Latest Updates
-
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి!
రోజుకో పెగ్గు ఆరోగ్యానికి మంచిదా?..మీకు ఈ నిజం తెలుసా?
రోజుకు మితంగా ఓ పెగ్గు తాగితే ఆరోగ్యానికి డోకా లేదు.. ముఖ్యంగా రాత్రి పూట గ్లాసు వైన్ తాగితే గుండె పదిలం.. దశాబ్దాలుగా చాలామంది నమ్మే మాట ఇది. కొన్ని పాత అధ్యయనాలు కూడా దీనికి వంతపాడాయి. కానీ ఎప్పటికప్పుడు అప్ డేట్ అయ్యే మెడికల్ సైన్స్ ఇప్పుడు ఈ పాత నమ్మకాలను పటాపంచలు చేస్తోంది. మితంగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు సరికాదా.. ప్రాణానికే ప్రమాదం అని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

సురక్షితమైన పరిమితి అంటూ ఏదీ లేదు
ప్రఖ్యాత జర్నల్ ఆఫ్ హెపటాలజీలో ప్రచురితమైన తాజా నివేదిక ఒక కఠోర సత్యాన్ని బయటపెట్టింది. మద్యపానంలో పూర్తిగా సురక్షితమైన స్థాయి అంటూ ఏదీ లేదని తెలిపింది అతిగా తాగితే ప్రాణాలకే ప్రమాదం అని అందరికీ తెలుసు, కానీ కొద్దిగానే కదా తాగుతున్నాం అనుకునే వారిలో కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది. ఆరోగ్యంగా ఉండాలంటే మద్యం ముట్టకపోవడమే అత్యుత్తమం అని స్పష్టం చేసింది.
పాత అధ్యయనాల సంగతేంటి?
కొద్దిగా మద్యం తాగితే గుండెకు మంచిదని గతంలో ఎందుకు చెప్పారు? దీని వెనుక హెల్తీ డ్రింకర్స్ ఎఫెక్ట్ దాగి ఉందని నిపుణులు ఇప్పుడు గ్రహించారు. అంటే.. మితంగా తాగే వారిలో చాలామందికి మంచి ఆదాయం, పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేసే అలవాట్లు ఉన్నాయి. వారి ఆరోగ్యానికి ఆ జీవనశైలే కారణం తప్ప.. వారు తాగే మద్యం కాదు. ఈ వ్యత్యాసాలను పక్కనబెట్టి చూస్తే, మద్యం వల్ల కలిగే ప్రయోజనం శూన్యం అని ది లాన్సెట్ నివేదిక కూడా తేల్చేసింది.

మొదటి పెగ్గుతోనే క్యాన్సర్ ముప్పు..
అన్నింటికంటే భయంకరమైన విషయం ఏమిటంటే.. WHO మద్యాన్ని పొగాకు, ఆస్బెస్టాస్ తో సమానంగా గ్రూప్ 1 క్యాన్సర్ కారకంగా ప్రకటించింది. అంటే ఇది కచ్చితంగా క్యాన్సర్ తెప్పిస్తుందని శాస్త్రీయంగా నిర్ధారించారు.రొమ్ము, కాలేయ, పేగు, నోటి, గొంతు క్యాన్సర్లతో సహా 7 రకాల క్యాన్సర్లకు ఇది ప్రధాన కారణం. తక్కువగా తాగితే ఏమీ కాదులే అనుకోవడం పొరపాటు. రోజుకు ఒక డ్రింక్ తాగే వారిలో కూడా క్యాన్సర్ ముప్పు మొదలవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
శరీరంలో ఏం జరుగుతుంది?
మద్యం లోపలికి వెళ్లగానే అసిటాల్డిహైడ్ అనే విషపదార్థంగా మారుతుంది. ఇది నేరుగా మన కణాల DNAను దెబ్బతీస్తుంది. దీనివల్ల శరీరంలో వాపు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడతాయి. రోగనిరోధక శక్తి పడిపోతుంది. ముఖ్యంగా మద్యాన్ని జీర్ణం చేసుకునే కాలేయంపై విపరీతమైన భారం పడి ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి ప్రమాదకర వ్యాధులకు దారితీస్తుంది.
ఎవరు పూర్తిగా దూరంగా ఉండాలి?
గర్భిణీలు, కాలేయ వ్యాధులు లేదా దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారు, మందులు వాడేవారు, వాహనాలు నడిపేవారు మద్యాన్ని పొరపాటున కూడా ముట్టకూడదు. అలాగే యువత కూడా దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరు ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవించాలనుకుంటే.. శాస్త్రవేత్తలు చెబుతున్న ఒకే ఒక్క సూత్రం..వీలైనంత తక్కువ తాగడం మంచిది... అసలే తాగకపోవడం మరీ మంచిది. సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, పల్స్ హార్ట్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ముఖర్జీ మదివాడ కూడా ఓ వీడియోలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications