Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..!
అపానవాయువు (పిత్తులు) గురించి బహిరంగంగా మాట్లాడేందుకు చాలామంది సిగ్గుపడతారు లేదా ఇబ్బందిగా ఫీలవుతారు. కానీ కడుపులో గ్యాస్ ఉత్పత్తి కావడం అనేది మన ఆరోగ్యానికి సంబంధించిన ఒక అత్యంత సహజమైన, ముఖ్యమైన ప్రక్రియ. అసలు రోజుకు ఎన్నిసార్లు అపానవాయువు వదలడం సాధారణం? ఈ ప్రశ్నకు ఆస్ట్రేలియాకు చెందిన CSIRO పరిశోధకులు చేసిన ఒక భారీ అధ్యయనంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.

రియల్ టైమ్ సర్వే
JAMA నెట్ వర్క్ ఓపెన్ లో ప్రచురితమైన ఈ అధ్యయనం కోసం 6,416 మంది పెద్దల దైనందిన అలవాట్లను పరిశీలించారు. దీనికోసం ప్రత్యేకంగా చార్ట్ యువర్ ఫార్ట్ అనే స్మార్ట్ ఫోన్ యాప్ ను రూపొందించారు. నవంబర్ 2024 నుండి ఫిబ్రవరి 2025 వరకు జరిగిన ఈ రియల్ టైమ్ సర్వేలో పాల్గొన్నవారు ఏకంగా 3,60,192 సార్లు అపానవాయువును విడుదల చేసినట్లు యాప్ లో నమోదు చేయడం విశేషం.
రోజుకు 5 సార్లు వదలడం కామనే!
ఈ పరిశోధన ప్రకారం... ఆరోగ్యవంతమైన పెద్దలు సగటున రోజుకు 5 సార్లు అపానవాయువును విడుదల చేస్తారు. సర్వేలో పాల్గొన్నవారిలో 80 శాతం మంది రోజుకు 2 నుంచి 7 సార్లు ఈ అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు తేలింది. ఈ 2 నుండి 7 సార్ల పరిధిని ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు స్పష్టమైన కొలమానంగా పరిశోధకులు ప్రతిపాదిస్తున్నారు.
మహిళలు vs పురుషులు: మహిళల (సగటున 4.8 సార్లు) కంటే పురుషులలో (సగటున 5.2 సార్లు) ఇది కాస్త ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
వయసుల వారీగా: 14-25 ఏళ్ల యువతలో ఇది అతి తక్కువ (4.4 సార్లు) కాగా, 26-45 ఏళ్ల వయస్కుల్లో అత్యధికంగా (5.2 సార్లు) నమోదైంది. వృద్ధుల్లో ఇది 4.8 సార్లుగా ఉంది.
సాయంత్రం వేళల్లోనే ఎక్కువెందుకు?
సమయం విషయానికి వస్తే..ఉదయం కన్నా సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్య దీని ప్రభావం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని డేటా తెలిపింది. దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఫైబర్ (పీచుపదార్థం) ఆహారమే. పగటిపూట మనం తీసుకున్న ఆహారాన్ని పెద్దప్రేగులోని బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేసినప్పుడు హైడ్రోజన్, మీథేన్ లాంటి వాయువులు ఉత్పత్తి అవుతాయి. రోజంతా ఆహారం తీసుకుంటూ ఉండటం వల్లే సాయంత్రానికి వాయువుల ఉత్పత్తి పెరుగుతుందని సైంటిస్టులు విశ్లేషించారు.
ఇది ఆరోగ్యానికి సంకేతం
నిద్రపోతున్నప్పుడు వచ్చే వాయువులను యాప్ లో నమోదు చేయలేకపోవడం వంటి కొన్ని చిన్న పరిమితులు ఈ అధ్యయనంలో ఉన్నప్పటికీ, వైద్య చరిత్రలో ఇది ఒక మైలురాయి. కడుపులో గ్యాస్ అనగానే ఏదో జబ్బు అని భయపడేవారికి, డాక్టర్ల చుట్టూ తిరిగేవారికి ఈ ఫలితాలు ఒక గొప్ప భరోసాను ఇస్తున్నాయి. రోజుకు కొన్నిసార్లు గ్యాస్ బయటకు పోవడం అంటే మీ జీర్ణవ్యవస్థ చురుకుగా, ఆరోగ్యంగా పనిచేస్తోందని అర్థమని నిపుణులు చెబుతున్నారు
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications