Latest Updates
-
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి!
Heart Attacks: యువకుల ప్రాణాలు తీస్తున్న గుండెపోటు, ఎందుకొస్తుంది? ఎలా జాగ్రత్తగా ఉండాలి?
ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎవరికి వస్తుందో అసలు ఊహలకు కూడా అందకుండా కబళిస్తోంది గుండెపోటు. చాలా ఆరోగ్యంగా ఉన్నారు అనుకునే వారు కూడా గుండె పోటు వచ్చి చనిపోతున్నారు. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుం
గత కొన్ని రోజులుగా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఎప్పుడు ఎవరిని మట్టుబెడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇన్ని రోజులు వయస్సు పైబడిన వారికి, అతిగా లావుగా ఉన్నవారికి మాత్రమే వస్తుందని, యువకులకు రావడం చాలా చాలా అరుదు అనుకున్న అంచనాలను తలకిందులు చేస్తోంది. చిన్న పిల్లలకు, యువకులకు, ఏదో పని చేస్తున్నప్పుడు, బరాత్ చేస్తున్నప్పుడు, జిమ్ చేసతున్నప్పుడు, ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు గుండెపోటు వచ్చి చనిపోతున్న ఘటనలు రోజూ పేపర్లలో, న్యూస్ ఛానళ్లలో చూస్తూనే ఉన్నాం.

ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎవరికి వస్తుందో అసలు ఊహలకు కూడా అందకుండా కబళిస్తోంది గుండెపోటు. చాలా ఆరోగ్యంగా ఉన్నారు అనుకునే వారు కూడా గుండె పోటు వచ్చి చనిపోతున్నారు. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

చిన్న వయస్సులో గుండెపోటు ఎందుకొస్తుంది:
* చిన్న వయస్సు వారికి యువకులకు గుండె పోటు రావడానికి వెనక పలు కారణాలు ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు.
* కుటుంబ చరిత్రలో ఎవరికైనా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఉంటే.
* పుట్టుకతో గుండె నిర్మాణంలో లోపాలు.
* గుండె కొట్టుకునే వేగంలో మార్పులు.

కరోనా ప్రభావం ఎంతంటే:
కరోనా సమయంలో చాలా మంది శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఇది కొందరిలో మయోకార్డయిటిస్ అనే పరిస్థితికి దారి తీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అటు తర్వాత గుండె క్రమబద్ధంగా కొట్టుకునే లయను దెబ్బతీసేలా అరిథ్మియాస్, హార్ట్ ఫెయిల్యూర్ లతో పాటు మరికొన్ని గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
కరోనా తర్వాత చాలా మందిలో రక్తప్రసరణ వ్యవస్థలో క్లాట్స్ ఏర్పడటం పెరిగింది. ఈ రక్తపు ఉండలు ధమనుల్లో ఏర్పడినప్పుడు గుండెకు తగినంత ఆక్సిజన్ అందదు. దాని వల్ల గుండెపోట్లు వస్తాయని వైద్యులు చెబుతన్నారు.

గుండెపోటు రావడానికి మరిన్ని కారణాలు:
* మానసిక ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ వంటి వాటి వల్ల రక్తపోటు, గుండె కొట్టుకునే వేగంలో హెచ్చు తగ్గుల వల్ల గుండెపోటు వస్తుందని వైద్యులు తెలిపారు.
* అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, నిద్రలేమి వల్ల కూడా యువతలో గుండెపోటు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
* అధిక బరువు, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు వల్ల కూడా గుండెపోటు రావొచ్చు.
* హైబీపీ, డయాబెటిస్
* ధూమపానం, మద్యపానం అతిగా తీసుకోవడం
* జన్యుపరమైన ప్రమాదం

ఆకస్మిక గుండెపోటు యొక్క లక్షణాలు:
ఆకస్మిక గుండెపోటుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన హెచ్చరిక సంకేతాలు దీర్ఘకాలిక మరియు నిరంతర ఛాతీ నొప్పి, ఒత్తిడి లేదా నొప్పి కొన్ని కార్యకలాపాల ద్వారా ప్రేరేపించబడవచ్చు. వికారం, అజీర్ణం, చెమట, అలసట, తలనొప్పి, భుజం లేదా దవడపై ప్రసరించే నొప్పి తక్షణ శ్రద్ధ అవసరమయ్యే లక్షణాలు కావచ్చు. అయితే, అందరికీ గుండెపోటు లక్షణాలు ఒకే విధంగా ఉండవని గుర్తుంచుకోవాలి.

గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి ఏమి చేయాలి?
- గుండె-ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించండి, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం తగ్గించండి.
- ప్రతిరోజూ వ్యాయామం, శారీరకంగా చురుకుగా ఉండాలి.
- మద్యం మరియు పొగాకు వినియోగాన్ని తగ్గించాలి.
- ప్రమాద కారకాలను తనిఖీ చేయాలి.
- ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించాలి.
- హెల్దీ ఫుడ్ తీసుకోవాలి.
- ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలనే తినాలి



Click it and Unblock the Notifications