Latest Updates
-
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
గ్యాస్, అసిడిటీకి తక్షణమే చెక్ పెట్టే అద్భుతమైన వాము పరాఠా.. ఎలా చేయాలో తెలుసా? -
తొలి ఏకాదశి తేదీ, తిథి, పూజా విధానం, ఉపవాసం ఎలా విరమించాలి.. పూర్తి వివరాలు.! -
టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? యూరాలజిస్ట్ చెబుతున్న అసలు నిజం ఇదే! -
వృశ్చికంలోకి చంద్రుడు.. రానున్న మూడు రోజులు ఈ రాశుల వారి గోల్డెన్ డేస్.! -
హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ కధి పకోడి..వేడి వేడి అన్నంతో తింటే అమృతమే..ఈజీగా చేసుకోండిలా.. -
నాన్‌వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.?
మామిడిపండు మంచిదా కాదా? సింపుల్ చిట్కాలతో తెలుసుకోండిలా
ప్రస్తుతం మార్కెట్లలో ఎక్కడ చూసినా మామిడికాయలు కనిపిస్తున్నాయి. అయితే సమ్మర్ సీజన్ ప్రారంభం నుంచే కొంతమంది హానికరమైన కార్బైడ్ లను ఉపయోగించి మామిడికాయలను పండించి వాటిని మార్కెట్ లలో అమ్ముతుంటారు. అయితే వీటిని తింటే అనారోగ్యం పాలవడం గ్యారెంటీ. సహజమైన పద్ధతిలో పండిన మామిడిపండు తింటే ప్రయోజనకరమే కానీ ఇలా అసహజపద్దతిలో రసాయనాలను ఉపయోగించి పండబెట్టిన మామిడికాయలు ఆరోగ్యంపై చాలా తీవ్ర ప్రభావం చూపుతాయి.
మీరు మార్కెట్ లో మామిడికాయ కొనేముందు అది మంచిదేనా లేక హానికరమైన కార్బెడ్ లను ఉపయోగించి అవి పండించడ్డాయో అనేది తెలుసుకోవడం చాలా సింపుల్ అని సెలబ్రిటీ వెల్ నెస్ కోచ్ ల్యూకో కౌటిన్హో ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని టిప్స్ షేర్ చేశాడు.

మామిడిపండు మంచిదా కాదా? ఇలా తెలుసుకోండి
మామిడి తొక్కను చెక్ చేయండి
మామిడికాయ కొనే ముందు దాని తొక్కను జాగ్రత్తగా గమనించండి. తొక్క రంగు అంతా ఒకేలా ఉంటే అది మంచిదే..అయితే ఎక్కడైనా నల్ల మచ్చలు ఉంటే దానిని మెల్లగా ఒత్తి చూడండి. సహజంగా పండిన మామిడి కాస్త గట్టిగా,గుజ్జుగా ఉంటుంది. అదే రసాయనాలతో పండిస్తే మెత్తగా ఉంటుంది.
నీళ్లతో ఇలా టెస్ట్ చేయండి
ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకోండి. మామిడి పండును అందులో వేయండి. మునిగిపోతే అది నాణ్యమైనది, లోపలంతా గుజ్జుతో నిండి ఉంటుందన్నమాట. ఒకవేళ తేలితే మాత్రం అది కార్బైడ్ వంటి రసాయనాలతో పండించారని అర్థం. ఇలాంటి పండ్లు త్వరగా పండుతాయి కానీ వాటిలో గుజ్జు తక్కువగా, గాలి ఎక్కువగా ఉండి తేలికగా ఉంటాయి. ఇకపై మీ మామిడి పండ్లను ఎలాంటి భయం లేకుండా ఆస్వాదించడానికి ఇది చాలా సులువైన ట్రిక్ అని ల్యూకో కౌటిన్హో తెలిపాడు.
ఇది గుర్తుంచుకోండి
ఈ టెస్ట్ మీకు దాదాపు ఖచ్చితమైన ఫలితాన్ని ఇవ్వగలదు.. కానీ కొన్నిసార్లు కచ్చితత్వం మారవచ్చు అని ల్యూకో కౌటిన్హో తన వీడియో క్యాప్షన్ లో పెట్టాడు . నిజమైన నిర్ధారణ కోసం ల్యాబ్ పరీక్ష అవసరం కావచ్చు... కానీ ఇది మనం మొదలు పెట్టడానికి మంచి మార్గం అని అన్నాడు. కాబట్టి తర్వాతిసారి మామిడి పండు కొనేటప్పుడు ఈ సింపుల్ చిట్కాలు గుర్తుపెట్టుకోవాలని.. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది అని తెలిపాడు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications