Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
హైపర్ కోలేస్టేరోలీమియా నివారించడం ఎలా ?

సూచనలు
1. తాజా కూరగాయలు, పళ్ళు, తృణధాన్యాలు, పల్చటి మాంసం, కోడి లాంటి తక్కువ కొవ్వుశాతం ఉండే ఆహారాన్ని తీసుకోండి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారి ప్రకారం ఈ ఆహారాలు సాధారణ కొలెస్ట్రాల్ స్థాయిని నిలపెడతాయి. వారానికి కనీసం రెండు సార్లు చేపలు తినండి, కొవ్వులేని పాల పదార్ధాలు వాడండి. పదార్ధాలపై పట్టికలను చదివి సంతృప్త, అసంతృప్త కొవ్వులు తక్కువగా ఉండే ఆహారాలు ఎంచుకోండి. ఆహారంలో పీచు పదార్ధాలను తీసుకోండి, ఆకు కూరల సలాడ్ లు ఎక్కువగా తినండి. ఐతే సలాడ్లపై డ్రస్సింగ్ ని తేలికగా ఉండేలా చూసుకోండి.
2. బరువుని ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచుకుంటూ కనీసం వారానికి ఐదు రోజులు పుష్కలంగా పనిచేయండి. వారంలో ఎక్కువ రోజులు కనీసం 30 నిమిషాల పాటు నడవండి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుకోవడానికి ఈత, బైకింగ్, వ్యాయామం, నాట్యం లాంటి ఇతర పనులు కూడా చేయండి.
3. మీరు పొగ తాగేవారైతే వెంటనే దాన్ని మానేయండి, అలాగే పరోక్షంగా పొగ తాగడం కూడా మానేయండి. వీలైనంతలో పొగ త్రాగే ప్రదేశాలకు వెళ్ళడం మానేయండి.
4. కొలెస్ట్రాల్ స్థాయిని తెలుసుకోండి. మీరు కనీసం సంవత్సరానికి ఒకసారి పరగడుపున రక్త పరీక్షకు మీ వైద్యుడి దగ్గరకు వెళ్ళండి లేదా ఆయన సూచిస్తే అంతకంటే ఎక్కువసార్లు వెళ్ళండి.
5. మీ కుటుంబ చరిత్ర తెలుసుకొని దాని గురించి మీ డాక్టర్ తో మాట్లాడండి. అధిక కొలెస్ట్రాల్ జన్యువుల వల్ల కూడా రావచ్చు. మీ వైద్యుడితో చర్చించి, మీకు సంబంధించిన ఆరోగ్య సమస్యల ప్రమాదాలని అంచనా వేయండి.
చిట్కాలు & హెచ్చరికలు
ఆరోగ్య స్థితిని నిర్ణయం చేసి చికిత్స ఇవ్వాల్సింది కేవలం వైద్యుడు మాత్రమె.
మీ వైద్యుడి అనుమతి లేకుండా ఎటువంటి కొత్త వ్యాయామం మొదలుపెట్టకండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications