Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
హైదరాబాద్ లో మహిళలకు యూటీఐ సమస్యలు..డాక్టర్ చెప్పిన షాకింగ్ విషయాలు
హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటడంతో మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (UTI) పెరుగుతున్నాయి. బయట విపరీతమైన వేడి, డీహైడ్రేషన్, లైఫ్ స్టైల్ అలవాట్ల కారణంగా ఇలాంటి ఇన్ఫెక్షన్లకు తరచుగా గురవుతున్న మహిళలు ఆరోగ్యాన్ని ఆయా సీజన్లలో జాగ్రత్తగా చూసుకోవాలని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU)కు చెందిన మహిళా యూరాలజిస్ట్ డాక్టర్ సారికా పాండ్యా తెలిపారు.
డాక్టర్ సారిక మాట్లాడుతూ.." "ఈ వేసవి కాలంలో మహిళల్లో యూటీఐ కేసులు బాగా ఎక్కువవుతున్నాయి. ఈ సీజన్ లో మా హాస్పిటల్ కి వస్తున్న ప్రతి 10 మంది మహిళల్లో ముగ్గురికి యూటీఐ బారిన పడుతున్నవారే ఉన్నారు. గతేడాది ఇదే సీజన్ తో పోల్చితే ఈ సారి ఇది ఎక్కువగానే ఉంది" అని తెలిపారు.

వేసవితో సంబంధమేంటి
శారీరకంగా చూసినప్పుడు మహిళలకు మూత్రనాళం చిన్నగా ఉండడంతో వారికి యూటీఐ వచ్చే అవకాశం ఎక్కువ. అయితే వేసవిలో ముప్పు కారకాలు మరింత అధికంగా ఉంటాయి. డీహైడ్రేషన్ ప్రధాన కారణం. మహిళలకు చెమటలు ఎక్కువగా పడుతుంటాయి.. అదే సమయంలో కొందరు తగినంత నీళ్లు తాగరు. దానివల్ల మూత్రం బాగా చిక్కగా అవుతుంది. ఇది ఒకరకమైన తేమ వాతావరణాన్ని సృష్టించి బ్యాక్టీరియా పెరిగేందుకు కారణమవుతుంది. స్మిమ్మింగ్ పూల్స్ లో లేదా నీళ్లలో ఎక్కువసేపు తడి దుస్తులతో ఉండడం, బాగా బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం,ప్రయాణాలు లేదా బయటకు వెళ్లినప్పుడు మూత్రం వచ్చినా ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల యూటీఐ లాంటి ఇన్ఫెక్షన్లు పెరుగుతాయని డాక్టర్ సారిక తెలిపారు.
గమనించాల్సిన లక్షణాలు
యూటీఐ లక్షణాలలో ముఖ్యంగా మూత్రవిసర్జన సమయంలో మంటపుట్టడం, తరచు మూత్రానికి వెళ్లాలనిపించడం, మూత్రం దుర్వాసన రావడం, పొత్తికడుపులో అసౌకర్యం, నీరసం లాంటివి ఉంటాయి. ఈ లక్షణాలు ఏమైనా ఒక రోజుకంటే ఎక్కువ ఉంటే సొంత మందులు వాడకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. ముందస్తు లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ముఖ్యంగా మధుమేహ బాధితులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తపడాలని ఆమె చెప్పారు.
లైఫ్ స్టైయిల్ సమస్యలు
వేసవికాలంలో కొన్నిరకాల ప్రవర్తనల వల్ల యూటీఐ ముప్పు పెరుగుతందని డాక్టర్ సారికా పాండ్యా అన్నారు. ప్రధానంగా.. ఈతదుస్తుల్లో ఎక్కువసేపు ఉండిపోతే బ్యాక్టీరియా పెరుగుతంది. బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తే ముఖ్యంగా లోపలి భాగాల్లోవేడి, చెమట ఎక్కువవుతాయి. మూత్రాన్నిఎక్కువసేపు ఆపుకోవడం ప్రమాదకరమైన అలవాటు. కాటన్ లోదుస్తులు ధరించడం, తరచు మూత్రానికి వెళ్లడం, ముఖ్యంగా లైంగిక చర్య తర్వాత ఇది చాలా అవసరం అని వివరించారు.
నీళ్లు తాగడం, పరిశుభ్రత, ఆహారం
యూటీఐని నివారించడానికి సులభమైన మార్గం.. నీళ్లు తాగడమేనని డాక్టర్ సారిక తెలిపారు. తాగగలిగినన్ని ద్రవాలు తాగండి. దానివల్ల మూత్రం రంగు సాధారణంగా ఉంటుంది. తీపి పానీయాలు, కెఫిన్ వాడకూడదు. అవి తాగితే బాగున్నట్లు అనిపిస్తుంది గానీ బ్లాడర్ ను అవి ఇరిటేట్ చేస్తాయి. ఆహారంలో కూడా యూటీఐని నియంత్రించేవి తీసుకోవాలి. క్రాన్ బెర్రీ జ్యూస్ లేదా టాబ్లెట్ల వల్ల బ్లాడర్ వాల్స్ కి బ్యాక్టీరియా అతుక్కోకుండా ఉంటుందని ఆమె అన్నారు. అన్నారు.
చికిత్స, దీర్ఘకాల నిర్వహణ
తరచు ఇన్ఫెక్షన్లు వచ్చే మహిళలకు తక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్, మెనోపాజ్ దశ దాటిన మహిళలకు వెజైనల్ ఈస్ట్రోజన్ ఇస్తామని, అలాగే తగిన సమయానికి మూత్రవిసర్జన చేయడం చాలా ముఖ్యమని డాక్టర్ సారిక తెలిపారు. కొందరికి లైంగిక చర్య తర్వాత యాంటీబయాటిక్స్ వేసుకోవడం, లేదా సొంత మందులతో కొంత ఉపశమనం ఉండచ్చు. కానీ డాక్టర్ల పర్యవేక్షణలోనే మందులు వాడాలి. యాంటీబయాటిక్స్‌తో తగ్గించడం కంటే దీర్ఘకాలం పాటు రాకుండా చూసుకోవడం, శరీర లక్షణాలు గమనించడం ముఖ్యం అని ఆమె సూచించారు.
అవగాహన ముఖ్యం
UTIల విషయంలో చాలామందిక అవగాహన ఉండట్లేదనని డాక్టర్ సారికా పాండ్యా తెలిపారు. హైదరాబాద్‌లో చాలామంది మహిళలు లైంగికచర్య వల్లే యూటీఐ వస్తుందనుకుంటున్నారని.. హోం రెమెడీస్ తో దానికి చెక్ పెట్టవచ్చని కూడా భావిస్తున్నారు. మరికొందరు దానిగురించి బయటకు మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రజలకు దీనిపై అవగాహన కల్పించడం ముఖ్యం. మనం పోషకాహారం గురించి, రుతుక్రమ శుభ్రత గురించి మాట్లాడినట్లే యూరినరీ ఆరోగ్యం గురించి చర్చను కూడా సాధారణం చేయాలని డాక్టర్ సారిక తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications