Interview with Fitness trainer manohar: అందం తగ్గకుండా సులభంగా బరువు ఎలా తగ్గాలో చెప్పిన ఫిట్నెస్ ట్రైనర్ మనోహ

ఈ మధ్యకాలంలో ప్రజలందరినీ వెంటాడి వేధిస్తున్న సమస్య ఏదైనా ఉందంటే అది అధిక బరువు. అధిక బరువు కారణంగా చాలా మంది అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. మానసికంగా శారీరకంగా ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు. అలాగే బరువు తగ్గేందుకు యథాప్రయాసలు పడుతున్నారు. డైట్ చేస్తూ, జిమ్‌లకు వెళ్తూ.. కష్టాలను అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో బరువు తగ్గుతున్నారే తప్ప శారీరకంగా వీక్ అవుతున్నారు. అలాగే సాధారణంగా ఉండే అందాన్ని కూడా కోల్పోతున్నారు.

అసలు బరువు తగ్గడమనేది ఒక సవాలు అంటే.. అందం కోల్పోకుండా బరువు తగ్గడమనేది మరొక సవాలుగా మారింది. అయితే సరైన పద్దతిలో డైట్ చేయడం, సరైన పద్దతిలో వర్క్ అవుట్ చేయడం ద్వారా అందం కోల్పోకుండా బరువు తగ్గొచ్చని ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ మనోహర్ వెల్లడించారు. అయితే ఎలాంటి డైట్ పాటిస్తే అందం కోల్పోకుండా బరువు తగ్గొచ్చు? ఏ విధమైన వర్క్ అవుట్స్ చేస్తే ఇది సాధ్యమవుతుంది? అనేది మనోహర్ మాటల్లోనే తెలుసుకుందాం. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ పొందుపరచాము ఓసారి చదివేయండి.

How to lose weight without losing skin glowing in telugu

ఆరోగ్యకరమైన ఆహారం:

సమతుల్య ఆహారం:

అందం కోల్పోకుండా సులభంగా బరువు తగ్గాలంటే కచ్చితంగా సమతుల్యమైన ఆహరం తీసుకోవాలని మనోహర్ గారు వెల్లడించారు. మీరు తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోవాలని, అప్పుడే శరీరానికి కావాల్సిన పోషకాలు అందడంతో పాటు బరువు తగ్గేందుకు సహాయపడుతుందని వెల్లడించారు.

వాటికి దూరంగా ఉండాలి..

సాధారణంగా ప్రాసెస్ చేసిన ఫుడ్ ఆరోగ్యానికి చాలా హానికరమని మనోహర్ వెల్లడించారు. ఇందులో అధిక మొత్తంలో అనారోగ్యానికి గురి చేసే పదార్థాలు ఉండడంతో పాటు.. సులభంగా బరువు పెంచే కొవ్వు పదార్థాలు, ముఖాన్ని అందహీనంగా మార్చే కొవ్వు ఉంటాయని వెల్లడించారు. అందుకే చక్కెర, నూనె, ఉప్పు ఎక్కువగా ఉండే ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలని సూచించారు.

నీరు ఎక్కువగా తాగాలి..

అందం కోల్పోకుండా సులభంగా బరువు తగ్గాలనుకునే వ్యక్తులు అధికంగా నీరు తాగాలని మనోహర్ వెల్లడించారు. ప్రతి రోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని తెలిపారు. ఇలా తాగడం వలన శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుందని, చర్మానికి కావాల్సిన తేమ కూడా దొరుకుతుందని తెలిపారు. అసలు ఎండాకాలం వచ్చేయడంతో పాటు ఎండలు కూడా ముదిరిపోవడంతో అధికంగా నీళ్లు తీసుకోవాలని సూచించారు.

పోషకాలు..

మన శరీరం గట్టిగా ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి కేవలం శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు.. ఈ విటమిన్స్ చర్మ అందానికి కూడా ఎంతగానో దోహదపడతాయి. అందుకే ఖనిజాలు, మినరల్స్, విటమిన్స్ ఉన్న ఆహారాన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని మనోహర్ సూచించారు. అలాంటి ఆహరం తీసుకోవడం వలన అందం పాడవకుండా ఉండడంతో పాటు బరువు కూడా సులభంగా తగ్గుతారట.

వ్యాయామం:

క్రమం తప్పకుండా వ్యాయామం

బరువు తగ్గడానికి డైట్‌తో పాటు వ్యాయామం కూడా చేయాలని మనోహర్ వెల్లడించారు. ఒక వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని, కుదరని యెడల కనీసం 75 నిమిషాల పాటైనా తీవ్రమైన వ్యాయామం చేయాలని సూచించారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని ఫ్యాట్ అంతా బర్న్ అవుతుందని, తద్వారా కండరాలు బలపడి బరువు తగ్గుతారని పేర్కొన్నారు.

యోగా, ధ్యానం:

వ్యాయామంతో పాటు క్రమం తప్పకుండా యోగా ధ్యానం వంటివి కూడా చేయాలని సూచించారు. యోగ ధ్యానం చేయడం వలన ఒత్తిడి అనేది తగ్గిపోతుందని, మనసు ప్రశాంతంగా ఉంటుందని.. తద్వారా చర్మం ప్రకాశవంతంగా కాంతివంతంగా వికసిస్తుందని వెల్లడించారు. అందుకే యోగ ధ్యానం కూడా చాలా ముఖ్యమని పేర్కొన్నారు.

నడక:

నడక అనేది ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. చాలా మంది వైద్యులు సైతం బరువు తగ్గడానికి ఏవైనా వ్యాధులు తగ్గడానికి నడవాలని సూచిస్తుంటారు. మనోహర్ సైతం ఇదే తెలిపారు. ప్రతిరోజూ కచ్చితంగా నడవాలని, తద్వారా గుండె ఆరోగ్యంగా ఉండడంతో పాటు బరువు కూడా తగ్గొచ్చని సూచించారు. రోజుకు కనీసం 30 నిమిషాలు నడవడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.

చర్మ సంరక్షణ:

సూర్యరశ్మి నుంచి రక్షణ:

అందం పాడవకుండా బరువు తగ్గాలంటే లోపలి నుంచి ఏ విధంగా పోషకాలు కలిగిన ఆహారాన్ని అందిస్తున్నామో.. బయటి నుంచి కూడా చర్మాన్ని అలానే కాపాడుకోవాలని మనోహర్ వెల్లడించారు. అందులో భాగంగానే సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించడానికి సన్‌స్క్రీన్ ఉపయోగించాలని సూచించారు.

చర్మ సంరక్షణ దినచర్య: చర్మాన్ని శుభ్రం చేయడం, టోనింగ్ చేయడం, మాయిశ్చరైజింగ్ చేయడం వంటివి క్రమం తప్పకుండా చేయాలన్నారు.

తగినంత నిద్ర: రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు.
ఒత్తిడిని తగ్గించుకోండి: ఒత్తిడి చర్మంపై ప్రభావం చూపుతుందని, కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలన్నారు.

చిట్కాలు:

బరువు తగ్గడానికి తొందరపడకుండా, నెమ్మదిగా, స్థిరంగా ప్రయత్నించాలని చెప్పారు.
ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందన్నారు.
ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం మంచిదని సూచించారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Sunday, March 16, 2025, 21:25 [IST]
Desktop Bottom Promotion