Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
షుగర్ వ్యాధిని గుర్తించండిలా..తినడానికి ముందు,తర్వాత బ్లడ్ లో చక్కెర స్థాయి ఎంత ఉండాలంటే..
ఆహారపు అలవాట్లలో మార్పులు, జీవనశైలిలో మార్పుల కారణంగా ఈ రోజుల్లో చాలామంది మధుమేహానికి లేదా డయాబెటిస్ కి గురవుతున్నారు. ఒక్కసారి డయాబెటిస్ వస్తే దాన్ని నియంత్రించగలమే తప్ప పూర్తిగా నయం చేసే మెడిసిన్ ఇప్పటివరకు రాలేదు. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ రోగుల్లో అత్యధికశాతం మంది మనదేశంలోనే ఉన్నారు. అందుకే మనదేశాన్ని డయాబెటిస్ కు వరల్డ్ క్యాపిటల్ అని కూడా పిలుస్తుంటారు. మధుమేహంలో.. క్లోమం ఇన్సులిన్ ఉత్పత్తిని ఆపివేస్తుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది.
డయాబెటిక్ రోగులకు తినకముందు,తిన్న తర్వాత వారి రక్తంలో షుగర్ లెవల్స్ చెక్ చేయాలని డాక్టర్లు సలహా ఇస్తారు. అయితే డయాబెటిక్ రోగి రక్తంలో షుగర్ లెవల్ ని ఎప్పుడు చెక్ చేయడం సరైనదో చాలా మందికి తెలియదు. కాబట్టి అసలు మధుమేహ రోగులు ఏ విషయాలను గుర్తుంచుకోవాలో ఇక్కడ చూడండి.

తినడానికి ముందు రక్తంలో చక్కెర స్థాయి ఎంత ఉండాలి?
ఉపవాసం ఉండటం అంటే ఏమీ తినకుండానే షుగర్ లెవల్ ని చేయడం. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి గత 8 గంటలుగా ఏమీ తినకపోతే,వారి రక్తంలో చక్కెర స్థాయి 70-99 mg/dl మధ్య ఉండాలి. మీరు ఏమీ తినకపోయినా మీ రక్తంలో చక్కెర స్థాయి 130 mg/dl లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అది డయాబెటిస్ సంకేతం కావచ్చు. అటువంటి పరిస్థితిలో ఆహారం తినే ముందు మీ బ్లడ్ లో షుగర్ లెవల్ ని చెక్ చేయండి.
తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయి ఎంత ఉండాలి?
తినే ముందు మాత్రమే కాకుండా తిన్న తర్వాత కూడా రక్తంలో చక్కెర స్థాయిని తనిఖీ చేయాలి. తిన్న 2 గంటల తర్వాత రక్తంలో షుగర్ లెవల్ ని చెక్ చేయండి. తిన్న 2 గంటల తర్వాత ఆరోగ్యవంతులైన వ్యక్తుల రక్తంలో చక్కెర స్థాయి 130-140 mg/dl మధ్య ఉంటుంది. అయితే డయాబెటిక్ రోగి రక్తంలో చక్కెర స్థాయి 180 mg/dl కి చేరుకుంటుంది. దీని కంటే చక్కెర స్థాయి ఇంకా ఎక్కువగా ఉంటే అది ఆరోగ్యానికి చాలా ఆందోళన కలిగిస్తుంది.
మీ రక్తంలో చక్కెర స్థాయిని ఎలా చెక్ చేయాలి?
రక్తంలో చక్కెర స్థాయిని తనిఖీ చేయడానికి మీరు ఆన్‌లైన్ లో లేదా ఏదైనా మెడికల్ షాపు నుండి బ్లడ్ షుగర్ టెస్ట్ మెషీన్ ను కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు మీరు ల్యాబ్‌కు వెళ్లి కూడా మీ షుగర్ లెవల్స్ ని చెక్ చేసుకోవచ్చు. అయితే ప్రతిరోజూ ల్యాబ్ కు వెళ్లడం సాధ్యం కాదు కాబట్టి మీరు దీని కోసం ఒక మెషీన్ ని కొనుగోలు చేస్తే అది మీకు చాలా ఈజీ అవుతుంది. దీని ద్వారా మీ ఆరోగ్యానికి ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే డాక్టర్ ని సంప్రదించి దాన్ని నయం చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications