సైలెంట్ హార్ట్ ఎటాక్ ఎలా ఎప్పుడు వస్తుంది? ఊహించని హెచ్చరిక సంకేతాలు.! ముఖ్యంగా రాత్రుల్లో..

Silent Heart Attack ఈమధ్య కాలంలో హార్ట్ అటాక్ తో మరిణించే వారి సంఖ్య వందల్లో కాదు వేలల్లోనే అని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణాలంటూ తెలియవు కానీ అతి చిన్న వయస్సు నుండి పెద్ద వయస్సు వారి వరకు చనిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఎంతో ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు కూడా కళ్ళ ముందు కుప్పకూలుతున్నారు. ఎలాంటి లక్షణాలు లేకుండానే చనిపోవడం ఈ మధ్యకాలంలో ఆందోళన రేకెత్తించే విషయం. దీన్నే సైలెంట్ హార్ట్ అటాక్ అని కూడా పిలుస్తున్నారు.

మనం రోజంత పనిచేసి బాగా అలసిపోయినప్పుడు మంచి నిద్ర కావాలని కోరుకుంటాం . ముఖ్యంగా రాత్రుల్లో సమయానికి పడుకోవడం, మంచి నిద్రపొందడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. అయితే నిద్రపోతున్న సమయంలో గుండె పోటు వస్తుందన్న విషయం మీకు తెలుసా? అవును రాత్రి నిద్రలో గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. దీన్నే సైలెంట్ హార్ట్ అటార్ అంటారు. అంటే ముందస్తుగా ఎలాంటి లక్షణాలు కనబడకుండా ఉన్న పలంగా గుండె ఆగిపోవడాన్ని సైలెంట్ హార్ట్ అటాక్ గా నిర్ధారిస్తున్నారు.

Silent Heart Attack Unexpected Warning Signs

ఆరోగ్యంగా మరియు చురుకైన వ్యక్తులు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. భారతదేశంలో ఇలాంటి ప్రమాదం పెరుగుతోంది. దీన్ని ఎలా గుర్తించాలి మరియు అది ఎలా జరుగుతుందో తెలుసుకోవడం ముఖ్యం. నిద్రలో గుండెపోటు ఎలా వస్తుంది అనే విషయంపై నిపుణులు అభిప్రాయం ప్రకారం..

నిశ్శబ్ద గుండెపోటు అంటే ఏమిటి?

సైలెంట్ హార్ట్ ఎటాక్‌ని సాధారణంగా సైలెంట్ మయోకార్డియల్ ఇన్‌ఫార్క్షన్ (SMI) అని వైద్య పరిభాషలో అంటారు. నిద్రపోతున్నప్పుడు కూడా గుండెపోటు రావచ్చు. ఇది సాధారణ గుండెపోటుకు చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే నిద్రిస్తున్న వ్యక్తికి గుండెపోటు వచ్చిందని పక్క వారికి కూడా తెలియదు. ఈ స్థితిలో గుండెపోటు సంభవించినప్పుడు వ్యక్తి ఛాతీలో నొప్పి అనుభూతిని అనుభవించడు. కానీ కొన్ని ఇతర లక్షణాలు ఉంటాయి.

తెల్లవారుజామున గుండెపోటు!

సాధారణంగా హార్ట్ అటాక్ లు తెల్లవారు జాములో ఎక్కువగా వస్తుంటాయి. ఈ సమయంలో శరీరంలో జీవక్రియ మరియు హృదయ స్పందన తక్కువగా ఉంటుంది. దాంతో రక్త ప్రసరణ తగ్గుతుంది. ఆ కారణం చేత రక్తపోటు మరియు గుండెపోటుకు దారితీస్తుంది. అవసరానికి మించి నిద్రపోవడం నిద్ర ఎక్కువైనా లేదా తక్కువైనా గుండె పోటు వస్తుంది. కేవలం 4-5 గంటలు మాత్రమే నిద్రపోవడం వల్ల స్ట్రోక్, హార్ట్ ఎటాక్ మరియు గుండె జబ్బులు వస్తాయి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

నిద్రించే సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే అది గుండెపోటు ప్రమాదానికి హెచ్చరిక. అధిక రక్తపోటు మరియు గుండె జబ్బుల వల్ల నిద్రలేమి సమస్య మరింత తీవ్రమవుతుంది. అధిక కొలెస్ట్రాల్, అధిక కొవ్వు ఆహారం, మధుమేహం, ఊబకాయం మరియు అధిక ధూమపానం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి.

నిశ్శబ్ద గుండెపోటు ఎప్పుడు వస్తుంది?

ప్రస్తుతు హార్ట్ అటాక్ కు సమయం అంటూ ఏదీ లేదు. రాత్రిల్లో వచ్చే సైలెంట్ హార్ట్ అటాకే రోజులో ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి హార్ట్ అటాక్ కు సంబంధించిన కొన్ని లక్షణాలను తెలుసుకోవడం చాలా అవసరం. రాత్రుల్లో వచ్చే గుండు పోటు లక్షణాలు కాళ్ళు మరియు పాదాల్లో గుండెకు సంబంధించిన ధమనుల్లో కనిపించే లక్షణాలు ఈ విధంగా ఉంటాయి.

  • కాళ్ళల్లో నొప్పి మరియు అసౌకర్యం.
  • రాత్రుల్లో కాళ్ళ మరియు పాదాలు చల్లగా మారడం మరొక అసాధారణ సంకేతం
  • రాత్రిపూట తిమ్మిరి లేదా కాళ్ళు మరియు పాదాలలో జలదరింపుకు కారణమవుతాయి.
  • కాళ్లు, చీలమండలు లేదా పాదాలలో వాపు గుండె ధమనులతో సహా పలు ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది.
  • కాళ్లు మరియు పాదాలపై చర్మం రంగులో మార్పులు, నీలిరంగు లేదా లేతగా మారడం గుండెపోటుకు అసాధారణ సంకేతం
  • రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ (RLS) కాళ్ళను కదిలించాలనే కోరికను మరియు అసౌకర్య అనుభూతులను సృష్టిస్తుంది.

నిశ్శబ్ద గుండెపోటు మరొకొన్ని సాధారణ లక్షణాలు
* ప్రధానంగా ఛాతీలో నొప్పి, ఛాతీలో అసౌకర్యం
* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
* జలుబు, జ్వరం, వికారం
* తేలికపాటి తలనొప్పి
* ఛాతీ లేదా భుజాల దగ్గర వీపు పై భాగంలో వాపు
* చీలమండలలో నొప్పి
* చేయి లేదా చేయి పైబాగంలో కండరాల నొప్పి
* అలసటగా అనిపించండం
ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే లేదా తేలికగా తీసుకుంటే, గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. తీవ్ర నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి.

వైద్య సహాయంతో పాటు కొన్ని ముందస్తు జాగ్రత్తలు పొందండి

  1. పైన సూచించిన లక్షణాలు ఏవైనా కనిపిస్తే, వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం.
  2. లక్షణాలు కనిపిస్తే వైద్యుడికి కాల్ చేయండి లేదా అంబులెన్స్‌కు కాల్ చేసి ఆసుపత్రిలో చేరండి.
  3. పైన సూచించిన గుండె పోటు లక్షణాలు మీలో ఎవరికైనా అనిపిస్తే వెంటనే ఆస్పిరిన్ తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రక్రియ తగ్గుతుంది.(డాక్టర్ సూచన మేరకు మాత్రమే)
  4. ఈ లక్షణాలను ఎంత త్వరగా గుర్తించగలిగితే, అంత త్వరగా ప్రమాదాన్ని నివారించవచ్చు.
  5. గుండె పోటు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉండటానికి అనుకూలమైన అలవాట్లను అనుసరించడం చాలా ముఖ్యం.
  6. అదేవిధంగా, గుండె ఆరోగ్యానికి సమతుల్య ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, నడక వంటివి చేయాలి. ధూమపానం, మధ్యం సేవించడం మానుకోవడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion