For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హఠాత్తుగా వచ్చే హార్ట్ ఎటాక్ లక్షణాలివే

By Nutheti
|

అనుకోని పరిణామంలా హఠాత్తుగా వచ్చి.. అందరినీ హడలెత్తించేదే హార్ట్ ఎటాక్. చాలా మందికి దీని లక్షణాలు తెలియక గుండెపోటుతో మరణిస్తుంటారు. మరికొందరు ఆస్పత్రిపాలై.. ఐసీయూలో ఉండాల్సి వస్తుంది. అయితే ముందుగానే గుండెపోటును సూచించే లక్షణాలపై అవగాహన ఉంటే.. ప్రాణాలను కాపాడుకోవచ్చు.

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల గోడలకు కొవ్వు పడుతూ ఉంటుంది. అలా కొవ్వు ఎక్కువైతే.. రక్తనాళాలు సన్నగా మారుతాయి. దీనివల్ల గుండెకు రక్తసరఫరా తగ్గిపోతుంది. రక్తసరఫరా తగ్గడమే కాకుండా.. గుండె కండరాలకు పోషకాలు, ఆక్సిజన్ కూడా అందవు. దీనివల్ల గుండె కండరం చచ్చుబడిపోతుంది. దీన్నే గుండె పోటు లేదా హార్ట్ ఎటాక్ అంటారు.

గుండెపోటు కలగడానికి ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ముందుగానే పసిగట్టి వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదా డాక్టర్ ని సంప్రదించడం ద్వారా ముప్పు నుంచి బయటపడవచ్చు. హార్ట్ ఎటాక్ ను సూచించే లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం..

శ్వాస

శ్వాస

శరీరానికి రెస్ట్ అవసరమైనప్పుడు ఆయాసం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో గుండెపై ఒత్తిడి కలుగుతుంది. కానీ ఏ కారణం లేకుండా ఆయాసం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏర్పడితే.. వెంటనే అలర్ట్ అవ్వాలి.

చెమట

చెమట

వ్యాయామం, ఎలాంటి శారీరక శ్రమ చేయకపోయినా.. శరీరం చెమటలకు లోనవుతుందంటే.. నిర్లక్ష్యం చేయకండి. మూసుకుపోయిన ధమనులకు రక్తం సరఫరా చేయడానికి గుండె ఒత్తిడికి లోనవుతుంది. దీనిల్ల ఉష్ణోగ్రతలు తగ్గి, చెమటలు పడతాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

నొప్పులు

నొప్పులు

శరీర భాగాలలో అలసటగా అనిపించడం కూడా హార్ట్ ఎటాక్ ను సూచిస్తుంది. రెండు భుజాలపై నొప్పిగా ఉండటం, వీపు భాగంలో పెయిన్, మెడ దగ్గరా కొన్ని నిమిషాల వ్యవధిలోనే తరచుగా నొప్పిగా ఉంటే.. జాగ్రత్త వహించాలి.

ఛాతీ

ఛాతీ

గుండెపోటు రావడానికి ముందు ఛాతి మధ్యలో నొప్పి వస్తుంది. కొన్ని నిమిషాలు నొప్పిగా ఉండటం, తగ్గిపోవడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

మానసికంగా

మానసికంగా

జ్ఞాపక శక్తి లోపించడాన్ని గుండెపోటు లక్షణంగా చెప్పవచ్చు. రక్తంలో సోడియం వంటి స్థాయిలలో మార్పులు ఏర్పడినప్పుడు ఇలా మతిమరుపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

మాట్లాడటంలో ప్రాబ్లమ్స్

మాట్లాడటంలో ప్రాబ్లమ్స్

హార్ట్ ఎటాక్ కి మరో లక్షణాన్ని ఈజీగా పసిగట్టవచ్చు. మాట్లాడేటప్పుడు చాలా గందరగోళానికి లోనవుతారు. ఏదైనా విషయాన్ని చెప్పకపోవడం, ఒకే విషయాన్ని ఎక్కువసార్లు చెప్పడం వంటి సూచనలు గుండె సంబంధిత లక్షణాలను సూచిస్తాయి.

అలసిపోవడం

అలసిపోవడం

రోజూ చేసే పనులే అయినా.. ఎక్కువ ఇబ్బందికి లోనవుతుంటారు. మెట్లు ఎక్కడానికి, నడవటానికి, చిన్న వస్తువులు మోయడానికైనా.. చాలా అలసిపోతారు. ఇలాంటి సూచనలు మీలో కనిపించాయంటే.. హార్ట్ ఎటాక్ కి సంకేతంగా గుర్తించాలి. శరీరం మొత్తానికి పంపాల్సిన రక్తాన్ని సరఫరా చేయటంలో గుండె విఫలమైనప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.

కాబట్టి ఇలాంటి లక్షణాలు మీలో కానీ.. మీ పక్కన వాళ్లలో కానీ కనిపిస్తే వెంటనే అలర్ట్ అవండి.

English summary

7 Warning Signs Of Heart Attack

It is very important to know about the symptoms of heart attack. This disease related to the heart is one of the most dangerous killers according to the health reports.
Story first published: Friday, December 18, 2015, 17:25 [IST]
Desktop Bottom Promotion