కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.?

అమ్మాయిలకు ముఖ్యంగా 12- 19 ఏళ్ల వయసులో వారి శరీరంలో మార్పులు చాలా వేగంగా చోటుచేసుకుంటాయి. రుతుచక్రం మొదలయ్యాక హార్మోన్ల మార్పులు, వాయిస్‌ ఛేంజ్‌, ముఖంపై మొటిమలు, బరువు పెరగడం, తగ్గడం వంటివి చోటుచేసుకుంటాయి. అయితే ఇవన్నీ సాధారణంగా జరగాల్సినవే. కానీ ఇవి అసాధారణ లక్షణాలుగా మారితేనే అసలు సమస్య మొదలువుతుంది. ఆ అసాధారణ లక్షణాలు ముఖంపై రోమాలు పెరగడం.. అందుకు కారణమేంటి.. అమ్మాయిల్లో ఈ సమస్యను ఎలా నియంత్రించాలి.. నిపుణుల సలహాలు చూద్దాం..

high Testosterone levels in girls during adolescence know the research facts

శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు మనం రోజువారీ పనులు సక్రమంగా నిర్వహించుకోవడానికి, సమన్వయం చేసుకోవడానికి దోహదపడుతుంది. హార్మోన్లు సమతుల్యంగా ఉన్నంత వరకూ వారికి ఆరోగ్యపరంగా ఏ సమస్యా ఉండదు. కానీ వీటి పనితీరులో ఏ మాత్రం అంతరాయం మొత్తం ఆరోగ్యంపై నెగిటివ్‌ రిజల్ట్స్‌ చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పలు వైద్య నివేదికల ప్రకారం మన దేశంలో కౌమార దశల్లో ఉన్న అమ్మాయిల్లో హార్మోన్ల అసమతుల్యత వేగంగా పెరుగుతోందని.. పురుషుల్లో కనిపించే హార్మోన్ల స్థాయిలు బాలికల్లో అధికంగా ఉంటోందని వెల్లడైంది. ఫలితంగా వారి గొంతు బొంగురుపోవడం, బరువు పెరగడం, నెలసరిలో సమస్యలు, ముఖంపై రోమాలు ఎక్కువగా రావడం వంటి వాటికి దారితీస్తాయి.

డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.!డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.!

మూడు రెట్లు ఎక్కువ

పురుషుల్లో ముఖ్యమైన హార్మోన్‌ టెస్టోస్టెరాన్‌, మహిళల్లో ప్రొజెస్టిరాన్‌.. ఈ హార్మోన్ల బ్యాలెన్స్‌ కారణంగానే ప్రత్యుత్పత్తి వ్యవస్థ, మహిళల్లో రుతుక్రమం ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. అయితే టెస్టోస్టెరాన్‌ స్థాయిలు బాలికల్లో అధికంగా ఉన్నట్లు ఒక అధ్యయనం చెబుతోంది. పురుష హార్మోన్‌గా భావించే టెస్టోస్టెరాన్‌ మహిళల్లో గరిష్ఠంగా 59 ng/dL గా ఉండాలి. కానీ ఇది 200 ng/dL స్థాయికి చేరినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఔట్‌ పేషెంట్‌ విభాగానికి వచ్చిన కౌమార బాలికల్లో ఈ హార్మోన్‌ స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

high Testosterone levels in girls during adolescence know the research facts

అధ్యయనంలో వాస్తవాలు

8-18 ఏళ్ల వయసున్న 852 మంది బాలికలపై 8 నెలల పాటు అధ్యయనం జరపగా.. వారిలో 3.1 శాతం మంది ఈ టెస్టోస్టెరాన్ స్థాయిలు అధికంగా ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది. అయితే ఈ హార్మోన్‌ కారణంగా వారి ముఖంపై, గొంతులో మార్పులు మాత్రమే కాదు.. వారిలో కొన్ని పురుష లక్షణాలు కూడా కనిపించేలా చేస్తున్నాయని అధ్యయనం చెబుతోంది. ఫలితంగా శరీర నిర్మాణంలో మార్పులతో పాటు రుతుక్రమంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు.

చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి!చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి!

ఈ సమస్యకి కారణాలేంటి..

బాలికల్లో టెస్టోస్టెరాన్‌ స్థాయిలు పెరగడానికి ప్రధాన కారణం.. వారు తీసుకునే ఆహారంలో మార్పులు, స్టోరేజ్‌ ఫుడ్‌ తీసుకోవడం వల్ల తలెత్తుతోందని డాక్టర్లు తమ రీసెర్చ్‌లో గుర్తించారు. ఇంకా రోజులో దాదాప 4 నుంచి 6 గంటలపాటు మొబైల్‌, ల్యాప్‌టాప్‌ వాడటం కూడా ఇందుకు దారితీస్తోంది. ఆలస్యంగా నిద్రపోవడం, నిద్ర లేమి కూడా కారణం కావచ్చు. దీర్ఘకాలికంగా ఈ అలవాట్లు మహిళల్లో అసాధారణ లక్షణాలకి దారితీస్తున్నాయి.

వంధ్యత్వ సమస్య

అయితే ఈ అలవాట్ల ద్వారా పీసీఓఎస్‌ సమస్య పెరగడంతో పాటు అండాల ఉత్పత్తి, నాణ్యత తగ్గిపోవడం వంటి సమస్యలను బాలికలు ఎదుర్కొంటున్నారు. దీంతో పెళ్లయ్యాక సంతానోత్పత్తి సమస్యలు వస్తున్నాయి. మీలో కూడా ఈ సమస్యలు వస్తున్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా గైనకాలజిస్టును సంప్రదించడం ఉత్తమం..

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Wednesday, September 9, 2026, 12:14 [IST]
Desktop Bottom Promotion