Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
మన పూర్వీకుల్లా అదొక్కటి తింటే..ఒంట్లో యూరిక్ యాసిడ్ అంతా యామం!
ప్రస్తుతం ప్రజల లైఫ్ స్టైయిల్ లో చాలామార్పులు వచ్చాయి. మారుతున్న ఆహారపు అలవాట్లు తరచుగా అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అధిక యూరిక్ యాసిడ్ సమస్య వీటిలో ఒకటి. ఈ మధ్యకాలంలో చాలామంది యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు. ఆహారం, డ్రింక్స్‌లో ఉండే ప్యూరిన్స్ అనే రసాయనాల్ని శరీరం విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. బిజీ లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం ఇవన్నీ రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతున్నాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరగడం వల్ల కీళ్ల నొప్పులతో పాటు అనేక వ్యాధులు రావచ్చు.
యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే తరుచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. అంతేకాకుండా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడవచ్చు. దీంతో మూత్ర విసర్జన సమయంలో మంట వస్తుంది. నడుము కింద, పొట్ట దిగువ భాగం, గజ్జల్లో నొప్పి వస్తుంది. కాబట్టి సమయానికి యూరిస్ యాసిడ్ ని నియంత్రించడం చాలా ముఖ్యం. మెడిసిన్స్ ద్వారా మాత్రమే కూడా తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల కూడా పెరిగిన యూరిక్ యాసిడ్ నియంత్రించవచ్చు.

యూరిస్ యాసిడ్ ని నేచురల్ గా కంట్రోల్ చేయడం ఎలా
ఇది తినాలి
మీరు అధిక యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే గోధుమ రోటీ తినడం మానేసి దాని స్థానంలో మిల్లెట్ రోటీని తినండి. పోషకాలు అధికంగా ఉండే మిల్లెట్ రోటీ యూరిక్ యాసిడ్ ను నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అధిక యూరిక్ యాసిడ్‌ని నియంత్రించడంలో మిల్లెట్ రోటీ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం-
పోషకాలు అధికంగా ఉండే మిల్లెట్
మిల్లెట్ చాలా కాలంగా ప్రజల ఆహారంలో భాగమై ఉంది. కరోనా తర్వాత నుంచి చాలామంది ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టారు..ఈ క్రమంలో మిల్లెట్స్ తో చేసే ఫుడ్స్ ని తీసుకోడానికి ఆశక్తి కనబరుస్తున్నారు. అయితే దాని ప్రయోజనాల గురించి తెలియని వ్యక్తులు కూడా దాని ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేస్తారు. వాస్తవానికి మిల్లెట్స్ లో ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని డైట్‌లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు శరీరంలో పేరుకుపోయిన మురికిని తొలగించడంలో సహాయపడుతుంది.
అంతేకాకుండా ఇందులో ప్యూరిన్ పరిమాణం తక్కువగా ఉంటుంది, దీని కారణంగా ఇది యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో బాగా సహాయపడుతుంది. మిల్లెట్ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది శరీరం నుండి యూరిక్ యాసిడ్‌ను సులభంగా తొలగించడంలో సహాయపడుతుంది.
డాక్టర్లు ఏం చెబుతున్నారు.
మీరు యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నట్లయితే మీ ఆహారంలో మిల్లెట్ రోటీని ఖచ్చితంగా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని రోజూ తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గుతుంది. అలాగే నీళ్లు ఎక్కువగా తాగడం, పచ్చి కూరగాయలు తినడం, వేయించిన ఆహారానికి వీలైనంత దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications