For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హఠాత్తుగా వచ్చే హార్ట్ ఎటాక్, హార్ట్ డిసీజ్‌లు అరికట్టే ఆహారాలు

By Swathi
|

హఠాత్తుగా వచ్చి హడలెత్తిస్తుంది హార్ట్ ఎటాక్. గుండె సంబంధిత వ్యాధులు ఆకస్మికంగా వస్తాయి. అలాగే అవి ప్రాణాంతకం కూడా. ఒక్కసారి హార్ట్ ఎటాక్ గానీ, హార్ట్ డిసీజ్ గానీ వచ్చిందంటే.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సిందే. అయితే హార్ట్ డిసీజ్ లను ముందుగానే నిరోధించడానికి హెల్తీ డైట్ ఫాలో అవ్వాలి. అప్పుడు కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ లెవెల్స్, బ్లడ్ ప్రెజర్, బరువు అదుపులో ఉంటాయి. ఇవన్నీ కంట్రోల్ లో ఉంటే.. మీకు ఎలాంటి రిస్క్ ఉండదు. ఇవన్నీ హెల్తీగా ఉండాలంటే.. హెల్తీ డైట్ చాలా అవసరం.

ముందుగా మీరు ఎంత పరిమాణంలో ఆహారం తీసుకుంటున్నారు అనే విషయంపై జాగ్రత్త వహించాలి. ఎక్కువ మొత్తంలో లో క్యాలరీ, పోషకాహారాలు ఉండేలా జాగ్రత్త పడాలి. పండ్లు, కూరగాయలు, ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే హా క్యాలరీ, హై సోడియం, రిఫైన్డ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తక్కువ మొత్తంలో ఉండేలా చూసుకోవాలి. గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండాలంటే.. ఎలాంటి ఆహార ప్రణాళిక రూపొందించుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఫిష్

ఫిష్

ప్రొటీన్స్, న్యూట్రియంట్స్ పొందడానికి ఫిష్ సరైన ఆప్షన్. సార్డీన్స్, ట్యూనా, సాల్మన్ వంటి చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్ట్ డిసీజ్, స్ట్రోక్ ని అరికడతాయి.

ఫ్రూట్స్

ఫ్రూట్స్

మొక్కల నుంచి వచ్చే ఆహారాలు.. గుండె సంబంధిత వ్యాధులను అరికడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా పొందవచ్చు. పండ్ల ద్వారా ఫైబర్, పోషకాలు ఎక్కువ మొత్తంలో పొందడం ద్వారా గుండె వ్యాధులను నిరోధించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. యాపిల్స్, అరటిపండ్లు, ఆరంజ్, పియర్స్ ఎక్కువగా తీసుకోవాలి.

కూరగాయలు

కూరగాయలు

కూరగాయల ద్వారా ఫోలేట్, పోషకాలు, ఫైబర్ ను పుష్కలంగా పొందవచ్చు. రకరకాల వెరైటీల్లో కూరగాయలు అందుబాటులో ఉంటాయి కాబట్టి.. ఒక్కొక్కసారి ఒక్కో విధానంలో వండుకుని తినడం వల్ల.. శరీరానికి కావాల్సిన పోషకాలు పొందవచ్చు.

దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులను నివారించడం సులభమవుతుంది. బ్రొకోలి, క్యాబేజ్, క్యారెట్ ఎక్కువగా డైట్ లో ఉండేలా జాగ్రత్తపడాలి.

అన్ హెల్తీ ఫ్యాట్స్

అన్ హెల్తీ ఫ్యాట్స్

శ్యాచురేటెడ్ ఫ్యాట్ ఫుడ్స్ లిమిట్ గా తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే.. ఇది బ్లడ్ కొలెస్ట్రాల్, స్ట్రోక్ సమస్యలను నివారిస్తాయి. బేక్డ్ ఫుడ్స్, స్నాక్ ఫుడ్స్, ఫ్రొజెన్ పిజ్జా, ఫాస్ట్ ఫుడ్ వంటివి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచుతాయి. దీనివల్ల హార్ట్ ఎటాక్ రిస్క్ పెరిగే అవకాశముంది. కాబట్టి వీటిని తక్కువ మోతాదులో తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి.

విటమిన్ ఈ

విటమిన్ ఈ

విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తూ, చెడు కొలెస్ట్రాల్ కి వ్యతిరేకంగా పోరాడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అవకాడో, డార్క్ గ్రీన్ వెజిటబుల్స్, వెజిటబుల్ ఆయిల్, ఓల్ గ్రెయిన్ ప్రొడక్ట్స్ ద్వారా విటమిన్ ఈ పొందవచ్చు. విటమిన్ సప్లిమెంట్స్ కి బదులు విటమిన్ ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ ఫలితాలు పొందవచ్చు.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. ఇది బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి.. వెల్లుల్లిని డైలీ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి.

చిక్కుళ్లు

చిక్కుళ్లు

మీ డైట్ లో చిక్కుళ్లు ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అంటే కిడ్నీ బీన్స్, బఠాణీలు, అలసందలు, చిక్కుడు గింజలు, శనగలు, బఠాణీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్ట్ డిసీజ్ కి దూరంగా ఉండవచ్చు.

English summary

How to adjust your Diet to prevent Heart Diseases

How to adjust your Diet to prevent Heart Diseases. There is no ‘magic’ food to decrease the risk of developing heart disease. You need to eat a healthy diet and have plenty of exercise.
Story first published: Monday, February 8, 2016, 17:17 [IST]
Desktop Bottom Promotion