For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే ముందు బహిర్గతమయ్యే లక్షణాలు..!

|

అనుకోని పరిణామంలా హఠాత్తుగా వచ్చి.. అందరినీ హడలెత్తించేదే హార్ట్ ఎటాక్. చాలా మందికి దీని లక్షణాలు తెలియక గుండెపోటుతో మరణిస్తుంటారు. మరికొందరు ఆస్పత్రిపాలై.. ఐసీయూలో ఉండాల్సి వస్తుంది. అయితే ముందుగానే గుండెపోటును సూచించే లక్షణాలపై అవగాహన ఉంటే.. ప్రాణాలను కాపాడుకోవచ్చు.

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల గోడలకు కొవ్వు పడుతూ ఉంటుంది. అలా కొవ్వు ఎక్కువైతే.. రక్తనాళాలు సన్నగా మారుతాయి. దీనివల్ల గుండెకు రక్తసరఫరా తగ్గిపోతుంది. రక్తసరఫరా తగ్గడమే కాకుండా.. గుండె కండరాలకు పోషకాలు, ఆక్సిజన్ కూడా అందవు. దీనివల్ల గుండె కండరం చచ్చుబడిపోతుంది. దీన్నే గుండె పోటు లేదా హార్ట్ ఎటాక్ అంటారు.

 సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే ముందు బహిర్గతమయ్యే లక్షణాలు..!

గుండెపోటు కలగడానికి ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ముందుగానే పసిగట్టి వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదా డాక్టర్ ని సంప్రదించడం ద్వారా ముప్పు నుంచి బయటపడవచ్చు.

హార్ట్ అటాక్ కు గురవటానికి ముందు ఛాతిలో నొప్పి లేదా అసౌకర్యంగా అనిపించటం, జలుబు లేదా బలహీనంగా అనిస్తుంది. కానీ, కొంతమందిలో ఎలాంటి లక్షణాలు బహిర్గతం అవకుండా మరణిస్తున్నారని తెలుసా? గుండెపోటు మధుమేహులలో మరియు స్త్రీలలో అధికంగా కలుగుతుంది. సైలెంట్ హార్ట్ ఎటాక్ కలిగే ముందు బహిర్గతమయ్యే లక్షణాల గురించి ఇక్కడ తెలుపబడింది.

అలసట :

అలసట :

సైలెంట్ హార్ట్ అటాక్ కు గురయ్యే ముందు బహిర్గతమయ్యే సాధారణ లక్షణం ముఖ్యంగా ఇది స్త్రీలలో బహిర్గతం అవుతుంది. సైలెంట్ హార్ట్ అటాక్ గురయ్యే వారిలో గుండె కండరాలపై ఒత్తిడికి గురవటం వలన గుండెకు అందే రక్తప్రవాహం తగ్గి, అలసట కు గురవుతారు. ఒకవేళ మీరు తీవ్రమైన అలసటకు గురైనపుడు గుండెపని తీరును ఎలక్ట్రోగ్రామ్ ద్వారా తెలుసుకోండి

గొంతు, మెడ లేదా దవడలో అసౌర్యంగా అనిపించటం :

గొంతు, మెడ లేదా దవడలో అసౌర్యంగా అనిపించటం :

మీ మెడ, దవడ లేదా ఒక దంతం లేదా గొంతు భాగంలో బిగుతుగా అనిపిస్తుందా? అయితే ఇది సైలెంట్ హార్ట్ అటాక్ ఉ ఒక సూచికగా అని చెప్పవచ్చు. మీరు ఇలాంటి లక్షణాలను గమనించినపుడు వెంటనే వైద్యుడిని కలవండి.

కడుపులో కలతలు:

కడుపులో కలతలు:

కడుపులో కలిగే కలతల సమస్యలతో సతమతం అవుతున్నారా? ఇదొకవేళ సైలెంట్ రక్తపోటు సంబంధిత లక్షణం కావచ్చేమో చూసుకోండి. సైలెంట్ హార్ట్ అటాక్ కలిగే ముందు డోకులు, వాంతులు లేదా పూర్తి జీర్ణాశయ సమస్యలు కలగవచ్చు. కడుపులో కలతలు లేదా మెడ లేదా దవడ ప్రాంతంలో అసౌకర్యాలను గమనిస్తే వెంటనే వైద్యుడుని కలవండి.

గుండెమంట:

గుండెమంట:

భోజనాన్ని ఎక్కువగా తినటం వలన కూడా గుండెమంట కలుగుతుంది అవునా! దీని గురించి మీరు భాదపడాల్సిన అవసరం లేదు. కానీ, ఒకవేళ అసాధారణ గుండెమంట కలిగితే మాత్రం సైలెంట్ హార్ట్ అటాక్ యొక్క బహిర్గత లక్షణంగా పేర్కొనవచ్చు. హార్ట్ అటాక్ సమయంలో ఛాతిలో కలిగే నొప్పి గుండెమంట లాగా అనిపిస్తుంది. ఎందుకంటే గుండెకు అందే రక్త ప్రవాహం తగ్గటం వలన అని చెప్పవచ్చు.ఇలాంటి సమయంలో డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురి అవ్వడం

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురి అవ్వడం

శరీరానికి రెస్ట్ అవసరమైనప్పుడు ఆయాసం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో గుండెపై ఒత్తిడి కలుగుతుంది. కానీ ఏ కారణం లేకుండా ఆయాసం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏర్పడితే.. వెంటనే అలర్ట్ అవ్వాలి.

మాట్లాడటంలో తడబాటు

మాట్లాడటంలో తడబాటు

హార్ట్ ఎటాక్ కి మరో లక్షణాన్ని ఈజీగా పసిగట్టవచ్చు. మాట్లాడేటప్పుడు చాలా గందరగోళానికి లోనవుతారు. ఏదైనా విషయాన్ని చెప్పకపోవడం, ఒకే విషయాన్ని ఎక్కువసార్లు చెప్పడం వంటి సూచనలు గుండె సంబంధిత లక్షణాలను సూచిస్తాయి.

మైకము లేదా తల తిరుగినట్లు అనిపించడం

మైకము లేదా తల తిరుగినట్లు అనిపించడం

మైకము మరియు తల తిరుగుట ఫీలింగ్ గుండెపోటుకు దాదాపుగా ఎవ్వరికీ తెలియని మరొక లక్షణం. పరిశోధకులు గుండెపోటు కలిగిన వారిలో 39% మంది ఈ విధంగా ఫీలింగ్ కలిగి ఉంటారని కనుగొన్నారు. వాస్తవానికి మరొక అధ్యయనంలో మహిళలకు మైకము అనుభూతి పురుషుల కంటే మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని కనుగొన్నారు. కానీ అది సొమ్మసిల్లే వరకు ఉంటుంది. దీని పలితంగా రక్త నాళాలలో బ్లాక్స్ ఏర్పడి గుండెపోటుకు దారితీస్తుంది.

English summary

Silent Heart Attack Symptoms

Silent Heart Attack Symptoms,It's true, Women are different from men, not least of all when it comes to heart attack symptoms. Once considered almost strictly a man's problem, we now know that anyone can have a heart attack.
Desktop Bottom Promotion