Latest Updates
-
నాన్‌వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల
SHOCKING: ఇలాంటి కొబ్బరి నీళ్లు తాగి చనిపోయిన వృద్ధుడు.. మీరు కూడా ఇలా తాగితే ప్రమాదంలో పడినట్లే
వేసవి కాలంలో డీహైడ్రేషన్ సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. ఒత్తిడి, వేడి, చెమటలతో శరీరంలోని నీరు, ఎలక్ట్రోలైట్లు తగ్గిపోతాయి. అలాంటి టైమ్‌లో సహజంగా శరీరానికి తక్షణ హైడ్రేషన్ అందించగలదీ ఒకే ఒక అద్భుత పానీయం అదే కొబ్బరి నీరు. ఇది సులభంగా దొరికే, తక్కువ ధరలో లభించే, ఆరోగ్య ప్రయోజనాల పుష్కలంగా కలిగిన అద్భుతమైన ఔషధం. అయితే ఈ కొబ్బరి నీళ్లతో ఎంత మొత్తంలో ఉపయోగాలు ఉన్నాయో కొన్ని దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీటిని సరైన రీతిలో తీసుకోకుండా, తప్పుగా తీసుకుంటే మనకు చాలా హాని కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ స్టోరీలో కొబ్బరి నీళ్లు తాగేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పుగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్లు తాగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తప్పుగా నిల్వ చేస్తే ప్రమాదమే!
కొబ్బరికాయను కోసిన వెంటనే నీటిని తాగడం ఉత్తమం. బయట ఉంచడం, ఎక్కువ సేపు నిల్వ చేయడం వల్ల ఆ నీటిలో బాక్టీరియా లేదా ఫంగస్ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వేసవిలో అధిక ఉష్ణోగ్రత, తేమ కారణంగా మైక్రోఆర్గానిజమ్స్ వేగంగా పెరుగుతాయి. ఈ ఫంగల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వాంతులు, వికారం, కడుపునొప్పి, డయేరియా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఒక రిపోర్ట్ ప్రకారం, 69 ఏళ్ల వృద్ధుడు నిల్వ చేసి ఉంచిన కొబ్బరి నీటిని తాగి తీవ్ర ఇన్ఫెక్షన్‌కు గురై ప్రాణాలు కోల్పోయిన కేసు వెలుగులోకి వచ్చింది.

కొబ్బరి నీటిని ఎలా నిల్వ చేయాలి?
కోసిన వెంటనే తాగడమే ఉత్తమం.
అవసరమైతే, గాలి చొరబడని బాటిల్ లేదా జిప్‌లాక్ కంటైనర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో 2 రోజులకు మించకుండా ఉంచండి.
బహిరంగ ప్రదేశాల్లో ఉంచడం వల్ల అది చెడిపోతుంది.
కలపలు, పిండితో కలిపిన కొబ్బరి నీరు తాగకండి. అది అస్వచ్ఛతకు దారితీస్తుంది.
వేసవిలో ఎప్పుడు తాగాలి?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో:
జీర్ణక్రియను మెరుగుపరచడానికి, శరీరానికి నెమ్మదిగా తేమ అందించడానికి బెస్ట్ టైమ్.
బయట నుంచి వచ్చిన వెంటనే:
చెమట వల్ల పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
జిమ్ తర్వాత:
వ్యాయాయం తరువాత ఈ కొబ్బరి నీళ్లను తీసుకుంటే ఎలక్ట్రోలైట్ రీప్లేస్మెంట్‌కు సహజమైన ప్రత్యామ్నాయంగా ఇవి ఉపయోగపడతాయి.
కొబ్బరి నీటి ఆరోగ్య ప్రయోజనాలు
హైడ్రేషన్ & ఎలక్ట్రోలైట్ల సమతుల్యత
ఇందులో పటాషియం, సోడియం, మ్యాగ్నీషియం, కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించగలవు.
తక్కువ కేలరీలతో ఎక్కువ మేలు
100 మిల్లీ లీటర్ల కొబ్బరి నీటిలో 19-25 కేలరీలు మాత్రమే ఉంటాయి. బరువు తగ్గించుకునే వారికి ఇది మంచి ఎంపిక.
ప్రకృతి సిద్ధమైన డిటాక్స్ డ్రింక్
లివర్, కిడ్నీల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు విషతత్వాన్ని దూరం చేస్తాయి.
చర్మం మరియు జుట్టుకు మంచిది
నలిపిన కొబ్బరి నీరు ముఖానికి రాసినా, తాగినా చర్మానికి చల్లదనాన్ని కలిగిస్తుంది. ఇది సహజసిద్ధమైన స్కిన్ హైడ్రేటర్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications