చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి!

నాన్ వెజ్ అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది చికెన్. అలాంటి చికెతో బిర్యానీ చేస్తే నాన్ వెజ్ లవర్స్ కి పండగే. వీకెండ్ వచ్చినా, నార్మల్ డేస్ లో అయినా చికెన్ బిర్యానీ తినే వాళ్ల సంఖ్య ఎక్కువే ఉంటది. హోటల్స్ కి వెళ్లి, రెస్టారెంట్స్ కి వెళ్లో లేదా ఇళ్లల్లో చేసుకొని చికెన్ బిర్యానీ తింటారు. అ

యితే బయట హోటల్స్ లో కొన్ని చోట్ల అపరిశుభ్ర వాతావరణంలో చికెన్ బిర్యానీ వండుతున్నారు..దీని వల్ల లేని అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. అలాంటప్పుడు వీలైనంతవరకు ఇంట్లోనే చికెన్ బిర్యానీ చేసుకొని తినడం బెటర్. బయట మంచి శుభ్రత పాటించే హోటల్స్ కి కూడా అప్పడప్పుడు వెళ్లి తిన్నా ఏమవదు.

How to eat Chicken Biryani healthily Neurologist Dr Vikranth tips

అయితే చికెన్ బిర్యానీ తినడం కాదు అది తినే విధానం కూడా చాలా ముఖ్యం అంటున్నారు కరీంగనర్ కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్, న్యూరో ఫిజిషియన్ అయిన డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్. చికెన్ బిర్యానీ ఎలా తినాలి, డాక్టర్ విక్రాంత్ దీనికి సంబంధించి తన యూట్యూబ్ అకౌంట్ పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఏం చెప్పారో ఇక్కడ చూడండి.

చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం! చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం!

చికెన్ బిర్యానీ తినడానికి ఓ పద్దతి

మనకు హాని చేయకుండా చికెన్ బిర్యానీ ఎలా తినాలో ఇప్పుడు చూద్దాం. ధారణంగా హోటల్ లో చికెన్ బిర్యానీ తీసుకుంటే అందులో రెండు పీసులు ఇస్తారు. ఆ రెండు చికెన్ ముక్కలు తినాలి, ఇచ్చే రైస్ లో సగం లేదా పావు శాతమే తినాలి.

ముఖ్యమైన విషయం ఏంటంటే..ముందు ఒక చికెన్ ముక్కను తినేయాలి. ఒట్టి చికెన్ ముక్క తిన్న తర్వాత మాత్రమే కొంచెం రైస్ తో మిగతా చికెన్ ముక్కలను కలుపుకుంటూ తినాలి. ఈ పద్ధతినే ప్రొటీన్ ఫస్ట్ అని అంటారు. ఎప్పుడైతే మొదట ప్రొటీన్ తింటామో..ప్రతి మీల్ లో ఫస్ట్ ప్రొటీన్ తినడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ సడెన్ గా పెరగవు. ఇన్సులిన్ లెవల్స్ పెరగవు, తొందరగా లావు అవ్వము. కాబట్టి చికెన్ బిర్యానీ తిన్నా కూడా ఎక్కువ లావు అవ్వకుండా ఉండవచ్చని డాక్టర్ విక్రాంత్ చెప్పారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Wednesday, September 9, 2026, 12:08 [IST]
Desktop Bottom Promotion