Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మీకోపమే మీశత్రువు.. మీ విపరీతమైన కోపం గుండెపోటుకు కారణం అవుతుంది!
నవ్వు నాలుగు విధాలా చేటు అంటారు. అదే విధంగా కోపం వందరకాలుగా చేటు అంటారు. మీకోపమే మీ శత్రువు అన్ని విషయం మీరు వినే ఉంటారు. ప్రతి మనిషిలో కోపం, నవ్వు మరియు ఏడుపు వంటి సాధారణ భావోద్వేగాలు ఉంటాయి. మనిషికి కోపం రావడం సహజం. ఏదైనా విషయంలో కోపం వస్తే ఆ కోపాన్నిఇతరుల మీద లేదా వస్తువుల మీద చూపెడుతుంటారు. లేదంటే రోడ్డుపైనైతే హార్ కొట్టడం లేదా వస్తువులు విసిరికొట్టడం లేదా ఒంటరిగా గట్టిగా అరవడం వంటి పనులు చేస్తుంటా. ఇలాంటి పనులు చేసేవారి మీరు ఒకరైతే వెంటనే మానేయండి. ఎందుకుంటే ఈ అలవాటు మీ ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాధాన్ని సూచిస్తుంది. ఎందుకంటే ఈ మద్య కాలం నిర్వహించిన అధ్యయనంలో అధిక కోపానికి మరియు గుండె పోటుకు మధ్య సంబంధాన్ని కనుగొన్నాయి.
ఒక వ్యక్తి కోపంలో ఉన్నప్పుడు వారిలో రక్తనాళాలు 40 నిమిషాల వరకు వ్యాకోచిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వ్యాకోచం రక్త ప్రసరణను పెంచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే అధిక కోపం లేదా అధిక భాగోద్వేగం వల్ల గుండె నాళాలను తగ్గించడం మరియు రక్తపోటును ప్రభావితం చేయడం ద్వారా రెండు గంటల్లో ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొంది. గుండె కొట్టుకోవడంలో ఫ్లక్చ్యుయేట్ అవడంలో వ్యత్యాసం ఎక్కువగా ఉన్నప్పుడు గుండె ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది.

కోపం కూడా ఒక రకమైన ఒత్తిడి, ఇది మిమ్మల్ని భోజనం చేయనివ్వదు లేదా సరిగ్గా నిద్రపోనివ్వదు, నీరుత్సాహం, అలసట వంటి అనారోగ్యకరమైన అలవాట్లకు దారి తీస్తుంది. కోపం వచ్చిన తర్వాత ఏ క్షణంలోనైనా రక్తనాళాల పొరపై ఒత్తిడి ఏర్పడుతుందని పరిశోధనలో తేలింది.
గుండె లేదా మెదడుకు రక్త ప్రసరణ నిరోధించబడినప్పుడు లేదా ఆగిపోయినప్పుడు సాధారణంగా గుండెపోటులు మరియు స్ట్రోకులు సంభవిస్తాయి. సహజంగానే, మీకు కోపం వచ్చినప్పుడు, రక్త ప్రసరణ ఆగిపోతుంది, మీ గుండెపై ఒత్తిడి తెచ్చి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
కోపం గుండెకు ఏవిధంగా ప్రమాదకరంగా మారుతుంది
ఆడ్రినలిన్, ఎపినెఫ్రిన్ మరియు కార్టిసాల్ వంటి కొన్ని ఒత్తిడి హార్మోన్లను కోపం అధిక స్థాయిలో విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు మొదట హృదయ స్పందన రేటును పెంచుతాయి మరియు తరువాత రక్తపోటును (బిపి) పెంచుతాయి.
ఈ హార్మోన్ల స్థాయిలు పెరగడం వల్ల తలనొప్పి, చెమటలు పట్టడం, వేగవంతమైన హృదయ స్పందన, ఛాతీ నొప్పి మరియు ఆందోళన వంటి వాటికి కారణం కావచ్చు. పరిస్థితుల కారణంగా గుండెపై ఒత్తిడి ఫలకాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. దాంతో రక్తం గడ్డకట్టి, రక్త ప్రసరణను నిలిపివేసి గుండెపోటుకు దారితీస్తుంది.

కోపం ఎవరిక ఎక్కువ ప్రమాధకరం?
ముఖ్యంగా ఇప్పటికే గుండె చికిత్స లేదా బైపాస్ సర్జరీ చేయించుకున్న వారికి కోపం తగ్గించుకోవడం చాలా అవసరం. అందుకోసం మీరు ధ్యానం లేదా యోగా వంటివి ప్రయత్నించవచ్చు. డీప్ బెల్లీ బ్రీతింగ్, యోగా, మెడిటేషన్ వంటివి చేయండి. ఇవి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచే గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాపడుతుంది.
కోపం ఎలా తగ్గించుకోవాలి?
మీ కోపాన్ని తగ్గించుకోవడానికి ఏదో ఒక పనిచేస్తూ బిజీగా ఉండటానికి ప్రయత్నించండి. వీలైతే కొంచెం దూరం నడవండి, తలపై నీళ్ళు పోసుకోండి. ఎవరితోనైనా మాట్లాడండి.
మీకు కోపం తెప్పించే విషయం ఏంటో అర్థం చేసుకుని దాన్ని ముందుగానే నివారించడానికి ప్రయత్నించండి.
ప్రాణాయమం వంటి శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల తక్షణ విశ్రాంతి పొందుతారు , దాంతో మీ హృదయ స్పందనను నెమ్మదిస్తుంది.
మీరు ఎంత ప్రయత్నించినప్పటు మీకు కోపం తగ్గలేదంటే ఏది జరిగినా చూడండి, వినండి అంతే తప్ప మాట్లడకూడదు అని మీకు మీరు ప్రామిస్ చేసుకోండి.
మీరు ఎవరిమీదైతే కోప్పుడుతున్నారో వారి మాత్రం మీ కోపానికి గురికాకపోవచ్చు. కానీ కోపంలో మిమ్మల్ని మీరు బాధపెట్టుకుంటారు. మీరు కోపంలో ఉన్నప్పుడు ఎదుటి వారిని రెచ్చగొట్టడమే కాకుండా మీ సమస్యను మరింత పెంచుకుంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకుని కోపాన్ని కంట్రోల్ చేసుకోలేప్పుడు కౌల్సింగ్ తీసుకోవడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications