For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏ డ్రై ఫ్రూట్స్.. ఎంత పరిమాణంలో తింటే హెల్తీ.. ?

By Swathi
|

డ్రై ఫ్రూట్స్ ! ఇవి ఆరోగ్యానికి మంచిదని చాలా మంది సూచిస్తారు. ప్రొటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఇవన్నీ ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి కావాల్సినవి. వీటన్నింటిని పొందడానికి డ్రై ఫ్రూట్స్ ఒక ఆప్షన్. అయితే ఇవి ఆరోగ్యానికి మంచిది కదా అని.. ఇష్టమొచ్చినట్టు తినకూడదు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అయితే ఎంత పరిమాణంలో తినాలి. ఏ డ్రై ఫ్రూట్స్ ఎన్ని తింటే ఆరోగ్యకరం ?

డ్రైఫ్రూట్స్ ను తినడానికి ముందు ఎందుకు నానబెట్టాలి? లాభాలేంటి..? డ్రైఫ్రూట్స్ ను తినడానికి ముందు ఎందుకు నానబెట్టాలి? లాభాలేంటి..?

డ్రై ఫ్రూట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే.. షుగర్స్, క్యాలరీలు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని 20 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. అలాగే డైరెక్ట్ గా తినడం కూడా మంచిది కాదు. కాబట్టి.. డ్రై ఫ్రూట్స్ తినే విధానం, ఏ నట్స్ ఎంత పరిమాణంలో తినాలి అనేది ఇప్పుడు చూద్దాం..

బాదాం

బాదాం

బాదాంపప్పులో మోనో శ్యాచురేటెడ్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్ట్ కి, బ్రెయిన్ కి , స్కిన్ కి మంచిది. అలాగే ఆల్మండ్స్ లో విటమిన్ ఈ, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇవి బ్లడ్ ప్రెజర్ నార్మల్ గా ఉండటానికి సహాయపడతాయి. అలాగే రక్త ప్రసరణ సజావుగా సాగడానికి సహకరిస్తాయి. రోజుకి 4 నుంచి 7 బాదాం గింజలు తినడం వల్ల వీటిని నుంచి అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

వాల్ నట్స్

వాల్ నట్స్

వాల్ నట్స్ పైన ఉండే బొప్పి తీయగానే.. ఉండే స్కిన్ ఫ్లేవర్ అంత టేస్టీగా ఉండదు. కానీ.. 90 శాతం యాంటీ ఆక్సిడెంట్స్, ఫెనోలిక్ యాసిడ్స్, టాన్నిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఈ స్కిన్ లోనే ఉంటాయట. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించడంలో ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని రోజుకి 3 నుంచి 4 తీసుకోవచ్చు.

కర్జూరం

కర్జూరం

కర్జూరమనగానే చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో మనుషులు హెల్తీగా ఉండటానికి ఉపయోగపడే న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫ్రాక్టోజ్ ఇందులో రిచ్ గా ఉంటుంది. మెటబాలిజం స్థాయి చురుగ్గా ఉండటానికి కర్జూరం ఉపయోగపడుతుంది. వీటిని రోజుకి మీడియం సైజులో ఉండే 1 లేదా రెండు తీసుకుంటే సరిపోతతుంది.

పిస్తా

పిస్తా

పిస్తా వెల్ నెస్ కి చిహ్నం. ఇవి బలానికి, ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇందులో మిగిలిన డ్రైఫ్రూట్స్ లో కంటే ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజుకి 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు.

జీడిపప్పు

జీడిపప్పు

జీడిపప్పు రెగ్యులర్ గా తినడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వారానికి 28 జీడిపప్పులను తినడం ఆరోగ్యకరమని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షను ఎక్కువ మోతాదులో తిన్నా ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఇందులో విటమిన్ బి, పొటాషియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి రోజుకి గుప్పెడు ఎండుద్రాక్ష తినవచ్చు. 50 ఎండుద్రాక్షలు తినవచ్చు. అయితే మహిళలు రోజుకి ఒకటిన్నర కప్పు, మగవాళ్లు 2 కప్పుల ఎండుద్రాక్ష తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

English summary

Here's how much you should eat dry fruits

Here's how much you should eat dry fruits. Packed with proteins, essential fatty acids, antioxidants and minerals, these are little factories of good health.
Story first published: Saturday, January 30, 2016, 9:49 [IST]
Desktop Bottom Promotion