Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
వేసవిలో గుండె సమస్యలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గుండెకు సంబంధించిన అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎండాకాలంలో ఎండలు గతంలో కంటే ఎక్కువగా ఉంటున్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గుండె చాలా సున్నితమైన అవయవం, మానసికంగా కొంచం ఇబ్బందులకు గురి అయినా గుండె చాలా దెబ్బతింటుంది. ఒంటి కాల్చేసే, శరీరంలోని నీటిని మొత్తం పీల్చేసే ఎండల వల్ల బాడీ పూర్తిగా డీహైడ్రేట్ అయిపోతుంది. ఇలాంటప్పుడు గుండెకు సంబంధించి వైద్యులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటున్నారో తెలుసుకుందాం.
బ్లడ్ క్లాట్ డీహైడ్రేషన్
శరీరం డీహైడ్రేట్ అయిపోవడం వల్ల రక్తం మరింత చిక్కగా అయిపోయి క్లాట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అలా డీహైడ్రేషన్‌తో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. తాజాగా జరిపిన సర్వేల ప్రకారం ప్రతీ సంవత్సరం గుండెపోటు సమస్యలు పెరిగిపోతూనే ఉన్నాయ్. సమ్మర్‌లో ఎండలను లెక్కచేయకుండా క్రీడలు, స్వీమ్మింగ్, టూర్లు, బయట ఎక్కువ తిరగడం వల్ల యువకుల్లో కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు పెరిగాయని చెబుతున్నారు.
వైటమిన్ డి
సూర్యుడి నుంచి శరీరానికి కావలసిన వైటమిన్-డి అందుతోంది. కాని ఎక్కువ సూర్యతాపం వల్ల డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే సన్‌స్క్రీన్ లోషన్స్ అప్లై చేసుకోవడం, నీరు నిరంతరంగా తాగుతూ ఉండడం చేస్తుండాలి.
వడదెబ్బ తగలకముండే వాటి లక్షణాలను గుర్తించాలి. వడ దెబ్బ తగిలితే శరీరం ఒకవైపు పనిచేయనట్టు అనిపిస్తుంది. కంటి చూపు మందగిస్తుంది, అలసట, వికారంగా ఉంటుంది. మెడ, కండరాళ్ల నొప్పి ఉంటుంది. తలనొప్పి, కోమా, మతిమరుపు లాంటి లక్షణాలు ఉంటాయ్.

వడదెబ్బ లేదా గుండెపోటు రాకుండా ఉండాలంటే..
నీరు లేదా నీరు ఎక్కువగా ఉన్న పుచ్చపండు, కొబ్బరిబోండా, బటర్ మిల్క్ లాంటివి తీసుకోవాలి. మీరు ఒక వేల గుండె, కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టే అయితే ఈ పళ్లను తినే ముందు వైద్యుడిని తప్పకుండా సంప్రదించాలి.
ప్రతీ రోజూ వ్యాయామం తప్పకుండా చేయాలి. బరువు ఎక్కువగా ఉంటే గుండె, లివర్ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఎక్కువ బరువు సమస్యలున్నవారు తక్కువ ఆహారం, ఎక్కువ పళ్లు, నీళ్లు కలిగిన వాటిని తినడం ఉత్తమం.
రక్తపోటు అధికంగా లేకుండా చూసుకోవాలి. రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవాలి. దీనిని అదుపులో వుంచుకుంటే సగం గుండెసమస్యలకు దూరంగా ఉంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications