Latest Updates
-
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి!
వీర్యం వృద్ధి చెందాలంటే ఈ ఒక్కటి రోజుకు రెండు తింటే సరిపోతుంది..!
మన శరీరంలో ఆరోగ్యంగా వుండాలంటే సూక్ష్మ పోషకాలు చాలా వుండాలి. అలాంటి వాటిల్లో వైటమిన్లు, మినరల్స్ వుంటాయన్న విషయం మీకు తెలిసిందే. మినరల్స్‌లో సిలీనియం చాలా అవసరం పడుతుంది. ఈ సిలీనియం పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరం జబ్బు బారిన పడకుండా కాపాడుతూ వుంటుంది. శరీరానికి సిలీనియం చాలా అవసరం పడుతుంది. ప్రతీ రోజూ శరీరానికి 55 మైక్రో గ్రాముల సిలీనియం కావాలి. థైరాయిడ్ హార్మోన్లు ఉత్పత్తి కావడానికి సిలీనియం అవసరం పడుతుంది. అడవారిలో అండం విడుదల కావాలన్నా సిలీనియం కావాలి. వీర్య కణాలు ఉత్పత్తి కావడానికి కూడా సిలీనియం కావాల్సిందే. సిలీనియం లోపించిన వారికి పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువగా వుంటాయ్. హైపోథైరాయిడ్ వచ్చిన వారిలో కూడా ఈ లోపం వుంటుంది. డీఎన్‌ఏ తయారు కావడానికి కూడా సిలీనియం చాలా అవసరం పడుతుంది.

రోగనిరోధక శక్తిని యాక్టివేట్ చేయడానికి కూడా సిలీనియం బాగా ఉపయోగపడుతుంది. రక్త ప్రసరణ జరిగేటప్పుడు కొవ్వు నిలవకుండా వుండడానికి కూడా సిలీనియం కావాలి. ఆహారపదార్ధాలను ఎక్కువగా వేడిచేయడం వల్ల సిలీనియం శాతం తగ్గిపోతుంది, క్యాన్సర్, హెచ్‌ఐవీ వచ్చిన వాళ్లల్లో కూడా సిలీనియం తగ్గిపోతుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్, మలబద్దకం వున్నప్పుడు కూడా సిలీనియం లోపిస్తుంది.
సిలీనియం లోపించినప్పుడు కొంచెం మత్తుమత్తుగా వుంటుంది. ఇలాంటి లక్షణం వుంటే అటు మగ, ఇటు ఆడవారిలో సంతానలేమి లోపం వుందని అర్థం చేసుకొచ్చు. అల్జీమర్ లాంటి సమస్యలు తలెత్తడం కూడా సిలీనియం లోపానికి కారణమవుతుంది. సిలీనియం లోపిస్తే జుట్టు కూడా ఊడిపోతుందని చెబుతున్నారు.
బ్రెజిల్ నట్‌లో సిలీనియం అత్యధికంగా వుంటుంది. 100 గ్రాములో బ్రెజిల్ నట్స్‌లో 1917 మైక్రో గ్రాముల సిలీనియం వుంటుంది. 100 గ్రాముల బ్రౌన్ రైస్‌లో 19 గ్రాముల సిలీనియం వుంటుంది. పెరుగులో 8 గ్రాముల సిలీనియం వుంటుంది. పొద్దతిరుగుడు పప్పులో 80 మైక్రో గ్రాముల సిలీనియం వుంటుంది. అయితే బ్రెజిల్ నట్స్‌లోనే సిలీనియం అత్యధిక మోతాదులో వుంటుంది. ఈ సిలీనియం యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది, జబ్బుల బారిన పడకుండా చేస్తుంది, డీఎన్‌ఏ ను ఆరోగ్యంగా వుంచడానికి కూడా ఈ బ్రెజిల్ నట్స్ బాగా ఉపయోగపడతాయ్.
గర్భిణులకు కూడా ఈ సెలీనియం చాాలా అవసరం. కడుపులో బిడ్డ డీఎన్‌ఏ బాగా వృద్ధిలోకి రావాలన్నా కూడా ఈ బ్రెజిల్ నట్స్ కావాల్సిందే. వేయించి తినడం తగ్గిస్తే సిలీనియంను కావాల్సినంత పొందవచ్చు. న్యాచురల్ నట్స్‌ను రోజూ తీసుకుంటే సిలీనియం బాగా అందుతుంది.
సిలీనియం సంమృద్ధిగా వుండే బ్రెజిల్ నట్స్ ఒక కేజీ 3వేల రూాపాయల వరకు వుంటుంది. రోజుకు 2,3 బ్రెజిల్ నట్స్ తింటే సరిపోతుంది.
మెంతుల పొడి వల్ల కూడా వీర్యం పెరుగుతుంది. ఉదయం, సాయంత్రం రెండు పూటలూ 5 గ్రాముల మెంతుల పొడిని తీసుకోవాలి. ఇది శరీరం లోపలికి వెళ్లి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను బాగా తగ్గిస్తుంది. టైప్ 2 షుగర్ రాకుండా కూడా చేస్తుంది. రక్తంలో వున్న టెస్టోస్టిరోన్‌ను కూడా బాగా పెంచుతుంది. టెస్టోస్టిరోన్ లెవెల్స్ బాగుంటే స్పర్మ్ ప్రొడక్షన్ కూడా బాగుంటుంది. మగవారిలో లైంగిక సామర్ధ్యం కూడా ఆటోమెటిక్‌గా పెరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











