Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మీ మూత్రం ఏ రంగులో ఉంటే ఎంత నీరు త్రాగాలో తెలుసా
ఎండాకాలంలో ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో భూనుడి భగభగలు తక్కువేం లేవు. మండే సమ్మర్ లో మన శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇదే సమయంలో మన శరీరం మనకు ఒక ముఖ్యమైన సంకేతాన్ని పంపుతుంది తెలుసా? అదే మన మూత్రం రంగు. మూత్రం రంగు మీ ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలు చెబుతుంది. ముఖ్యంగా మీరు ఎంత నీరు తాగుతున్నారో తెలియజేస్తుంది.
సమ్మర్ లో లేత పసుపు, తెలుపు లేదా కొన్నిసార్లు గోధుమ రంగులో మూత్రం రావడం అనేది మీ శరీరంలో నీటి కొరత ఉందని తెలియజేసే స్పష్టమైన సంకేతం. ఈ విషయాన్ని తేలికగా తీసుకుంటే మాత్రం ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు మీ మూత్రం రంగును బట్టి మీరు ఎంత నీరు తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ మూత్రం రంగు ఎందుకు మారుతుందో తెలుసా?
మూత్రం రంగు మారడానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏంటో ఇఫ్పుడు చూద్దాం.
శరీరంలో నీటి కొరత (డీహైడ్రేషన్)
ఇది మూత్రం రంగు మారడానికి ప్రధాన కారణం. మీ శరీరంలో నీటి శాతం తగ్గితే మూత్రం మరింత ముదురు రంగులోకి మారుతుంది. నీటి కొరత తీవ్రతను బట్టి రంగులో మార్పులు కనిపిస్తాయి.
ఆహారం
మీరు తీసుకునే ఆహారం కూడా మీ మూత్రం రంగుపై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు క్యారెట్ లో ఉండే బీటా కెరోటిన్ అనే వర్ణద్రవ్యం మీ మూత్రాన్ని కాషాయం రంగులోకి మార్చవచ్చు. అలాగే కొన్ని రకాల ఆహారాలు ఇతర రంగుల మార్పులకు కూడా కారణం కావచ్చు.
మెడిసిన్స్
మీరు వాడుతున్న కొన్ని రకాల మెడిసిన్స్ కూడా మీ మూత్రం రంగును మార్చగలవు. కొన్ని మందుల వల్ల మూత్రం గోధుమ, నలుపు లేదా ముదురు పసుపు రంగులోకి మారే అవకాశం ఉంది.
ఒకవేళ ఏదైనా ప్రత్యేకమైన ఆహారం లేదా మందుల వల్ల మీ మూత్రం రంగు మారినట్లు అనిపిస్తే వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. కానీ సాధారణ రోజుల్లో మీ మూత్రం రంగులో మార్పు వస్తే మాత్రం తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి. ఇది మీ శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతోందని హెచ్చరించే సంకేతం కావచ్చు.
డీహైడ్రేషన్ ప్రమాదకరమైన లక్షణాలు
నీటి కొరత కేవలం మూత్రం రంగును మార్చడమే కాకుండా మీ శరీరంపై అనేక రకాలుగా ప్రభావం చూపుతుంది. మన శరీరం దాదాపు 60 శాతం నీటితోనే తయారైంది. శరీరంలో నీటి సమతుల్యత దెబ్బతింటే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందుకే డీహైడ్రేషన్ కు సంబంధించిన కొన్ని లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి.
తీవ్రమైన దాహం
తక్కువ మూత్రవిసర్జన
ముదురు రంగులో మూత్రం
అలసట మరియు నీరసం
తలనొప్పి
తల తిరగడం
పొడిబారిన చర్మం, పెదవులు
గుండె దడ
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే నీరు త్రాగడం ప్రారంభించండి. అవసరమైతే డాక్టర్ ని సంప్రదించడం ఉత్తమం.
మీ మూత్రం రంగు ప్రకారం ఎంత నీరు త్రాగాలో చూడండి
లేత పసుపు లేదా స్పష్టమైన నీరు లాంటి రంగు
మీ మూత్రం రంగు లేత పసుపు లేదా స్పష్టమైన నీరు లాంటి రంగులో వస్తుంటే మీ శరీరం పూర్తిగా హైడ్రేటెడ్‌గా ఉందని అర్థం. అంటే మీ శరీరం ఆరోగ్యంగా ఉంది..మీకు తగినంత నీరు అందుతోందని అర్థం. కాబట్టి మీరు ప్రస్తుతం త్రాగుతున్న నీటి పరిమాణాన్ని కొనసాగించండి.
లేత ముదురు పసుపు రంగు
మీ మూత్రం లేత ముదురు పసుపు రంగులో వస్తుంటే కొద్దిగా డీహైడ్రేషన్ ప్రారంభమైందని అర్థం. అంటే మీ శరీరంలో తేలికపాటి నీటి లోపం ఉంది. కాబట్టి వెంటనే ఒక గ్లాసు నిండా నీరు త్రాగాలి. రోజంతా తగినంత నీరు త్రాగడానికి ప్రయత్నించండి.
కొంచెం ముదురు పసుపు రంగు
మీ మూత్రం కొంచెం ముదురు పసుపు రంగులో వస్తుంటే డీహైడ్రేషన్ ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. మీ శరీరం నీటి కోసం ఎదురు చూస్తోందని అర్థం. వెంటనే 2-3 గ్లాసుల నీరు త్రాగాలి. మీ శరీరానికి తగినంత నీరు అందేలా శ్రద్ధ వహించండి. నీటిని క్రమం తప్పకుండా త్రాగడం అలవాటు చేసుకోండి.
ముదురు పసుపు లేదా తేనె రంగు.
మీ మూత్రం రంగు ముదురు పసుపు లేదా తేనె రంగులో ఉంటే ఇది ప్రమాదకరమైన డీహైడ్రేషన్ సంకేతం. మీ శరీరం చాలా నీటిని కోల్పోయిందని ఇది తెలియజేస్తుంది. వెంటనే కనీసం ఒక పెద్ద బాటిల్ నిండా నీరు త్రాగాలి. మీకు ఏమైనా ఇతర సమస్యలు అనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం చాలా ముఖ్యం.
ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు ఎంత నీరు త్రాగాలి?
ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజారోగ్య సలహా ప్రకారం ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతిరోజూ కనీసం 12-16 కప్పులు అంటే సుమారు 3-4 లీటర్ల నీరు త్రాగాలి. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రతి 20 నిమిషాలకు ఒక కప్పు నీరు త్రాగడం వల్ల మీ శరీరంలో నీటి నిల్వలు సరిగ్గా ఉంటాయి, డీహైడ్రేషన్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications