Latest Updates
-
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.!
షుగర్ పేషెంట్ల కాళ్లకు గాయాలు, ఎంత ప్రమాదమో తెలుసా?
డయాబెటిస్ తో ఇబ్బంది పడే వారిలో చాలా మందిని కాళ్లకు గాయాలు ఇబ్బంది పెడుతుంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కాలి గాయాలు చాలా సమస్యలను తెచ్చిపెడతాయి. ఈ గాయాలను డయాబెటిస్ ఫుట్ అల్సర్లుగా పిలుస్తుంటారు. షుగర్ రోగుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఏవైనా గాయాలు అయినప్పుడు అవి నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
నడిచినప్పుడు కాళ్లకు గాయాలు కావడం చాలా సాధారణం. ముళ్లపై అడుగుపెట్టడం, గాజు ముక్కలు గుచ్చుకోవడం, నడుస్తున్నప్పుడు కుర్చీలు, టేబుళ్లు తగలడం వల్ల గాయాలు అవుతుంటాయి. షుగర్ వ్యాధి గ్రస్తుల్లో ఇలా అయినా గాయాలు చాలా ప్రమాదకరం. ఇలాంటి గాయాలను ఆలస్యంగా గమనిస్తే పెద్ద ప్రమాదంగా మారతాయి. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల గాయాలు నయం కాకపోగా.. మరింత పెరుగుతాయి. తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. రక్త సరఫరా తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాపిస్తాయి. గాయాలు త్వరగా ఇన్ఫెక్షన్లుగా మారి శరీరాన్ని కబలిస్తాయి.

డయాబెటిస్ ఫుట్ అల్సర్ లక్షణాలు:
డయాబెటిక్ కాలి పుండు చుట్టూ ఎర్రగా ఉంటుంది. తీవ్రమైన సందర్భాల్లో ఈ పుండు చాలా లోతుగా అవుతుంది. ఎముక, నరాల వరకు కూడా వ్యాపించవచ్చు. ఈ పుండు కారణంగా కాలి వాపు వస్తుంది. పుండు కలిగించే మంట కారణంగా, వాపు, వేడి, నొప్పి కలుగుతుంది. మరింత తీవ్రమైతే చీము కారుతుంది. దుర్వాసన వస్తుంది.
డయాబెటిస్ ఫుట్ అల్సర్ కారణాలు:
ఇన్సులిన్ ఉపయోగించే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో పాదాల పుండ్లు వస్తుంటాయి. అధిక బరువు, పొగాకు తాగడం, మద్యపానం సేవించడం వంటివి కూడా డయాబెటిక్ కాలి పుండుకు కారణాలు. కొంతమందిలో పుండు వచ్చిన చోట స్పర్శ కోల్పోతారు. దీని వల్ల గాయం అయిన విషయాన్ని గమనించకపోవడం, అది పెద్దది అవుతున్నా పట్టించుకోకపోవడం జరుగుతుంది. దీని వల్ల గాయం మరింత పెద్దదవుతుంది. దీనికి చికిత్స చేయకపోతే ఇన్ఫెక్షన్ వస్తుంది. అది ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంది. గాయం తీవ్రం అయితే కాలు తీసేయాల్సి రావొచ్చు.
ఫూట్ అల్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
షుగర్ వ్యాధిగ్రస్తులు పాదాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గాయాలు కాకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని నడవాలి. కాలికి పూర్తి రక్షణ కల్పించేలా బూట్లు ధరించడం అలవాటు చేసుకోవాలి. ముళ్లు, గాజు పెంకులు, చిన్న చిన్న రాళ్లు గుచ్చుకోకుండా చూసుకోవాలి. అలాగే రోజు పాదాలను గోరువెచ్చని నీరు, సబ్బుతో కడుక్కోవాలి. అలాగే కాళ్లను ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. తడి చర్మం శిలీంధ్రాలు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి.
మడమలు, కాలి పగుళ్లు లేకుండా జాగ్రత్తపడాలి. వాసెలిన్, మాయిశ్చరైజర్ రోజూ రాసుకోవాలి. మృదువైన, పూర్తి రక్షణ కల్పించే పాదరక్షలు ధరించాలు. గోర్లు కట్ చేసుకునేటప్పుడు చర్మానికి గాయం కాకుండా చూసుకోవాలి. కాళ్లకు ఏవైనా చిన్న గాయం అయినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. చిన్న పాటి నిర్లక్ష్యం కూడా తీవ్రం కావొచ్చు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications