Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
Summer Health Tips: మండుటెండల నుండి పిల్లల ఆరోగ్యాన్ని ఇలా కాపాడండి
ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఉదయం పది, పదిన్నర అయిందంటే చాలు ఎండలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా వేసవి తాపం తీవ్రంగా ఉంది. ఇంటి నుండి బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు జనాలు. ఎర్రటి ఎండలతో వడదెబ్బ లాంటి సమస్యలతో పాటు నీరసించి పోతుంటారు.
ఈ సమయంలో అధిక ఉష్ణోగ్రతల నుండి పిల్లలను కాపాడుకోవడం తల్లిదండ్రులకు సవాల్‌గానే ఉంటుంది. వేసవిలో పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం వల్ల పిల్లల శరీరానికి అన్ని రకాల పోషకాలు అందుతాయి. ఈ వేసవిలో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ చిట్కాలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

1. లేత రంగు దుస్తులు ధరించాలి:
వేసవికాలంలో లేత రంగుల్లో ఉండే కాటన్ దుస్తులనే పిల్లలను వేసుకోనివ్వాలి. అలాగే ఫుల్ స్లీవ్ షర్ట్స్, టీషర్ట్స్ వేసుకోవడం వల్ల సూర్య కిరణాలు నేరుగా చర్మంపై పడకుండా కాపాడుకోవచ్చు. ఇంటి పట్టునే ఉండే పిల్లలకు స్లీవ్ లెస్ షర్ట్స్, టీషర్ట్స్ చాలా సౌకర్యంగా ఉంటాయి.
2. తగినంత నీరు తాగనివ్వాలి:
శరీరంలో దాదాపు 70 శాతం నీరు ఉంటుంది. రోజూ కొద్దిగా మూత్రం రూపంలో బయటకు వెళ్తుంది. దానిని భర్తీ చేసేందుకు మనం నీరు తాగుతుంటాం. అయితే వేసవిలో చెమట ఎక్కువగా వచ్చి శరీరం నీరు కోల్పోతుంది. దీనిని భర్తీ చేసేందుకు ఎక్కువగా నీరు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. పెద్దలు కనీసం 8 గ్లాసులు, పిల్లలు రోజుకు 4 గ్లాసులు తాగాలని చెబుతారు.
3. సీజనల్ ఫ్రూట్స్ తినాలి:
వేసవి కాలంలో లభించే పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. సీజనల్ ఫ్రూట్స్ లో ఆ సీజన్ ను ఎదుర్కొనేందుకు సహాయపడే పోషకాలు సహజంగా ఉంటాయి.
4. ఆరోగ్యకరమైన ఆహారాలు:
కాలంతో సంబంధం లేకుండా పిల్లలకు ఇంట్లోనే తయారు చేసిన ఆహారాలు అందించాలి. బయట ఫుడ్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే వేసవిలో అధికంగా నూనె ఉన్న ఆహార పదార్థాలను, వేయించినవి, సాల్టెడ్ ఫుడ్స్ కు దూరంగా ఉంచాలి. వీటి వల్ల త్వరగా డీహైడ్రేషన్ కు గురవుతారు.

5. నీడలో ఉండమని చెప్పాలి:
ఇంటి నుండి బయటకు వెళ్తే తప్పనిసరిగా నీడలో ఉండమని చెప్పాలి. సూర్య కిరణాలు నేరుగా పడకుండా జాగ్రత్తగా నడుచుకోమని చెప్పాలి. బయటకు వెళ్తే టోపీ, కర్చీఫ్ లాంటివి ధరించమనాలి.
6. జ్యూస్‌లు, షేక్స్ అందించాలి:
వేసవికాలంలో పిల్లలకు రోజూ నిమ్మరసం తాగించాలి. నిమ్మకాయలో విటమిన్ సి, మెగ్నీషియం, ఫాస్పరస్, కార్బొహైడ్రేట్లు ఉంటాయి. వేడిని తట్టుకోవడానికి ఇది గొప్ప పానీయం. పుచ్చకాయ జ్యూస్, బనానా షేక్, మ్యాంగో షేక్, మిల్క్ షేక్‌లు వేసవిలో చాలా మంచివి.
7. సన్ గ్లాసెస్ ఉపయోగించాలి:
సూర్య కిరణాల వల్ల కళ్లపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. పరావర్తనం చెందిన అతినీలలోహిత కిరణాలు కంటి చూపును దెబ్బతీస్తాయి. వేసవిలో ఇంటి నుండి బయటకు వెళ్తే తప్పనిసరిగా యూవీ ప్రొటెక్టెడ్, పోలరైజ్డ్ సన్ గ్లాసెస్ పెట్టుకోమని చెప్పాలి.
8. సన్‌స్క్రీన్ రాసుకోవాలి:
సూర్య కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకునేందుకు సన్ స్క్రీన్ రాసుకోవడం మర్చిపోవద్దు. వేసవిలో సూర్య కిరణాల వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల చర్మ రంగు కోల్పోకుండా ఉండటంతో పాటు, చర్మ సమస్యలు రావు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications