Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
హైదరాబాద్‌లో నాలుగు రోజులు తీవ్ర ఎండలు, ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యల్లో పడతారు
హైదరాబాద్ లో రానున్న నాలుగు రోజులు ఎండలు మండిపోనున్నాయి. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియల్ వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత కంటే కనీసం 4.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే హీట్ వేవ్ అంటారు. డీవియేషన్ 6.4 డిగ్రీల సెల్సియస్ కు మించి ఉంటే, అది తీవ్రమైన హీట్ వేవ్ గా పిలుస్తారు. తాజాగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. జూన్ 9, 2023 వరకు హైదరాబాద్ లో గరిష్ఠ ఉష్ణోగ్రత 41-44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. నాలుగు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అనేక ఇతర జిల్లాల్లో ఇలాంటి వాతావరణ పరిస్తితులు ఉండే అవకాశం ఉంది.

హీట్‌వేవ్ నుండి ఎలా సురక్షితంగా ఉండాలి?
1. హైడ్రేటెడ్ గా ఉండాలి:
పుష్కలంగా నీరు తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. ఎండాకాలంలో చెమట రూపంలో శరీరం ఎక్కువగా నీరు కోల్పోతుంది. శరీరం నుండి కోల్పోయిన నీటిని భర్తీ చేయకపోతే డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే పుష్కలంగా నీరు తాగడం ద్వారా హైడ్రేటెడ్ గా ఉండాలి. అలాగే సీజనల్ ఫ్రూట్స్ తినాలి. పుచ్చకాయ, నారింజ్ లాంటి పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం ద్వారా హైడ్రేటెడ్ గా ఉండొచ్చు.
2. తేలికపాటి భోజనం:
ఎండాకాలంలో ముఖ్యంగా హీట్ వేవ్ సమయంలో తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఘన పదార్థల కంటే ద్రవ పదార్థాలు తీసుకోవడం మంచిది. నూనె ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, వేపుళ్లు, ఫ్రైలు, సాల్టెడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది.
3. నీడ పట్టున ఉండాలి:
వీలైనంత వరకు నీడలో ఉండేందుకు ప్రయత్నించాలి. నేరుగా సూర్య కిరణాలు పడటాన్ని నివారించాలి. సూర్య కిరణాలు నేరుగా పడటం వల్ల చర్మ సమస్యలు వస్తాయి.
4. వదులైన దుస్తులు ధరించాలి:
వేసవి కాలంలో వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. కాటన్ దుస్తులు చెమటను పీల్చుకుంటాయి. అలాగే లేత రంగు దుస్తులు వేడిమిని ఆకట్టుకోవు.
5. సన్‌స్క్రీన్ అప్లై చేసుకోవాలి:
SPF 15 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్ వాడాలి. బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ రాసుకోవాలి. దీని వల్ల చర్మంపై నేరుగా సూర్య కిరణాలు పడకుండా అడ్డుకుంటుంది.
6. పార్క్ చేసిన కార్లలో ఉండొద్దు:
ఎండలో కార్లను పార్క్ చేసి అందులో పిల్లలను లేదా పెంపుడు జంతువులను ఉంచకూడదు. ఎండ వేడిమికి కారు లోపల వేడెక్కి పోతుంది. కాబట్టి ఇలా పార్క్ చేసిన కార్లలో ఉండటం ప్రాణాంతకం కావొచ్చు.
7. మద్యం సేవించొద్దు:
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్ కు గురవుతుంది. వేసవిలో పగటి పూట ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications