Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Sunburn Tips: ఎండకు చర్మం కందిపోతోందా? ఇలా చేస్తే సేఫ్‌గా ఉండొచ్చు
వేసవి ఎండలకు చర్మం కందిపోతుంది. సూర్యుని అతినీలలోహిత కిరణాల వల్ల కొందరిలో చర్మం ఎర్రగా మారుతుంది, వాపు వస్తుంది, తాకితే తీవ్రమైన నొప్పి వస్తుంది, తీవ్రమైన సందర్భాల్లో బొబ్బలు కూడా ఏర్పడతాయి. దీనినే సన్‌బర్న్ అంటారు. సన్‌బర్న్ యూవీ రేడియేషన్ వల్ల వస్తుంది.
ఇది చర్మ కణాలను దెబ్బతీస్తుంది, వాపుకు కారణమవుతుంది. ఈ సన్‌బర్న్ లక్షణాలు వారం వరకు ఉంటాయి. చర్మం దెబ్బతిని అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. సన్‌బర్న్ చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ఈ వేసవిలో సన్‌బర్న్ కాకుండా జాగ్రత్తగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి.

1. పొడుగు చేతులున్న దుస్తులు ధరించాలి:
ఎండలో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే తప్పకుండా శరీరాన్ని పూర్తిగా కవర్ చేసే దుస్తులు ధరించాలి. పొడుగు చేతులు ఉన్న దుస్తులు వేసుకోవడం వల్ల సూర్య కిరణాలు నేరుగా చర్మంపై పడకుండా కాపాడుకోవచ్చు. అలాగే నెత్తిపై టోపీ పెట్టుకోవడం వల్ల ముఖంపై కిరణాలు పడకుండా చూసుకోవచ్చు. సన్ గ్లాసెస్ ధరించడం వల్ల కళ్ల చుట్టూ ఉన్న చర్మాన్ని రక్షించుకోవడంతో పాటు కళ్లను కూడా కాపాడుకోవచ్చు.
2. సన్‌స్క్రీన్ వాడాలి:
కాలంతో సంబంధం లేకుండా ఎండ కొడుతున్నప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా సన్‌స్క్రీన్ రాసుకోవాలి. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటే సన్‌స్క్రీన్ ఎంచుకోవాలి. ముఖ్యంగా ఒంటిపై ఎక్కడైతే ఎండ తగులుతుందో అక్కడ తప్పనిసరిగా సన్‌స్క్రీన్ రాసుకోవడం వల్ల ఎండ నుండి చర్మాన్ని రక్షించుకోవచ్చు.
3. నీడలో ఉండటానికి ప్రయత్నించాలి:
ఇంటి నుండి బయటకు వెళ్లాల్సి వస్తే వీలైనంత వరకు నీడలో ఉండటానికి ప్రయత్నించాలి. నేరుగా సూర్య కిరణాలు తాకకుండా చూసుకోవాలి.

4. పట్టపగలు బయటకు వెళ్లొద్దు:
ఉదయం పది, పదిన్నర నుండి సాయంత్రం నాలుగున్నర, ఐదింటి వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిది. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.
5. హైడ్రేటెడ్ గా ఉండాలి:
కాలంతో సంబంధం లేకుండా పుష్కలంగా నీరు తాగాలని గుర్తుంచుకోండి. ముఖ్యంగా వేసవికాలంలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. చెమట రూపంలో వెళ్లిపోయిన నీటిని భర్తీ చేసుకోవాలి. దాహంగా లేకపోయినా తరచూ కొంత మొత్తంలో నీటిని తాగుతూ ఉండాలి.
6. ఎండలో నీటిలో ఉండొద్దు:
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోత ఇబ్బంది పెడుతుంటే నీటిలో సేదతీరడం, ఈత కొట్టడం, ఆడుకోవడం ఉపశమనంగా అనిపించవచ్చు. కానీ, దీని వల్ల వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ అవుతాయని గుర్తుంచుకోవాలి. అలాగే నీటిలో పడి పరావర్తనం చెందే సూర్య కిరణాల వల్ల త్వరగా అలసిపోతారు.
7. పెదవులను మర్చిపోవద్దు:
సూర్య కిరణాల వల్ల పెదవులు కూడా ప్రభావితం అవుతాయి. బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే తప్పనిసరిగా SPF ఎక్కువగా ఉన్న లిప్ బామ్ వాడాలి. పెదాలను ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి. పుష్కలంగా నీరు తాగడం వల్ల చర్మంతో పాటు పెదాలు కూడా తేమగా ఉంటాయి. వేసవిలో పెదాలు పగిలితే చాలా మంది నాలుక లాలాజలం ద్వారా తడి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పెదాలు ఇంకా ఎక్కువగా పొడిబారి పగులుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications