Latest Updates
-
నోట్లో పెట్టుకుంటే జారిపోయే పచ్చికొబ్బరి హల్వా..చక్కెర లేకుండానే 10 నిమిషాల్లోనే చేసుకోండిలా.. -
తమిళనాడు స్టైల్ చేపల కూర..ఒక్కరే మొత్తం తినేసేంత రుచిగా ఉంటది -
ఇంటికొచ్చి రంగులేేసే పెయింటర్ తో మహిళ ఎఫైర్..భర్తను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరణ..అసలు ట్విస్ట్ ఏంటంటే.. -
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా..
ఆడవారిలో రక్తం బాగా పెరగాలంటే..తరచూ వీటిని తినండి
మనదేశంలో ఉన్న ఆడవాళ్లు ఎక్కువగా ఐరన్ లోపం వచ్చే రక్తహీనతతో బాధపడుతుంటారు. ఉరుకుల పరుగుల జీవితం, కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయి మహిళలు తమ సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. దీంతో రక్తహీనత అనే ప్రాధాన ఆరోగ్య సమస్యతో ఎక్కువ మంది మహిళలు బాధపడతుంటారు. ఆడవారిలో రక్తం బాగా పెరగాలంటే అంటే హిమోగ్లోబిన్ లెవల్స్ బాగా పెరగాలంటే కొన్ని ఆహార పదార్థాలు తరచూ తీసుకోవాలని డాక్టర్ మనోజ్ణ సూచిస్తున్నారు.
ఈ ఆహారపదార్థాలన్నీ తరచూ తినడం వల్ల ఆడవాళ్లు రక్తహీనత సమస్యకు దూరంగా, ఆరోగ్యంగా ఉంటారని ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మనోజ్ణ తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో తెలిపారు. ఆడవారిలో రక్తహీనతను పోగొట్టేందుకు ఏం తినాలో ఇక్కడ చూడండి.

తీపితో పాటు ఆరోగ్యం
ఆడవాళ్లు తరచూ బెల్లం, ఖర్జూరం, ఎండద్రాక్ష తింటుండాలి.వీటిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. స్వీట్లు తినాలని నాలుక గుంజేస్తున్నప్పుడు చక్కెర బదులుగా బెల్లం వాడటం వల్ల శరీరంలో రక్తం నేచురల్ గా వృద్ధి చెందుతుంది.
రక్తాన్ని పుట్టించే ఆకుకూరలు, దుంపలు
పాలకూర, బీట్ రూట్ లాంటివి రక్తహీనతకు బెస్ట్ మెడిసిన్. వీటిలో ఐరన్ తో పాటు ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరంలో కొత్త ఎర్ర రక్త కణాలు పెరగడంలో ఇది సహాయపడుతుంది.
విటమిన్ C మ్యాజిక్
దానిమ్మ, ఉసిరి, నిమ్మ, జామ కాయ, బ్రోకలీ, అన్నీ రకాల ఆకు కూరల్లో ఐరన్ తో పాటు విటమిన్ C కూడా ఉంటుంది. ఈ విటమిన్ సి.. తినే ఆహారంలో ఉండే ఐరన్ ను శరీరంలోకి బాగా గ్రహించడానికి సహాయపడుతుంది. ఈ ఆహారాలు ఐరన్ శోషణను వేగవంతం చేసి రక్తహీనతను తరిమికొడతాయి.

ఐరన్ తో పాటు ప్రొటీన్ పవర్ కూడా
హిమోగ్లోబిన్ పెరగడంతో పాటు కండరాలు స్ట్రాంగ్ గా ఉండాలంటే ప్రొటీన్ కూడా అవసరం.
చిక్కుడుకాయలు, శనగలు, రాజ్మా,కందిపప్పు,మటన్..వీటన్నింటిలో ఐరన్ తో పాటు ప్రొటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి మిమ్మల్నిరోజంతా యాక్టివ్ గా ఉంచుతాయి.
ఎముకల బలంకి నువ్వులు
మహిళల పాలిట అమృతం లాంటివి నువ్వులు. అలాగే నవ్వులలో ఐరన్ తో పాటు ఎముకల ధృడత్వానికి అవసరమయ్యే క్యాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. నువ్వులు మహిళల్లో ఎముకల అరుగుదల రాకుండా కాపాడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
