Latest Updates
-
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్! -
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తేనే సక్సెస్ వస్తుందా?.. ప్రముఖ న్యూరోసైంటిస్ట్ చెబుతున్న సంచలన నిజాలివే!
వర్షాకాలం వచ్చేసింది.! నీటి ద్వారా వచ్చే వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి
Waterborne diseases వేసవి సీజన్ తో పోల్చితే వర్షాకాలం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, వర్షపు నీటితో పాటు అనేక వ్యాధులు వస్తాయి. కాలచక్రంలో రుతుపవనాలు ఎలా ఉన్నాయో అదే విధంగా రుతుపవ వ్యాధులు(సీజనల్ వ్యాధులు) కూడా ఉన్నాయి. ఈ వ్యాధులకు సరైన చికిత్స చేయకపోతే పరిస్థితి చాలా తీవ్రంగా మారుతుంది. రుతుపవనాలు వచ్చిన వెంటనే, మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
ముఖ్యంగా తెలంగాణ , ఆంధ్రాలలో కొన్ని ప్రదేశాల్లో ఎడతెరపి లేని వానలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల వల్ల కలుషిత నీరు, కుంటల్లో, కాలువల్లో, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ చేరడం వల్ల, నీటి ద్వారా వచ్చే వ్యాధులు ఎక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 80 శాతం వ్యాధులు నీటి ద్వారా వ్యాపిస్తాయి. ఇలా నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను వాటర్ బార్న్ వ్యాధులు( Waterborne diseases) అంటారు.

నీరు నిల్వ ఉండటం వల్ల ఆ నీరు కలుషితంగా మారుతాయి. అవి దోమలకు బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలకు సంతోనోత్పత్తి ప్రదేశంగా మారుతుంది. వాటి పునరుత్పత్తి వేగవంతంగా మారి ప్రజల మీద దాడి చేసి వ్యాధులకు కారణం అవుతాయి.
వర్షాకాలంలో కలరా, టైఫాయిడ్, హెపటైటిస్ A మరియు గ్యాస్ట్రోఎంటెరిటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతే కాకుండా నీరు నిలిచిపోవడం వల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు కూడా వస్తాయి. ఈ సమయంలో, కలుషిత నీరు తాగడం వల్ల కలరా, టైఫాయిడ్ మరియు డయేరియా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఈ సీజన్‌లో స్కిన్ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయి.
తేమ కారణంగా బాక్టీరియా
వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియ మరియు వైరస్ లు పెరగుతాయి, ఇవి వైరల్ ఫీవర్ మరియు బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాధం పెరుగుతుంది. ఈ సమయంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు త్వరగా వ్యాధుల బారీన పడతారు.
వర్షాకాలంలో దోమలు కుట్టడం ద్వారా వ్యాపించే వ్యాధుల్లో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ మరియు చికున్‌గున్యా ప్రమాదకరమైన వ్యాధులు. వీటితో పాటు గాలి ద్వారా వ్యాపించే దగ్గు జలుబు, గొంతు నొప్పి, ఫ్లూ, ఇన్ ఫ్లూయాంజా వంటి వ్యాధులు పెరుగుతాయి.

వాటర్ బార్న్ వ్యాధులు( Waterborne diseases) నివారించడానికి మార్గాలు:
కాచీ చల్లార్చిన నీరు తాగాలి: వర్షాకాలంలో బ్యాక్టీరియ వైరస్ లు మనుషుల మీద ప్రభావం చూపుతాయి. కాబట్టి ఎప్పుడూ కాచి చల్లార్చిన నీటిని తాగాలి. లేదా గోరువెచ్చని నీరు తాగాలి. UV-ఫిల్టర్ వాటర్ ప్యూరిఫైయర్లు నీటి స్వచ్ఛతను కాపాడుకోవడంలో సహాయపడతాయి.
బాటిల్ లేదా ఫిల్టర్ చేసిన నీళ్ళను మాత్రమే వాడండి: బయట వెళ్లేటప్పుడు తప్పని సరిగా నీళ్ళబాటిల్ పట్టుకెళ్ళండి. రోడ్ పక్కన లేదా ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగకండి. క్లోరిన్ మాత్రలను వాడటం వల్ల, నీటిని సమర్థవంతంగా క్రిమిసంహారక మరియు త్రాగడానికి సురక్షితంగా చేయవచ్చు.
స్ట్రీట్ ఫుడ్స్ తినడం మానుకోండి: వర్షాకాలంలో ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించడానికి సాధ్యమైనంత వరకు స్ట్రీట్ ఫుడ్స్ తినడం మానుకోండి. పానీపూరీలు, మసాలా పూరీలు, పావ్ బాజీ వంటి స్ట్రీట్ ఫుడ్ తినడం వల్ల నీటి కలుషితంతో అనారోగ్యలు కొని తెచ్చుకుంటారు. కాబట్టి, స్ట్రీట్ ఫుడ్ కు గట్టిగా నో చెప్పండి.
తినడానికి ముందు చేతులు కడుక్కోవాలి: ఏదైనా తినడానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి . ఈ చిన్న అలవాటు మిమ్మల్ని ప్రమాదకరమైన బ్యాక్టీరియా వైరస్ ల నుండి మిమ్మల్ని కాపాడుతుంది.
పండ్లు కూరగాయలను కడగాలి: పండ్లు కూరగాలను తప్పనిసరిగా కడగండి. బండిమీద వర్షపు నీటి కారణంగా బ్యాక్టీరియ వ్రుద్ది చెందే అవకాశం ఉంది. కాబట్టి, వాటిని ఇంటికి తెచ్చిన వెంటనే మంచి నీటితో శుభ్రంగా కడగాలని గుర్తుంచుకోండి. ఇది ఆరోగ్యకరమైన అభ్యాసం.
దోమల నివారణ: దోమకాటు వల్ల డేంగ్యు, మలేరియా వంటివి వస్తాయి. దోమలు కుట్టకుండా ఉండాలంటే దోమతెరలు వాడండి మరియు నిద్రపోయేటప్పుడు పొడవాటి స్లీవ్స్ , ప్యాంట్లు ధరించండి. తరచుగా నిలిచిన నీటి వల్ల వచ్చే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను నివారించడానికి ఇటువంటి ముందుజాగ్రత్త చర్యలు చాలా అవసరం.
పోషకమైన ఆహారాన్ని తినండి: సమతుల్య ఆహారం తినాలి, విటమిన్లు మరియు మినిరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తినాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి. వ్యాధులు రాకుండా నిరోధిస్తాయి
మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి: మీ చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి, ఎక్కడైనా నీరు లేదా మురికి నిల్వ ఉంటే దానిని శుభ్రం చేయండి. కిటికీలు మరియు తలుపులు మూసి ఉంచండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications