Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఎండాకాలం చెమట కంపు చిటికెలో పోగొట్టే దివ్యౌషధం.. పెర్ఫ్యూమ్‌లు కూడా అవసరం లేదు!
వేసవి కాలంలో సాధారణంగా చెమట ఎక్కువగా వస్తుంది. ఆ చెమట వాసన అనేది చాలా మందికి పెద్ద ఇబ్బందిగా మారుతుంది. చాలా సార్లు, స్నానం చేసిన కొద్దిసేపటికే చెమట వాసన తిరిగి రావడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో డియోడరెంట్లు, పెర్ఫ్యూమ్‌లు వాడుతుంటారు. కానీ ఇవి తాత్కాలికంగా మాత్రమే చెమట వాసనను ఆపగలవు. చెమట వాసన మళ్ళీ రావడం వలన మళ్ళీ అదే ఇబ్బంది మొదలవుతుంది. ఈ చెమట నుంచి శాశ్వతంగా బయటపడాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. ఆ టిప్స్ పాటించడం వలన సహజసిద్ధంగా చెమట కంపు నుంచి బయటపడొచ్చు. ఆ టిప్స్ ఏంటి? ఏం చేస్తే చెమట కంపు నుంచి బయటపడొచ్చు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చెమట వాసన తగ్గించే సహజ చిట్కాలు
పటికతో స్నానం చేయడం: చెమట వాసనను తగ్గించడానికి పటిక అనేది ఒక గొప్ప సహజ పరిష్కారం. పటికను స్నానపు నీటిలో కలపడం ద్వారా శరీరంలో నుంచి వచ్చే చెమట వాసన తగ్గవచ్చు. దీనిని చేయడం చాలా సులభం. స్నానం చేయడానికి 2 గంటల ముందుగా పటిక ముక్కను నీటిలో వేయండి. ఆ తరువాత ఆ నీటితో స్నానం చేస్తే సరిపోతుంది. మరొక ఉత్తమమైన పద్ధతి ఏంటంటే? రాత్రి పటిక ముక్కను ఒక బకెట్ నీటిలో వేసి, ఉదయం ఆ నీటితో స్నానం చేస్తే సరిపోతుంది. అలాగే పటిక పేస్ట్‌ను కూడా తయారు చేసి, దాన్ని చెమట వాసన ఉన్న ప్రదేశాల్లో పూస్తే కచ్చితంగా చెమట వాసన ఆగిపోతుంది.

పటిక పేస్ట్ తయారీ..
ముందుగా ఒక గిన్నెలో చల్లటి నీటిని తీసుకోండి. అందులో పటిక ముక్క వేసి కరిగించండి. ఈ మిశ్రమాన్ని దూదితో శరీరంలోని చెమట వాసన ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో అప్లై చేయండి. పేస్ట్ ఆరిన తర్వాత, శరీరాన్ని నీటితో శుభ్రం చేసుకోండి. తరువాత, చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి మాయిశ్చరైజర్ ఉపయోగించండి.
మిరియాల పొడి మరియు నిమ్మరసం
మిరియాల పొడి చెమట వాసనను తగ్గించడానికి సహాయపడుతుంది. మిరియాలలో ఉన్న యాంటీబాక్టీరియల్ గుణాలు చెమట వాసనను నివారించడానికి ఉపయోగపడతాయి. ఈ మిరియాల పొడితో తయారు చేసిన మిశ్రమం చెమట వాసనను తగ్గించడంలో సహాయపడుతుంది. మిరియాల పొడిని నిమ్మరసం కలిపి పేస్ట్‌ను తయారు చేసి, ఆ పేస్ట్‌ను చెమట ఎక్కువ అయ్యే ప్రదేశాల్లో అప్లై చేసి 10-15 నిమిషాలు వదిలేయండి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. వాసన తగ్గిపోతుంది.
టి ట్రీ ఆయిల్: టీ ట్రీ ఆయిల్ అనేది ఒక సహజ యాంటీబాక్టీరియల్ ఆయిల్. ఇది చెమట వాసనను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. కొన్ని ద్రాక్ష గుళికలు తీసుకుని, వాటిని టీ ట్రీ ఆయిల్ తో కలిపి శరీరంలో దుర్వాసన ఉన్న ప్రాంతాలలో అప్లై చేయండి. దీని ద్వారా చెమట వాసన తగ్గించి, శరీరంపై శుభ్రత కూడా ఏర్పడుతుంది.
విటమిన్ ఈ ఆయిల్, ఆలివ్ ఆయిల్: వీటిని నిమ్మరసం లేదా కొబ్బరి నూనెతో కలిపి శరీరంపై రాసుకోవడం వల్ల చెమట వాసనను తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేసి, స్వచ్ఛతను పెంచుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications