Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
సాధారణ సిగరెట్లు VS ఈ-సిగరెట్లు.. ఏది బెటర్ అంటే?
ఈమధ్య కాలంలో ఈ-సిగరెట్ల వాడకం బాగా పెరిగిపోయింది. సాధారణ సిగరెట్ల నుండి ఈ-సిగరెట్లకు మారుతున్నారు చాలా మంది. కొత్తదనం, స్టైలిష్‌గా ఉండటం, సిగరెట్లు మానేయాలనే తపన వల్ల కూడా ఈ-సిగరెట్ల వైపు వస్తున్నారు. యువత ఎక్కువగా ఈ-సిగరెట్లు కాలుస్తోంది.
2003లో ఈ-సిగరెట్లు కొత్తగా వచ్చినప్పుడు.. సాధారణ సిగరెట్ల కంటే ఈ-సిగరెట్లు చాలా బెటర్ అని అధ్యయనాలు చెప్పాయి. 95 శాతం ప్రమాదం తగ్గుతుందని అన్నాయి. అయితే ఇటీవలి అధ్యయనాలు మాత్రం ఈ-సిగరెట్ల వల్ల కూడా ప్రమాదం ఉంటుందని తేల్చి చెబుతున్నాయి.

2021లో జరిగిన ఓ అధ్యయనం ఈ-సిగరెట్లు కూడా ఊపిరితిత్తుల పనితీరుపై సాధారణ సిగరెట్లు చూపిన ప్రభావాన్నే చూపుతున్నాయని స్పష్టం చేసింది. అలాగే ఈ-సిగరెట్లు తాగడానికి అలవాటు పడ్డ యువత క్రమంగా సాధారణ సిగరెట్లకు మళ్లుతున్నట్లు తేల్చింది.
ఊపిరితిత్తుల సమస్యలకు కారణమవుతుంది:
ఈ-లిక్విడ్ ఏరోసోల్స్ శ్వాసకోశ ఎపిథీలియంకు ప్రత్యక్ష హానితో సంబంధాన్ని కలిగి ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఊపిరితిత్తుల పనితీరు, ఊపిరితిత్తుల ఇన్‌ఫ్లమేషన్, మ్యూకోసిలియరీ క్లియరెన్స్, ఊపిరితిత్తుల హిస్టాలజీని తగ్గిస్తుంది.
ఈ-సిగరెట్లలో మూడు భాగాలు, అన్నీ ప్రమాదకరమే:
ఈ-సిగరెట్లలో మూడు భాగాలు ఉంటాయి.
1. నికోటిన్
2. సాల్వెంట్ (ద్రావకం)
3. కెమికల్ ఫ్లేవర్స్ (రసాయన రుచులు)
నికోటిన్ అన్ని అవయవాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. సాల్వెంట్ లో ప్రొపైలిన్ గ్లైకాల్, వెజిటబుల్ గ్లిజరిన్ ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులకు హాని కలిగిస్తాయి. ప్రొపైలిన్ గ్లైకాల్ నోట్లో, నాసికా రంధ్రాల్లో చికాకును కలిగిస్తుంది. స్క్వామస్ సెల్ మెటాప్లాసియాకు కారణం అవుతుంది పరిశోధనలు చెబుతున్నాయి.
ఆర్టిఫీషియల్ ఫ్లేవర్స్ ప్రమాదకరం:
ఈ-సిగరెట్లలో సాధారణంగా ఉండేది కెమికల్ ఫ్లేవర్స్. రుచి కోసం, వాసన కోసం వివిధ రకాల కెమికల్ ఫ్లేవర్స్ ను ఈ-సిగరెట్లలో వాడతారు. ఈ ఆర్టిఫీషియల్ ఫ్లేవర్స్ చాలా ప్రమాదకరం. వీటి వల్ల బ్రోచిటిస్ ఆబ్లిటెరాన్స్ ఏర్పడతాయి.
సిగరెట్లు మానడానికి ఈ-సిగరెట్లు వాడొచ్చా?
సాధారణ సిగరెట్లు తాగే వ్యసనపరులను వాటి నుండి దూరంగా ఉంచడానికి ఈ-సిగరెట్లు తాగొచ్చు అని చాలా మంది భావిస్తుంటారు. కానీ దీని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. సాధారణ సిగరెట్ల నుండి ఈ-సిగరెట్లకు మారిన వారు తిరిగి సాధారణ సిగరెట్లు తాగే అవకాశాలు ఎక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి.
సిగరెట్లకు బదులు ఈ-సిగరెట్లు తాగొచ్చా?
ఈ-సిగరెట్లు ప్రమాదకరమైనవి కాబట్టి వాటికి బదులు వీటిని, వీటికి బదులు వాటిని తాగడంలో ఎలాంటి ఉపయోగం లేదన్న నిపుణుల అభిప్రాయం. ఈ-సిగరెట్లలో కూడా నికోటిన్ ఉంటుంది. కెమికల్ ఫ్లేవర్స్ ఉంటాయి, సాల్వెంట్ ఉంటుంది. సాధారణ సిగరెట్ల కంటే ఈ-సిగరెట్లు బెటర్ అని ఏ అధ్యయనాలు నిరూపించలేవు. కాబట్టి సిగరెట్లు తాగడం మానేయాలనుకుంటే పూర్తిగా మానేయాల్సిందే. ఈ-సిగరెట్లు తాగుతూ మానేస్తామనుకుంటే దాని వల్ల ఫలితం ఉండదు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
