Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
రాత్రిపూట ఈ లక్షణాలు కనబడితే.. మీ కిడ్నీలు చాలా డేంజర్ లో ఉన్నట్లే!
ప్రస్తుతం మనదేశంలో చాలామంది కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ వ్యాధులతో మరణించే వాళ్ల సంఖ్య కూడా కొంతకాలంగా పెరుగుతుంది. ఓ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో 3 కోట్లమందికి పైనే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్నారు. మన శరీరంలో రోజంతా విశ్రాంతి లేకుండా పనిచేయగల అవయవాల్లో కిడ్నీలు కూడా మెయిన్. ముఖ్యమైన విధులను నిర్వర్తించే కిడ్నీలకు ఏదైనా సమస్య ఉంటే అది కొన్ని లక్షణాల గురించి మనకు తెలియజేస్తుంది. ఆ లక్షణాలు మనం ప్రతిరోజూ ఎదుర్కొనే సాధారణ ఆరోగ్య సమస్యల మాదిరిగానే ఉండటం వల్ల చాలా మంది ఈ లక్షణాలను లైట్ తీసుకుంటారు.
కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించి ట్మీట్మెంట్ చేయించడం వాటిని పూర్తిగా నయం చేయవచ్చు. తరచుగా మూత్రపిండాలలో సమస్య ఉంటే దాని లక్షణాలు రాత్రిపూట ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మీ కిడ్నీలు తీవ్రమైన ప్రమాదంలో ఉన్నాయని సూచించే కొన్ని హెచ్చరిక సంకేతాలను ఇక్కడ చూడండి.

రాత్రిపూట ఇలా కనబడితే కిడ్నీ వ్యాధి సంకేతమే
వాపు
మూత్రపిండాల పనితీరు తగ్గినప్పుడు శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది..ఫలితంగా పాదాలు, చీలమండలు వంటి ప్రాంతాలలో వాపు వస్తుంది. అంతేకాకుండా ఈ వాపు రాత్రిపూట ఎక్కువగా కనిపిస్తుంది.
రాత్రిపూట రక్తపోటు
ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రాత్రిపూట అధిక రక్తపోటును అనుభవిస్తే వారి మూత్రపిండాలు దెబ్బతిన్నాయని అర్థం. కాబట్టి మీరు అకస్మాత్తుగా రాత్రిపూట అసాధారణ రక్తపోటు స్థాయిలను ఎదుర్కొంటే వెంటనే హాస్పిటల్ కి వెళ్లి చూయించుకోవాలి.
కండరాల తిమ్మిరి
శరీరంలో కాల్షియం తక్కువగా ఉండి భాస్వరం ఎక్కువగా ఉంట, రాత్రిపూట తీవ్రమైన కండరాల తిమ్మిరికి దారితీయవచ్చు. ఇటువంటి కండరాల తిమ్మిరి మూత్రపిండాల వ్యాధికి ఒక సాధారణ లక్షణం కావచ్చు. కాబట్టి ఈ సమస్యతో బాధపడేవారు వెంటనే డాక్టర్ ని సంప్రదించి వారి సూచనల మేరకు తగిన టెస్ట్ లు చేయించుకోవడం ఉత్తమం.
రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేయడం
రాత్రిపూట తరచుగా మూత్రం పోయాల్సి వస్తుంటే చాలామంది దీనిని డయాబెటిస్ సంకేతంగా భావిస్తారు. కానీ ఇలా మూత్ర విసర్జన చేయడం మీ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడం లేదని సంకేతం కూడా అవొచ్చు. వాస్తవానికి రాత్రిపూట ఎక్కువ మూత్రం విసర్జించడం మూత్రపిండాల వ్యాధికి తొలి సంకేతం.
నిద్ర పట్టకపోవడం
మీకు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉంటే అది రాత్రిపూట నిద్రపోవడం కష్టతరం చేస్తుంది. మీకు కాళ్ళ తిమ్మిరి, దురద ఉంటుంది.దీని ఫలితంగా నిద్రలేమి వస్తుంది. చివరి దశ మూత్రపిండ వ్యాధి ఉన్న రోగులలో 80 శాతం వరకు నిద్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి
స్లీప్ అప్నియా
దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నవారిలో స్లీప్ అప్నియా ఎక్కువగా కనిపిస్తుంది. స్లీప్ అప్నియా అనేది నిద్రలో వాయుమార్గం పాక్షికంగా లేదా పూర్తిగా అడ్డుకోవడం పదే పదే సంభవించడం ద్వారా వర్గీకరించబడుతుంది. ఈ సందర్భంలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది.. ఫలితంగా నిద్ర ప్రభావితమవుతుంది.
దురద
ఎవరైనా రాత్రిళ్లు అధికంగా దురదను అనుభవిస్తే అది కూడా కిడ్నీ వ్యాధి సంకేతమే. ఎందుకంటే మూత్రపిండాల పనితీరు దెబ్బతింటే రక్తంలో విషపదార్థాలు పేరుకుపోయి అలాంటి దురదలు రావచ్చు. ఈ దురద రాత్రిపూట తీవ్రంగా ఉంటుంది, నిద్రను ప్రభావితం చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications