Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
ఏం చేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది?

పొగతాగటం - పొగాకు సంబంధించిన పదార్ధాలు తినటం, మీ గుండెకు చెప్పలేనంత హాని చేస్తుంది. వీటిని ఈ క్షణం నుండే విసర్జించండి. దీర్ఘ కాలం ఆరోగ్యకరమైన గుండెతో సంతోషంగా జీవించండి.
పిల్లలు, పెంపుడు జంతువులు - పిల్లలు పెంపుడు జంతువుల స్పర్శ తో మీరు ఆనందంగా గడిపే సమయం మీ గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఆనందంగా, ప్రేమగా స్పర్శానుభూతిని తరచు పొందండి.
బీటా కెరోటిన్ - బీటా కెరోటిన్ అశికంగా ఉండే ఆహారాలు అధికంగా తీసుకోండి మీకు గుండె సమస్యల ప్రమాదాన్ని ఈ ఆహారాలు 50 శాతం వరకు తగ్గిస్తాయి. కేరట్, చిలకడదుంప, ఆకు కూరలు, క్యాబేజీ ఇవన్నీ బీటా కెరోటిన్ బాగా లభించే ఆహారాలే.
మరణాలు - అమెరికాలో ఎక్కువ శాతం మరణాలు గుండె పోట్ల కారణంగానే సంభవిస్తున్నాయన్నది నిజం. అమెరికాలో ప్రతి 20 సెకన్ లలో ఒకరు హార్ట్ ఎటాక్ కు గురవుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు ఏదో ఒకరకమైన గుండె సమస్యతో బాధ పడుతున్నారు. ప్రతి 34 సెకన్ లకు అమెరికాలో ఒకరు గుండె సమస్యతో మరణిస్తున్నారు. గుండె కేవలం మన శరీరంలో రక్తప్రసరణను కొనసాగించే పంప్ మాత్రమే అనుకోవటం పొరపాటు. గుండెకు మన భావాలతో ఎంతో సంబంధం ఉంది. కోపం, శోకం, ఆనందం, ఉ్వేగం, ఉద్రేకం, బాధ, చింత, ఒత్తిడి, ఆందోళన వంటి మనకు చెందిన ఎన్నో ఎమోషన్స్ యొక్క ప్రభావం మన గుండె మీద ఉంటుంది. కనుక మీరెంత ఆనందంగా మీ జివితాన్ని గడిపితే, మీ గుండె అంత ఆరోగ్యంగా ఉంటుందన్నమాట.
వెల్లుల్లి ఉపయోగం - రక్తపోటును నియంత్రించి గుండె రోగాలనుండి మనల్ని రక్షించే అపురూపమైన ఔషధం వెల్లుల్లి. ప్రతిరోజూ మీ ఆహారంలో వెల్లల్లి ఏదో ఒక రూపంలో ఉండేలా జాగ్రత్తపడండి. ఇంతవరకూ మీకు వెల్లల్లి తినే అలవాటు లేకపోతే నిత్యం వెల్లుల్లి రెబ్బలో నాలుగోవంతు ముక్కను జీవితాంతం నిత్యం పచ్చిగానే మింగేసి మంచి నీరు తాగేయండి. ఈ చిన్న అలవాటేమీ గుండెకు రక్షణ కవచమై మిమ్మల్ని కాపాడుతుంది. రక్తపోటు తగ్గుతుంది. ఫాస్మోలిపిడ్స్, కొలెస్టరాల్ తగ్గుతాయి. ప్లేటెట్ క్లంపింగ్ ను పూర్తిగా తగ్గించే శక్తి వెల్లల్లికి ఉంది. ఈ కారణంగా స్ట్రోక్ రాదు. నేతిలో దోరగా వేయించిన వెల్లల్లిని రోజూ ఓ రెబ్బ వరకు నిశ్చింతగా తినవచ్చు.
మీరు చేసే వ్యాయామం - వ్యాయామం ఏ రూపంలో ఉన్నా అది మీ గుండెకు ఎంతో మేలు చేస్తుంది. విధిగా నిత్యం ఎంతో కొంత వ్యాయామం తప్పకుండా చేయండి. అధిక బరువు, ఊబకాయం మీ గుండెకు ఎంతో చేటు చేస్తాయి. వీటి విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications