Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
మందులు వేసుకోకుండానే మధుమేహాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఇలా చేస్తే సులభంగా నియంత్రించొచ్చు
మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటే తప్ప పూర్తిగా అది నయం కాదు. కానీ ఇన్సులిన్ లేదా మందుల అవసరం లేకుండా కూడా మధుమేహాన్ని తరిమికొట్టవచ్చు. మందులు లేకుండా మధుమేహాన్ని నియంత్రించాలనుకుంటే జీవనశైలిలో 5 మార్పులు చేసుకుంటే చాలు.

ఆరోగ్యకరమైన ఆహారం
మధుమేహ వ్యాధిగ్రస్తులు చేయాల్సిన పని ముందుగా ఆహారంలో మార్పులు చేసుకోవడం. కొందరు వ్యక్తులు తమ ఆహారాన్ని మార్చుకోవాలని చెబితే పెద్దగా మార్పులు చేయరు. రుచికరమైన ఆహారాన్ని తినలేమని అనుకుంటారు. మీరు ఆరోగ్యకరమైన జీవనసైలిని అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు చేయాల్సిన పని ఆహారాన్ని ఎంచుకోవడం. రక్తంలో చక్కెరను పెంచే ఆహారాలు తినకూడదు. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. కూరగాయలు తినాలి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు తినడం మంచిది. అలాగే ఆహారాన్ని మితంగా తినాలి.
రోజూ వ్యాయామం చేయాలి
రక్తంలో చక్కెరను అదుపు చేయడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. వ్యాయామం ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. వారానికి 150 నిమిషాల పాటు రోజుకు 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వల్ల మధుమేహం అదుపులో ఉండటమే కాకుండా బరువును కూడా నియంత్రించవచ్చు.
ఆరోగ్యకరమైన శరీర బరువు
అధిక బరువుతో ఉన్న వారు క్రమంగా బరువు తగ్గడంపై దృష్టి పెట్టాలి. దీని వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గడానికి సహాయపడుతుంది. ఆహారం, వ్యాయామం వల్ల బరువు తగ్గవచ్చు.
మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి
మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. మానసిక ఒత్తిడి పెరిగితే మధుమేహం మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. రోజూ కంటినిండా నిద్రపోవాలి. వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకోవాలి. ధ్యానం, యోగా సాధన చేయడం వల్ల మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవచ్చు.
నీళ్లు బాగా తాగాలి
నీరు పుష్కలంగా తాగాలి. రోజుకు 8 గ్లాసుల నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. దాహం వేయకపోయినా కొద్దిగా అయినా తాగుతూ ఉండాలి. దీని వల్ల కిడ్నీలు బాగా పని చేయడంతోపాటు రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications