Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Protein Powder : ప్రొటీన్ పౌడర్ చాలా డేంజర్.. తీసుకోవద్దని ఐసీఎమ్‌ఆర్ హెచ్చరిక..!
శరీరం ఒక్కసారిగా బలంగా రాత్రికి రాత్రే మారడానికి బయట మార్కెట్లో ప్రొటీన్ పౌడర్లు అమ్ముతున్నారు. చాలా బ్రాండ్‌లల్లో ఇవి అందుబాటులో ఉన్నాయ్. మెడికల్ షాపుల్లో కూడా ఈ ప్రొటీన్ పౌడర్లను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. తాజాగా ఐసీఎమ్‌ఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్) ప్రొటీన్ పౌడర్లపై చేసిన ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. ప్రొటీన్ పౌడర్లను ఇక ఉపయోగించడం ఆపివేయాలని భారతీయులకు ఐసీఎమ్‌ఆర్ సూచించింది.
ప్రొటీన్ పౌడర్ వద్దంటున్న ఐసీఎమ్ఆర్
ఓ మెడికల్ సర్వేలో 36 రకాల ప్రముఖ ప్రొటీన్ పౌడర్లను ల్యాబ్‌లో పరీక్షించారు. వాటిల్లో పోషాకలు ఎలా ఉన్నాయ్, శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతానే దానిపై పరిశోధనలు జరిపారు. ఆ రిపోర్టుల్లో వచ్చిన ఫలితాలను పరిశీలించి ఐసీఎమ్‌ఆర్ ఈ నిర్ణయం తీసుకుంది.

కిడ్నీలకు గట్టి దెబ్బ
ప్రొటీన్ పౌడర్లను ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందని న్యూట్రిషనిస్టులు స్వయంగా చెబుతున్నారు. ప్రొటీన్ పౌడర్లు ఎక్కువగా తీసుకుంటే మూత్రం ద్వారా శరీరంలోని కాల్షియం బయటకు వెళ్లి మొత్తం యముకలు దెబ్బతినే పరిస్థితి ఉందన్నారు. కాబట్టి ప్రొటీన్ పౌడర్లను తీసుకోవడం ఆపేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని సూచిస్తున్నారు.
ప్రొటీన్ పౌడర్లకు బదులుగా సహజంగా వచ్చే పోషకాలను తీసుకోవాలంటున్నారు. పళ్లు, కూరగాయలు, గుడ్ల ద్వారా వచ్చే పోషకాలు పూర్తిగా ఆరోగ్యకరమైనవి చెబుతున్నారు.
ప్రొటీన్ పౌడర్ల వాడకాన్ని తగ్గించుకోవడానికి ఈ కింది విధానాలను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్టులు వుండవు.
ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. గుడ్లు, చేపలు, ఆకుకూరలు, పల్లీలు, చికెన్ ద్వారా ప్రొటీన్‌ను తీసుకునే ప్రయత్నం చేయాలి. కాజూ బాదాం లాంటి డ్రై ఫ్రూట్స్ నుంచి కూడా ప్రొటీన్ పుష్కలంగా అందుతుంది.
కేవలం ప్రొటీన్ల వెంటే కాకుండా కార్బొహైడ్రేట్లు, కొంచెం కొవ్వు పదార్ధాలను కూడా తీసుకుంటూ వుండాలి. అన్ని రకాల పోషకాలు తీసుకున్నప్పుడే శరీరం బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు మాత్రమే ఆరోగ్యం బాగుంటుంది.
పోషకాల కోసం ప్రత్యేకమైన ఆహారాన్ని రెడీ చేసుకునే ముందు మీకు దగ్గర్లోని డైటీషియన్‌ను సంప్రదించండి. యూట్యూబుల్లో, ఇన్స్‌టాగ్రాం రీల్స్‌లో చూసి ఏ డైట్ తీసుకోవానే నిర్ణయాలకు రావద్దు.
ప్రొటీన్ పౌడర్ డేంజర్
ప్రొటీన్ పౌడర్ రుచిగా తియ్యగా ఉండడానికి చెక్కరను రకరకాల తియ్యటి పదార్థాలను కలుపుతారు. అందులో ఉపయోగించే ఇంగ్రీడియంట్లు శరీరానికి ఎలర్జిటిక్‌గా వుంటాయ్. క్రీడాకారులు కూడా బ్యాన్ చేసిన కొన్ని ప్రొటీన్ పౌడర్లను ఇప్పటికీ మార్కెట్లో అమ్మడం, వాటిని వినియోగదారులు కొని తీసుకోవడం చాలా ప్రమాదకరం.
సహజంగా ప్రొటీన్ షేక్‌లు
ప్రొటీన్ పౌడర్లకు ప్రత్యమ్నాయం ప్రొటీన్ షేక్‌లను మీరే స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ బనానా ప్రొటీన్‌షేక్‌ను ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ముందుగా రెండు టేబుల్ స్పూన్ల పీనట్ బటర్‌ను ఓ బౌల్‌లో తీసుకోవాలి. దాంట్లో ఒక అరటిపండును చిన్న ముక్కలుగా కోసి వేయాలి. ఒక కప్పు చిక్కటి ఆవు పాలను పోయాలి. ఈ మొత్తం మిక్స్‌ను జ్యూసర్‌లో గ్రైండ్ చేసుకోవాలి. ప్రతీ రోజు ఈ ప్రొటీన్ షేక్‌ను తయారు చేసుకొని తీసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ప్రొటీన్ షేక్‌లో 16 నుంచి 30 గ్రాముల ప్రొటీన్ వుండే అవకాశముంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications