Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్!
Weight Loss Tips: వేడి నీళ్లు VS చల్లటి నీళ్లు.. బరువు తగ్గడానికి ఏది బెటర్ అంటే?
మానవ శరీరంలో 70 శాతం నీరే ఉంటుంది. చెమట, మూత్రం రూపంలో శరీరం నుండి కోల్పోయిన నీటిని భర్తీ చేయకపోతే డీహైడ్రేషన్ కు గురవుతాం. శరీరం హైడ్రేటెడ్ గా ఉండటానికి, జీవక్రియ సక్రమంగా జరగడానికి, చర్మం పొడిబారకుండా తేమగా ఉండటానికి పుష్కలంగా నీరు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు.
నీటిలో కేలరీలు ఉండవు. అలాగే ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి నీరు పుష్కలంగా తాగాలని వైద్యులు సిఫార్సు చేస్తారు. బరువు తగ్గడానికి వేడి నీళ్లు తాగాలా, చలి నీళ్లు తాగాలా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఏ నీరు తాగితే మంచిదో, వేటి వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చల్లటి నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు:
రక్తనాళాన్ని సంకోచిస్తుంది:
చల్లని నీరు, చల్లని పానీయం రక్తప్రవాహంలో కొవ్వును పటిష్టం చేస్తుంది. పోషకాలను గ్రహించడం కష్టతరం చేస్తుంది.
భోజనం చేసేటప్పుడు చల్లటి నీరు తాగొద్దు:
ఆహారం తినే సమయంలో చల్లటి నీరు తాగడం జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఎందుకంటే శరీరం నీటి ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు అదనపు పని చేయాల్సి వస్తుంది.
గొంతునొప్పి:
చల్లటి నీరు తాగడం వల్ల గొంతు నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చల్లటి నీరు తాగితే శరీరంలో అదనపు శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది గొంతులో పేరుకుపోయే అవకాశాలు ఉన్నాయి.
గోరువెచ్చని నీరు తాగితే కలిగే ప్రయోజనాలు:
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
భోజనానికి ముందు గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. గోరు వెచ్చని నీళ్లు తాగితే జీర్ణక్రియ ప్రక్రియ వేగంగా జరుగుతుంది.
ట్యాక్సిన్లు తొలగించడానికి సహాయపడుతుంది:
ఉదయం నిద్రలేచిన తర్వాత గోరు వెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని ట్యాక్సిన్లు తొలగిపోతాయి. మూత్రం, మలం రూపంలో ట్యాక్సిన్లు బయటకు పోవడంలో గోరు వెచ్చని నీరు సహాయపడతాయి.
మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది:
గోరు వెచ్చని నీరు తాగడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. గోరు వెచ్చని నీటి వల్ల శరీరం తేలికగా ఉంటుంది. మనస్సు కూడా తేలికగా అనిపిస్తుందని పలు పరిశోధనలు వెల్లడించాయి.
మలబద్ధకం నుండి ఉపశమనం:
ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు తాగడం వల్ల ప్రేగుల కదలికను నియంత్రించవచ్చు. రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లు తాగతే మలబద్ధకం సమస్య రాదు.

బరువు తగ్గడానికి ఏది ఉత్తమం:
చల్లటి నీటితో పోలిస్తే వేడి నీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడం విషయానికి వస్తే.. నీటి ఉష్ణోగ్రతతో సంబంధం లేదు. బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటే పుష్కలంగా నీరు తాగడం చాలా ముఖ్యం. అలాగే వేడి నీరు బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తుందని నిరూపించడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు.
అయితే గోరు వెచ్చని నీరు తాగడంతో పాటు ఇతర డైట్ మెయింటైన్ చేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా కీలకమని వైద్యులు చెబుతున్నారు. అలాగే జంక్ ఫుడ్స్ ను తినడం తగ్గించాలి. తాజా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఆహారాలు తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











