Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనలేకపోతున్నారా? ఈ పొడి వాడితే బెడ్ రూమ్ లో రెచ్చిపోతారు!
ఏదైనా చిన్న దెబ్బ తగిలినా పరుగెత్తుకుంటూ హాస్పిటల్ కి వెళ్లే రోజులివి. అయితే హాస్పిటల్స్,ఇంగ్లీష్ మందులు ఇంతగా లేని ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదని ఎప్పుడైనా ఆలోచించారా? పాత రోజుల్లో అంతా ఆయుర్వేద వైద్యమే. ఆయుర్వేదం(Ayurvedam) అంటే ప్రత్యామ్నాయ వైద్య విధానం అని అంటారు. అయితే ఆయుర్వేదం అనేది కేవలం ఓ ట్రీట్మెంట్ విధానం మాత్రమే కాదు మన రోజువారి దిన్య చర్య ఎలా పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం,ఏ సీజన్ లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి,ఎలా ఉండాలి అనే విషయాలను తెలియజేసేది. ఒకవేళ వ్యాధి వస్తే ఆ వ్యాధికి చికిత్స ఎలా ఉండాలనేది కూడా ఆయుర్వేదం తెలియజేస్తుంది.
ఆయుర్వేదంలో అనే పదంలోనే మనకు తెలియని మొత్తం విషయం ఉంది. ఆయుర్వేదం అనే దాంట్లో రెండు పదాలు ఉంటాయి..అవి ఆయువు,వేదం. ఆయువు అంటే లైఫ్ లేదా జీవనం. వేదం అంటే జ్ణానం. మన జీవనం యొక్క నాలెడ్జ్ నే ఆయుర్వేదం అంటారు. ఆయుర్వేదం అనేది జీవన విధానం, చికిత్సా విధానం రెండూ కలిసినదే.

ఆయుర్వేద మూలికలు మనకున్న ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. ఇలాంటి వాటిలో అశ్వగంధ(Ashwagandha) ఒకటి. మన ఆయుర్వేదంలో ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉన్న అశ్వగంధ.. ఆకులు,వేర్లు,పండ్లు కాండం అన్నీ ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీన్ని వేల ఏళ్లుగా ఆయుర్వేదంలో అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అశ్వగంధను రోజూ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.
అశ్వగంధ రోజూ తీసుకుంటే ప్రయోజనాలివే
-సంతానలోపం సమస్య ఉన్న పురుషులు అశ్వగంధను తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. పిల్లలు పుట్టాలన్నా, లైంగిక జీవితం మెరుగ్గా ఉండాలన్నా స్పెర్మ్ కౌంట్ బాగుండాలి. అశ్వగంధ పురుషుల్లో లైంగిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచుతుంది. జననావయవాల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఈ క్రమంలో పురుషుల్లో ఉండే సంతాన లోపం సమస్యలు తగ్గుతాయి. పురుషులు నిత్యం అశ్వగంధను నిర్దిష్టమైన మోతాదులో తీసుకుంటే వారిలో వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని.. అలాగే అందులో శుక్రకణాల సంఖ్య పెరిగిందని,వాటి కదలికలు కూడా బాగున్నాయని పలు అధ్యయనాల్లో తేలింది.
-అశ్వగంధ ఒత్తిడిని తగ్గించడంలో అమోఘంగా పనిచేస్తుంది. శరీరంలో శక్తిస్థాయిలు పెరుగుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. అశ్వగంధ అంటే సంస్కృతంలో గుర్రపు వాసన అని అర్థం. అందుకే దానికి ఆ పేరు వచ్చింది. దీన్ని వింటర్ చెర్రీ అని కూడా పిలుస్తారు. అశ్వగంధను నిత్యం తీసుకున్నట్లయితే ఒత్తిడితోపాటు ఆందోళన కూడా తగ్గుతుంది.
-అశ్వగంధ లిబిడోను పెంచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనిని వాడటం వల్ల ఎక్కువసేపు శృంగారంలో పాల్గొంటారు. ఇది మీ సెక్స్ స్టామినాను పెంచుతుంది. మీ బలహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది.
-అశ్వగంధ డయాబెటిస్‌ను అదుపు చేస్తుంది. అశ్వగంధను వాడడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో కండరాలు ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయి. ఈ క్రమంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
-అశ్వగంధను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కూడా లైంగిక వాంఛ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇది కండరాలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది. అందువల్ల శక్తి కోసం అశ్వగంధ మెరుగ్గా పనిచేస్తుంది.
-అశ్వగంధను నిత్యం తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. డిప్రెషన్‌ను తగ్గించేందుకు కూడా అశ్వగంధ సహాయ పడుతుంది.
-అశ్వగంధను రోజూ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో వాపులు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది..మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
ఇలా తీసుకోవాలి
పొడి రూపంలో, ట్యాబెట్ల రూపంలో మార్కెట్ లో అశ్వగంధ మార్కెట్ లో అందుబాటులో ఉంది. రోజుకు రెండుసార్లు అశ్వగంధను తీసుకుంటే మంచిది. వెచ్చని పాలు లేదా గోరువెచ్చని నీళ్లలో పావు స్పూను అశ్వగంధ పొడిని కలుపుకొని తాగితే మంచిది. అశ్వగంధ ట్యాబ్లెట్లు వాడాలనుకున్నవారు ఆయుర్వేద వైద్యులను కలిసి తగిన సూచనలు తీసుకోవాలి.
Note: విజ్ఞాన ప్రయోజనం కోసం మాత్రమే ఈ సమాచారం. దీనిని పాటించే ముందు సంబంధిత నిపుణుల సూచనలు తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications