For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెల్ ఫోన్ వాడకంతో తగ్గే షుగర్ వ్యాధి?

By B N Sharma
|

Will Cellphone Usage Reduce Diabetes
సాధారణ మానవుడికి సైతం అనేక సాంకేతిక ప్రయోజనాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఏ రోజు కారోజు సాంకేతిక ప్రయోజనాలు అధికమవుతున్నాయి. వాటిలో నేడు అందరూ విరివిగా వాడుతున్న సెల్ ఫోన్ ఒకటి. సెల్ ఫోన్ వాడకం వలన ఒక పక్క కొన్ని నష్టాలు ఉన్నాయని నిపుణులు చెపుతున్నప్పటికి, ఆరోగ్య పరంగా కూడా కొన్ని లాభాలు ఉన్నాయని ఇటీవల చేసిన ఒక పరిశోధనలో తేలింది.

యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లోని రీసెర్చర్స్ తాజాగా చేసిన ఒక అధ్యయనంలో ఇంటర్ యాక్టివ్ కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ ఒకటి మొబైల్ ఫోన్ ఉపయోగించే టైప్ 2 డయాబెటీస్ రోగులకు ఎంతో మేలు కలిగిస్తోందని వాషింగ్టన్ నుండి ఒక వార్తా సంస్ధ తెలియజేసింది. అధ్యయనకారులు సెల్ ఫోన్ వాడకందారులను, వారి అలవాట్లను పరిశోధించారు.

మొబైల్ హెల్త్ టెక్నాలజీని సైంటిఫిక్ గా పరిశీలించటంలో ఇది మొదటి అధ్యయనం. ఒక వ్యక్తి రక్తంలోని హేమోగ్లోబిన్ ద్వారా బ్లడ్ షుగర్ నిర్ధారిస్తారు. మొబైల్ హెల్త్ సాఫ్ట్ వేర్ సుమారు సంవత్సరంనుండి వాడుతున్న డయాబెటీస్ రోగులకు హెమోగ్లోబిన్ ఎఎల్సి సగటున సుమారు 1.9 శాతం తగ్గినట్లు స్టడీ తెలుపుతోంది. ఈ ఫలితాలు మరిన్ని దీర్ఘ రోగాలకు సంబంధించిన అంశాలకు కూడా దోహదం చేయనున్నాయి. ఇతర మొండి రోగాలను కొన్నింటిని సైతం పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. ఫలితాలు ఆసక్తి కరంగా వున్నాయని మేరీ ల్యాండ్ స్కూల్ ఆప్ మెడిసిన్ ప్రిన్సిపాల్ ఇన్వెస్స్టిగేటర్ ఛార్లీన్ సి. క్విన్ తెలుపుతున్నారు.

మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, ఆధునిక ఇతర కమ్యూనికేషన్ టెక్నాలజీ వినియోగం ద్వారా రోగులకు ఏ రకమైన ప్రయోజనాలు కలిగించవచ్చనే అంశం పై స్టడీ చేస్తున్నారు. ఈ స్టడీ ఫలితాలు త్వరలోనే తమ రోగుల అనారోగ్యాన్ని దూరం చేయటానికి డాక్టర్లకు సైతం అందుబాటులోకి రాగలవని కూడా రీసెర్చర్లు భావిస్తున్నారు.

డయాబెటీస్ కారణాలు ఏమిటి? దాని సహజ నియంత్రణ ఎలా ? అని పరిశీలిస్తే, 2025 నాటికి ప్రపంచ డయాబెటిక్ రోగులలో 80 శాతం భారతదేశంలోనే వుండగలరని అంచనాలు చెపుతున్నాయి. దీనికి కారణం మనకు లభ్యమవుతున్న ఆహార పదార్ధాలే! కార్బో హైడ్రేట్లు అధికంగా వుండటం పీచు పదార్ధాలు తక్కువగా వుండటం కారణ మంటారు పోషకాహార నిపుణులు.

సాధారణంగా మనం ఉదయం పూట తినే బ్రేక్ ఫాస్టులోని పరోటా, పూరి, రోటి, బ్రెడ్ మొదలైన వాటిలో గ్లీస్మిక్ స్ధాయి అధికంగా వుంటుందని, గ్లీస్మిక్ స్ధాయి తక్కువగా వుండే ఫైబర్ పదార్ధాలు గత కొన్ని సంవత్సరాలుగా తింటున్న వారకి టైప్ 2 డయాబెటీస్ ఏ మాత్రం దగ్గరికి రావటం లేదని వీరు అభిప్రాయపడుతున్నారు. భోజనంలో పిండి పదార్ధాలు, కార్న్ ఫ్లేక్స్, గోధుమ, రైస్ మొదలైనవి వుండరాదంటారు డయాబెటాలజిస్ట్ గౌరవ్ శర్మ. ఈ పదార్ధాలు అధికమైన స్టార్చ్ ను కలిగది వుంటాయని ఇవి తినే వారికి డయాబెటీస్ వ్యాధి అధికమవుతుందని చెపుతారు. మరి డయాబెటిక్స్ ఏమి తినాలి ? బ్రేక్ఫాస్ట్ లో కోడిగుడ్లు, బాగా వేయించినవి, వీలైతే ఆలివ్ ఆయిల్ వేయబడి తయారు చేసిన ఆమ్లెట్లు, పక్కనే టొమాటోలు, కొత్తిమీర, వీటితో పాటు హెర్బల్ లేదా జాస్మిన్ టీ లాంటివి తీసుకోవాలని ఈ నిపుణుడు చెపుతారు.

English summary

Will Cellphone Usage Reduce Diabetes? | సెల్ ఫోన్ వాడకంతో తగ్గే షుగర్ వ్యాధి?

For the first time in the History of mobile health technology the Researchers in University of Maryland School of Medicine undertaken A Research wherein they found that the haemoglobin levels in diabetes patients come down by 1.9 percent because of their cellphone usage.
 
Desktop Bottom Promotion