే కూడా వీరు గుండెజబ్బులు అధికంగా పొందుతారు. గతంలో కొల్లెస్టరాల్ స్ధాయిలు 40 సంవత్సరాల వయసు పైన పెరగగా నేడు అవి 30 సంవత్సరాలకే పెరుగుతున్నాయి. కనుక పురుషులు తమ 30 సంవత్సరాల వయసునుండే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని తగిన జాగ్రత్తలు పడాలి.
2. పక్షవాతం - పక్షవాతం అనేది బ్రెయిన్ లో రక్త సరఫరా కనుక నిలిచిపోతే శరీరంలోని కొన్ని భాగాలకు ఈ వ్యాధి వస్తుంది. అధిక రక్తపోటు వున్న వారికి ఒత్తిడి ఎక్కువై పక్షవాతాలు వచ్చే అవకాశాలు అధికంగా వుంటాయి.
3. లంగ్ కేన్సర్ - పురుషులలో ఊపిరితిత్తుల కేన్సర్ సాధారణం. మహిళలు సెర్వికల్ కేన్సర్ తో మరణిస్తే, పురుషులు లంగ్ కేన్సర్ తో మరణిస్తారు. అనేక సంవత్సరాలనుండి పొగతాగుడు, పెరుగుతున్న కాలుష్యం దీనికి కారణం. జీవన విధానం మార్చుకోవడం వలన దీనినుండి నివారణ పొందవచ్చు.
4. డయాబెటీస్ - డయాబెటీస్ వ్యాధి మహిళలకంటే కూడా పురుషులకే ముందుగా వస్తుంది. మెనోపాజ్ దశ వరకు మహిళలకు ఈ వ్యాధి రాదు. మహిళలలో వుండే ఈస్ట్రోజన్ వారి రక్తంలోని షుగర్ స్ధాయిని నియంత్రిస్తుంది. పురుషులలో ఈ హార్మోన్ తక్కువ కనుక ఈ వ్యాధి వారికి త్వరగా వస్తుంది.
5. నపుంసకత్వం - వాస్తవానికి ఇది వ్యాధికాదు. కాని నేటి రోజుల్లో ఇది పురుషులకు అతి సాధారణంగా వస్తోంది. వీర్యకణాలు తక్కువవడం, అంగస్తంభన లేకపోవటం, మొదలైనవి వారిని కుటుంబపరంగా అనారోగ్యం కలిగిస్తున్నాయి. అనారోగ్య జీవన విధానాలు, ఒత్తిడి కలిగి వుండటం వంటి వాటి కారణంగా ఈ ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి.
ఈ వ్యాధులు సాధారణంగా పురుషులలో బహిర్గతమవుతున్నాయి. కనుక వీరు తగినన్ని ముందస్తు జాగ్రత్తలతో వీటిని నివారించుకొని ఆరోగ్యంగా జీవించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications