Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
నోటి దుర్వాసనా..? ఇలా చిటికెలో తగ్గించుకోండి..!
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేది పాత సామెత. ఇప్పుడు నోటి దుర్వాసన ఉంటే మాట్లాడాడానికి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నోటి దుర్వాసకి తినే ఆహారానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. సరిగ్గా బ్రష్ చేయకపోతే తిన్న పదార్థం పంటి లోపల చిక్కుకొని ఉంటుంది. దాంట్లో బాక్టీరియా పెరిగి దుర్వాసనకి కారణమవుతుంది. అలా పంటి పైనున్న ఆహారం కుళ్ళిపోవడం వల్ల ఈ దుర్వాసన వస్తుంది. నోటి దుర్వాసనని హాలిటోసిస్ గా పిలుస్తాం. అయితే నోటి దుర్వాసన రావడానికి ఈ రెండు మాత్రమే కారణం కాదు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నింటినీ నేను మీకు వివరిస్తాను.
నోటి దుర్వాసనని హాలి టోసిస్ అని కూడా అంటారు. ఇది పళ్లపై చిగుళ్లపై ఉండే బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది. ప్రపంచం మొత్తం జనాభాలో 50 నుండి 60 శాతం మందిలో ఈ హాలిటోసిస్ ఏదా దుర్వాసన ఉన్నట్లు కనుక్కున్నారు.

బ్రష్ సరిగ్గా చేయకపోవడం వల్ల, నాలుకను కూడా ప్రతిరోజు శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఈ దుర్వాసన వస్తుంది. బ్రష్ చేసుకోవడానికి ప్రత్యేకమైన పద్ధతి ఉంది. ఆ విధంగానే బ్రష్ చేసుకోవాలి.
ఉల్లిగడ్డ అల్లం లాంటి పదార్థాల వల్ల కూడా నోటి దుర్వాసన పెరుగుతుంది. తిన్న తర్వాత అవి పంటి లోపల ఇరుక్కుంటే తరువాత చాలా దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. ఇవి తిన్న తరువాత కొద్దిగా బ్రష్ చేసుకుంటే ఏ సమస్య ఉండదు.
నోటిలో తగినంత లాలాజలం లేకపోవడం వల్ల కూడా ఈ దుర్వాసన వస్తుంది. నోటి లోపలి బ్యాక్టీరియాని నోటిలో బ్యాక్టీరియాని ఈ లాలాజలం బయటకు పంపించి వేస్తుంది. వేసవిలో టీహైడ్రేషన్ వల్ల కూడా ఈ సమస్య తలెత్తవచ్చు. మీరు ఎక్కువ తాగడమే దీనికి పరిష్కారం.
సిగరెట్ గుట్కా తాగే వారిలో చిగుళ్ల సమస్య వస్తుంది. దీంతో నోటి నుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది.
కొన్ని రకాల వ్యాధుల వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. లివర్ వ్యాధి కిడ్నీ వ్యాధి, సైనస్ ఉన్న వారిలో మనము ఈ సమస్య చూడవచ్చు.
నోటిలో దుర్వాసన రావద్దు అంటే హాలిటాసిస్ నుంచి బయటపడాలంటే ప్రతి రోజు ఇవి పాటించి తీరాల్సిందే.
మంచి టూత్ పేస్టు తో మాత్రమే పళ్ళు తోముకోవాలి. పళ్ళుతోమే విధానం పద్ధతి లోనే బ్రష్ చేసుకోవాలి.
బ్రష్‌తో పాటు టంగ్ క్లీన్ తప్పకుండా చేసుకోవాలి. బ్యాక్టీరియా పంటినైనే కాదు, నాలుకపైన కూడా సెటిల్ అయి ఉంటుంది. టంగ్ క్లీనర్‌తో ప్రతీ రోజు టంగ్ క్లీన్ చేసుకోవాలి.
నోట్లో లాలాజలం తక్కువగా ఉండడం వల్ల కూడా దుర్వాసన వస్తుందన్న విషయం తెలిసిందే. అందువల్ల ప్రతీ రోజు కనీసం 3 లీటర్ల నీటిని తాగాలి. ఉదయం లేవగానే గరోవెచ్చగా ఉన్న రెండు గ్లాసుల నీటిని తాగాలి.
సిగరెట్, గుట్కా లాంటి అలవాట్లు ఉంటే మానివేయాలి. వాటి వల్ల దుర్వాసన మాత్రమే కాకుండా పంటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
గ్రీన్ టీలో బ్యాక్టీరియాను చంపే లక్షణం వుంటుంది. రోజుకు రెండు గ్రీన్ టీలు తాగితే ఇక నోటి దుర్వాసన వుండదు.
ఘాటైన ఆహార పదార్ధాలను తగ్గించాలి. అవి తినడం వల్ల కూడా దుర్వాసన పెరుగుతుంది. అల్లం, ఉల్లిగడ్డ, స్పైసీ ఆహార పదార్ధాలను ఎక్కువగా తీసుకోవద్దు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications